కర్ణాకలోని మెడికల్ కాలేజీలో 33 కరోనా పాజిటివ్ కేసులు రిపోర్ట్ అయ్యాయి. వీరిలో కరోనా లక్షణాలేవీ లేవు. కరోనా పాజిటివ్ వచ్చిన వారిని ప్రత్యేకంగా సెల్ఫ్ ఐసొలేషన్‌లోకి పంపించారు. కరోనా పాజిటివ్ వచ్చిన తర్వాత వారి శాంపిళ్లు అన్నింటటిని జీనోమ్ సీక్వెన్సింగ్‌కు పంపారు.
బెంగళూరు: దేశవ్యాప్తంగా కరోనా వైరస్(Coronavirus) కొత్త వేరియంట్ ఒమిక్రాన్(Omicron Variant) కేసులు పెరుగుతున్నాయి. నాలుగు వందలకుపైగా కేసులు నమోదయ్యాయి. ఈ నేపథ్యంలోనే కరోనా పాజిటివ్ కేసులు రిపోర్ట్ కావడంతో.. ఎక్కడ ఒమిక్రాన్ వేరియంటేమో అనే భయాలు ఏర్పడుతున్నాయి. ఇప్పటి వరకు విదేశాల్లో తిరిగి వచ్చిన వారిలోనే ఈ వేరియంట్ కేసులు నమోదయ్యాయి. కానీ, కొన్నాళ్లుగా విదేశాలు తిరిగిన చరిత్ర లేనివారిలోనూ ఒమిక్రాన్ వేరియంట్ కేసులు రిపోర్ట్ కావడం కలకలం రేపుతున్నది. ఈ భయాలు ఇలా ఉన్న సందర్భంలోనే తాజాగా, కర్ణాటక(Karnataka)లోని మెడికల్ కాలేజీలో ఏకంగా 33 మందికి కరోనా పాజిటివ్ అని తేలింది. కొలార్‌లోని దేవరాజు యుర్స్ మెడికల్ కాలేజీలో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది.
రాష్ట్ర ప్రభుత్వం కొలార్‌లోని దేవరాజు యుర్స్ మెడికల్ కాలేజీ 1160 మంది విద్యార్థులు, స్టాఫ్ సిబ్బందికి కరోనా పరీక్షలు చేపట్టింది. ఇందులో 33 మందికి కరోనా పాజిటివ్ అని తెలిసింది. పాజిటివ్ తేలిన పేషెంట్లలో చాలా మందిలో కరోనా లక్షణాలేవీ కనిపంచలేవు. చాలా మందిలో లక్షణాలు లేవు. ప్రస్తుతం వారి ఆరోగ్యం నిలకడగా ఉన్నదని అధికారులు తెలిపారు. కాగా, ఈ కాలేజీ ప్రాంగణాన్ని అధికారులు కరోనా క్లస్టర్‌గా ప్రకటించారు. కరోనా పాజిటివ్ అని తేలినవారికి విదేశాల్లో ప్రయాణించిన చరిత్ర లేదు. అయినప్పటికీ వీరి శాంపిళ్లను జీనోమ్ సీక్వెన్సింగ్ కోసం అధికారులు పంపారు. ఈ పరీక్షలో ఒమిక్రాన్ వేరియంట్ కేసును నిర్ధారించడానికి వీలువుతుంది.
Also Read: మహారాష్ట్రలో లాక్‌డౌన్ విధిస్తారా? రాష్ట్ర ఆరోగ్య మంత్రి ఏమన్నారు?
దేశంలో అత్యధికంగా ఒమిక్రాన్ కేసులు మహారాష్ట్రలో రిపోర్ట్ అయ్యాయి. అక్కడ సెంచరీ దాటి పోయాయి. కాగా, కర్ణాటకలోనూ ఒమిక్రాన్ కేసులు రిపోర్ట్ అయ్యాయి. ప్రస్తుతం ఈ రాష్ట్రంలో ఒమిక్రాన్ కేసులు సంఖ్య 31గా ఉన్నాయి. కాగా, ఇందుల 15 రికరవీ అయ్యాయి.
కర్ణాటకలో యాక్టివ్ కేసులు 7,251కి పెరిగాయి.
మహారాష్ట్ర ఆరోగ్య మంత్రి రాజేష్ తోపే ఈ నెల 25వ తేదీన విలేకరులతో మాట్లాడారు. రాష్ట్రంలో ఒమిక్రాన్ కేసులు ఎక్కువగా నమోదు అవుతున్నాయని ఆయన చెప్పారు. కానీ, ఆ వేరియంట్ కేసులు పెరుగుతున్నందున ఐసీయూ బెడ్ల డిమాండ్, ఆక్సిజన్ కొరత ఏర్పడటం లేదని కొంత ఊరట ఇచ్చే విషయాన్ని వివరించారు. అయితే, రాష్ట్రంలో రోజుకు 800 మెట్రిక్ టన్నులకు ఆక్సిజన్ డిమాండ్ చేరితే.. అప్పుడు లాక్‌డౌన్ విధిస్తామని అన్నారు. ప్రజలు మరింత ఆంక్షల్లో బంధీలుగా మారాలని తాను కోరుకోవడం లేదని, మరిన్ని ఆంక్షలు వారి ఎదుర్కోవాలనీ అనుకోవడం లేదని తెలిపారు. అందుకే ప్రజలు కోవిడ్ బిహేవియర్ పాటించాలని అన్నారు. మాస్కు ధరించడం చాలా ముఖ్యమని ఆయన సూచించారు.
Also Read: భారత్‌లోనూ బూస్టర్ డోస్.. ముందుగా ఫ్రంట్‌లైన్ వర్కర్స్‌కి: ప్రధాని మోడీ కీలక ప్రకటన
15కు మించి రాష్ట్రాల్లో ఈ వేరియంట్ రిపోర్ట్ అయింది. అన్ని రాష్ట్రాల్లో కంటే మహారాష్ట్రలో అత్యధికంగా ఈ వేరియంట్ కేసులు నమోదయ్యాయి. ఈ రాష్ట్రంలో ఒమిక్రాన్ వేరియంట్ కేసులు వందను క్రాస్ చేశాయి. ఈ వేరియంట్‌ను కట్టడి చేయడానికి ఇప్పటికే మహారాష్ట్ర నైట్ కర్ఫ్యూ సహా పలు ఆంక్షలు అమలు చేస్తున్నది. తాజాగా, ఆ రాష్ట్రంలో లాక్‌డౌన్ విధించే అంశంపై రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి రాజేష్ తోపే మాట్లాడారు. ఒమిక్రాన్ వేరియంట్ కేసులు అనూహ్యంగా పెరుగుతున్నాయని అన్నారు. అయితే, ఈ వేరియంట్ బారిన పడ్డ పేషెంట్లు ఐసీయూల్లో అడ్మిట్ కావాల్సిన అవసరమో లేక ఆక్సిజన్(Oxygen) సప్లిమెంట్ అవసరమో ఏర్పడటం లేదని వివరించారు.
