Asianet News TeluguAsianet News Telugu

కుంభమేళాలో 30మంది సాధువులకు కరోనా పాజిటివ్

అందులో పాల్గొన్న 30మంది సాధువులకు కరోనా సోకినట్లు గుర్తించారు. వారిలో.. ఆల్ ఇండియా అఖండ పరిషత్ నాయకుడు మహత్ నరేంద్ర గిరి కూడా ఉన్నారు. ఆయన పరిస్థితి విషమంగా ఉండటంతో రిషికేష్ లోని ఎయిమ్స్ ఆస్పత్రిలో చేర్పించారు.

30 Sadhus At Kumbh Mela In Haridwar Test Postive For Covid
Author
Hyderabad, First Published Apr 16, 2021, 10:28 AM IST

కుంభమేళాలో పాల్గొన్న 30మంది సాధువులకు కరోనా పాజిటివ్ గా నిర్థారణ అయ్యింది. ఉత్తరాఖండ్ హరిద్వార్ లో ప్రస్తుతం కుంభమేళా జరుగుతున్న సంగతి తెలిసిందే. అందులో పాల్గొన్న 30మంది సాధువులకు కరోనా సోకినట్లు గుర్తించారు. వారిలో.. ఆల్ ఇండియా అఖండ పరిషత్ నాయకుడు మహత్ నరేంద్ర గిరి కూడా ఉన్నారు. ఆయన పరిస్థితి విషమంగా ఉండటంతో రిషికేష్ లోని ఎయిమ్స్ ఆస్పత్రిలో చేర్పించారు.

అఖాడాల‌కు వైద్య బృందాలు వెళ్తున్నాయ‌ని, అక్క‌డ ఉండే సాధువుల‌కు ఆర్‌సీ పీసీఆర్ ప‌రీక్ష‌లు నిరంత‌రం చేస్తున్నార‌ని ఆయ‌న తెలిపారు. హ‌రిద్వార్‌లో క్రిటిక‌ల్‌గా ఉన్న కేసుల‌ను రిషికేశ్‌లో ఉన్న ఎయిమ్స్‌కు త‌ర‌లిస్తున్న‌ట్లు చెప్పారు. స్థానిక ప్ర‌జ‌ల‌ను మాత్రం హోం ఐసోలేష‌న్‌లోకి పంపిస్తున్న‌ట్లు తెలిపారు. ఇత‌ర ప్రాంతాల నుంచి వ‌చ్చిన వారిని హాస్పిట‌ల్‌లో చేర్పిస్తున్నారు. హ‌రిద్వార్‌లో ఉన్న హాస్పిట‌ళ్ల‌లో ఎటువంటి ఆందోళ‌నక‌ర ప‌రిస్థితి లేద‌న్నారు.

హ‌రిద్వార్‌లో నిన్న ఒక్క రోజే 600 కొత్త క‌రోనా వైర‌స్ కేసులు న‌మోదు అయ్యాయి. అక్క‌డ ఉన్న నిరంజ‌నీ మ‌ఠం ఈ నేప‌థ్యంలో ఓ హెచ్చ‌రిక జారీ చేసింది. కుంభ‌మేళాలో పాల్గొంటున్న సాధువులంతా వెళ్లిపోవాలంటూ పేర్కొన్న‌ది. నిరంజ‌నీ అఖారా కార్య‌ద‌ర్శి ర‌వీంద్ర పురి మాట్లాడుతూ.. పెరుగుతున్న కోవిడ్ కేసుల వ‌ల్ల హ‌రిద్వార్‌లో ప‌రిస్థితి ఆందోళ‌న‌క‌రంగా ఉంద‌ని, గంగా న‌దిలో పుణ్యం స్నానం చేసిన సాధువులంతా త‌మ త‌మ స్వ‌స్థ‌లాల‌కు వెళ్లిపోవాలంటూ కోరామ‌ని చెప్పారు. హ‌రిద్వార్‌లో సుమారు 13 అఖారాలు ఉన్నాయి. వాటిల్లో ల‌క్ష‌లాది మంది సాధువులు ఉంటున్నారు.

Follow Us:
Download App:
  • android
  • ios