మధ్యప్రదేశ్‌లోని ఓ బోరు బావిలో మూడేళ్ల చిన్నారి పడిపోయింది. ఈ విషయం తెలుసుకున్న జిల్లా యంత్రాంగం, సహాయక సిబ్బంది తక్షణమే స్పందించింది. మూడే గంటల్లో ఆ చిన్నారి బాలికను సురక్షితంగా బయటకు తీశారు. 

భోపాల్: మధ్యప్రదేశ్‌లో బోరు బావిలో ఓ మూడేళ్ల చిన్నారి పడింది. ఈ ఘటనపై సహాయక సిబ్బంది తక్షణమే స్పందించింది. యుద్ధ ప్రాతిపదికన రంగంలోకి దిగిన ఈ బృందం మూడు గంటల్లోనే చిన్నారిని సురక్షితంగా కాపాడి బయటకు తీసింది. ఈ ఘటన మధ్యప్రదేశ్ ఛత్తర్‌పూర్ జిల్లా లాల్‌గౌన్ పాలి గ్రామంలో ఆదివారం సాయంత్రం చోటుచేసుకుంది.

ఈ విషయాన్ని మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ స్వయంగా ట్విట్టర్ వేదికగా వెల్లడించారు. మూడేళ్ల నాన్సి అనే చిన్నారి బోరు బావిలో పడింది. ఆమెను సురక్షితంగా బయటకు తీసినట్టు శివరాజ్ సింగ్ చౌహాన్ వెల్లడించారు. ఆ బాలిక తల్లితో తాను ఫోన్‌లో మాట్లాడినట్టు వివరించారు. బాలిక సురక్షితంగా బయటకు రావడంపై సంతోషాన్ని వ్యక్తం చేశారు. జనరల్ చెకప్ కోసం బాలికను హాస్పిటల్ తీసుకెళ్లినట్టు వివరించారు. 

బోరు బావిలో పడిన నాన్సి సుమారు 30 అడుగుల లోతులో చిక్కుకుందని అధికారులు తెలిపారు. జేసీబీ సహా ఇతర టూల్స్ ఉపయోగించి చిన్నారి పాపను కాపాడినట్టు వారు చెప్పారు.

Also Read: Exit Polls: నాగాల్యాండ్‌ మళ్లీ బీజేపీ కూటమిదే.. స్పష్టమైన మెజార్టీ వచ్చే ఛాన్స్

గతేడాది జూన్ నెల లోనూ మధ్య ప్రదేశ్‌లోని ఇదే జిల్లాలో ఇలాంటి ఘటననే చోటుచేసుకుంది. ఐదేళ్ల బాలుడు పొలంలో ఆడుకుంటూ సమీపంలో ఉన్న బోరు బావిని గమనించలేదు. అందులో పడిపోయాడు. రెస్క్యూ సిబ్బంది సుమారు 8 గంటలపాటు శ్రమించి అతడి ని సురక్షితంగా బయటకు తీశారు.