30 గంటల సదీర్ఘ ఆపరేషన్, బోరుబావిలో పడిన చిన్నారి సురక్షితం

3-year-old girl, who fell into borewell shaft, rescued
Highlights

దాదాపు 225 అడుగుల లోతున్న బోరు బావిలో పడిన చిన్నారి ఘటన చివరకు సుఖాంతమైంది.  ఇంచుమించు రెండు రోజుల సుధీర్ఘ ఆపరేషన్ తర్వాత సహాయక  చిన్నారిని  సురక్షితంగా బైటికి తీశారు. దీంతో పాప తల్లిదండ్రులతో పాటు గ్రామస్థులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. 

దాదాపు 225 అడుగుల లోతున్న బోరు బావిలో పడిన చిన్నారి ఘటన చివరకు సుఖాంతమైంది.  ఇంచుమించు రెండు రోజుల సుధీర్ఘ ఆపరేషన్ తర్వాత సహాయక  చిన్నారిని  సురక్షితంగా బైటికి తీశారు. దీంతో పాప తల్లిదండ్రులతో పాటు గ్రామస్థులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. 

బీహార్ లోని ముంగేర్ జిల్లాలోని ముర్గియాచక్ గ్రామ సమీపంలో ఓ వ్యక్తి బోరుబావిని తవ్వించి అందులో నీరు రాకపోయేసరికి అలాగే పూడ్చకుండా వదిలేశాడు. దీంతో ఆ గ్రామంలోని అమ్మమ్మ వాళ్ళ ఇంటికి కొత్తగా వచ్చిన ఓ మూడేళ్ల చిన్నారి ఆడుకుంటూ వెళ్లి బోరుబావిలో పడిపోయింది. ఈ ఘటన మంగళవారం జరగ్గా... అప్పటినుండి పాపను బైటికి తీయడానికి సహాయక చర్యలు కొనసాగుతూనే ఉన్నాయి.  

225 అడుగుల లోతున్న బోరుబావిలో చిన్నారి 165 అడుగుల లోతులో చిక్కుకున్నట్లు సహాయక చర్యలు చేపడుతున్న ఎన్‌డీఆర్‌ఎఫ్‌, ఎన్‌డీఆర్‌ఎఫ్‌ సిబ్బంది గుర్తించారు. మొదట బోరుబావిలోకి ఆక్సిజన్ పైపులు, సిసి కెమెరాలను పంపించి చిన్నారి కదలికలను ఎప్పటికప్పుడు గుర్తించారు. ఆ బోరుబావికి సమాంతరంగా గోతిని తవ్వి దాదాపు 30 గంటలపాటు కష్టపడి చిన్నారిని కాపాడారు. పాప ప్రాణాలతో సురక్షితంగా బైటపడటంతో తల్లిదండ్రులతో పాటు గ్రామస్థులు ఆనందం వ్యక్తం చేశారు.

ఈ ఘటనపై ముఖ్యమంత్రి నితీశ్‌ కుమార్‌ ఎప్పటికపుడు ప్రత్యేకంగా పర్యవేక్షించారు. ఆయన సహాయక చర్యల గురించి తనతో ఎప్పటికపుడు ఆరాతీశారని ముంగేర్‌ జిల్లా ఎస్పీ గౌరవ్‌ మంగ్లా తెలిపారు.
 
 

loader