Asianet News TeluguAsianet News Telugu

మహారాష్ట్రలో లాక్‌డౌన్ విధిస్తారా? రాష్ట్ర ఆరోగ్య మంత్రి ఏమన్నారు?

ఒమిక్రాన్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో చాలా రాష్ట్రాల్లో మళ్లీ ఆంక్షలు విధిస్తున్నారు. వేడుకలపై ఆంక్షలు.. నైట్ కర్ఫ్యూ వంటి ఆంక్షలు అమలు అవుతున్నాయి. ఈ ఆంక్షలు లాక్‌డౌన్ వరకు వెళ్తాయా? అనే అంశంపై చర్చ జరుగుతున్నది. ఈ నేపథ్యంలోనే మహారాష్ట్ర మంత్రి దీనిపై మాట్లాడారు. రాష్ట్రంలో మెడికల్ ఆక్సిజన్ డిమాండ్ రోజుకు 800 మెట్రిక్ టన్నులు అవసరం ఉందనే డిమాండ్ వస్తే అప్పుడు లాక్‌డౌన్ విధిస్తామని వివరించారు.

lockdown will impose in maharashtra when oxygen demand rises
Author
Mumbai, First Published Dec 25, 2021, 11:06 PM IST

ముంబయి: కరోనా వైరస్(Coronavirus) కొత్త వేరియంట్ Omicron వేగంగా విస్తరిస్తున్నది. 15కు మించి రాష్ట్రాల్లో ఈ వేరియంట్ రిపోర్ట్ అయింది. అన్ని రాష్ట్రాల్లో కంటే మహారాష్ట్రలో అత్యధికంగా ఈ వేరియంట్ కేసులు నమోదయ్యాయి. ఈ రాష్ట్రంలో ఒమిక్రాన్ వేరియంట్ కేసులు వందను క్రాస్ చేశాయి. ఈ వేరియంట్‌ను కట్టడి చేయడానికి ఇప్పటికే మహారాష్ట్ర నైట్ కర్ఫ్యూ సహా పలు ఆంక్షలు అమలు చేస్తున్నది. తాజాగా, ఆ రాష్ట్రంలో లాక్‌డౌన్ విధించే అంశంపై రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి రాజేష్ తోపే మాట్లాడారు. ఒమిక్రాన్ వేరియంట్ కేసులు అనూహ్యంగా పెరుగుతున్నాయని అన్నారు. అయితే, ఈ వేరియంట్ బారిన పడ్డ పేషెంట్లు ఐసీయూల్లో అడ్మిట్ కావాల్సిన అవసరమో లేక ఆక్సిజన్(Oxygen) సప్లిమెంట్ అవసరమో ఏర్పడటం లేదని వివరించారు. అలాగే, రాష్ట్రంలో లాక్‌డౌన్(Lockdown) విధించే అంశాన్ని ఆయన ప్రస్తావించారు. మెడికల్ ఆక్సిజన్ డిమాండ్ ఒక రోజుకు 800 మెట్రిక్ టన్నులకు చేరితే అప్పుడు రాష్ట్రంలో లాక్‌డౌన్ విధిస్తామని చెప్పారు.

మహారాష్ట్ర ఆరోగ్య మంత్రి రాజేష్ తోపే ఈ రోజు విలేకరులతో మాట్లాడారు. రాష్ట్రంలో ఒమిక్రాన్ కేసులు ఎక్కువగా నమోదు అవుతున్నాయని ఆయన చెప్పారు. కానీ, ఆ వేరియంట్ కేసులు పెరుగుతున్నందున ఐసీయూ బెడ్ల డిమాండ్, ఆక్సిజన్ కొరత ఏర్పడటం లేదని కొంత ఊరట ఇచ్చే విషయాన్ని వివరించారు. అయితే, రాష్ట్రంలో రోజుకు 800 మెట్రిక్ టన్నులకు ఆక్సిజన్ డిమాండ్ చేరితే.. అప్పుడు లాక్‌డౌన్ విధిస్తామని అన్నారు. ప్రజలు మరింత ఆంక్షల్లో బంధీలుగా మారాలని తాను కోరుకోవడం లేదని, మరిన్ని ఆంక్షలు వారి ఎదుర్కోవాలనీ అనుకోవడం లేదని తెలిపారు. అందుకే ప్రజలు కోవిడ్ బిహేవియర్ పాటించాలని అన్నారు. మాస్కు ధరించడం చాలా ముఖ్యమని ఆయన సూచించారు.

Also Read: Omicron Cases In India: భారత్‌లో 415కి చేరిన ఒమిక్రాన్ కేసులు.. ఏ రాష్ట్రంలో ఎన్ని కేసులంటే..?

ఒమిక్రాన్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం నైట్ కర్ఫ్యూ విధించింది. రాత్రి 9 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు బహిరంగ ప్రదేశాల్లో ఐదుగురికి మించి గుమిగూడటాన్ని నిషేధించింది. అలాగే, క్రిస్మస్‌కు సంబంధించి ప్రత్యేకంగా ఆంక్షలు విధించింది. క్రిస్మస్ రోజున చర్చిల్లో హాజరయ్యే క్రిస్టియన్ల సంఖ్యపై పరిమితి విధించింది. చర్చిలో 50శాతం సీటింగ్ కెపాసిటీకే అనుమతి ఇచ్చింది. చర్చిలో ఒక్కసారి ప్రజలు గుమిగూడే అవకాశాలను నివారించాలి. భౌతిక దూరం పాటించడంపై రాజీ ఉండకూడదు. మాస్కులు ధరించడం, శానిటైజర్ వినియోగాన్ని మరోసారి ఒత్తి పలికింది. అంతేకాదు, చర్చి ప్రాంగణంలోనూ డిస్‌ఇన్‌ఫెక్షన్ చేపట్టాలని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది.

ప్పటివరకు దేశంలో 415 ఒమిక్రాన్ కేసుల నమోదైనట్టుగా కేంద్ర ఆరోగ్య శాఖ శనివారం ఉదయం వెల్లడించింది. అందులో 115 మంది కోలుకున్నట్టుగా (Recovered From Omicron) తెలిపింది. మహారాష్ట్రలో అత్యధికంగా 108 ఒమిక్రాన్ కేసులు నమోదైనట్టుగా పేర్కొంది. ఆ తర్వాత 79 కేసులతో ఢిల్లీ రెండో స్థానంలో నిలిచింది. ఇప్పటివరకే ఇండియాలో 17 రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాలకు ఒమిక్రాన్ వేరియంట్ విస్తరించింది. 

Also Read: గల్ఫ్ నుంచి వచ్చిన వ్యక్తికి ఒమిక్రాన్.. సెల్ఫ్ లాక్ డౌన్ లో గూడెం గ్రామం..

ఇప్పటివరకు.. మహారాష్ట్ర‌లో 108, ఢిల్లీలో 79, గుజరాత్‌లో 43, తెలంగాణలో 38, కేరళలో 37, తమిళనాడులో 34, కర్ణాటకలో 31, రాజస్థాన్‌లో 22, హర్యానాలో 4 , ఒడిశాలో 4,  ఆంధ్రప్రదేశ్‌లో 4, జమ్మూ కాశ్మీర్‌లో 3 పశ్చిమ బెంగాల్‌లో 3, ఉత్తర ప్రదేశ్‌లో 2, చండీగఢ్, ఉత్తరాఖండ్, లడఖ్‌లలో ఒకటి చొప్పున ఒమిక్రాన్ కేసులు నమోదయ్యాయి.

Follow Us:
Download App:
  • android
  • ios