ప్రైవేట్ హాస్టల్‌లో పాము కాటుతో ముగ్గురు విద్యార్థుల దుర్మరణం..
ఓ ప్రైవేట్ హాస్టల్‌లో పాముకాటుతో ముగ్గురు విద్యార్థులు మృతి చెందారు. దీంతో వారి కుటుంబాల్లో తీవ్ర విషాదం నెలకొంది.

ఓ ప్రైవేట్ హాస్టల్‌లో పాముకాటుతో ముగ్గురు విద్యార్థులు మృతి చెందారు. దీంతో వారి కుటుంబాల్లో తీవ్ర విషాదం నెలకొంది. ఈ ఘటన ఒడిశాలోని యోంఝర్ జిల్లాలోని బరియా ప్రాంతంలో శనివారం చోటుచేసుకుంది. వివరాలు.. బరియా ప్రాంతంలోని నిశ్చింతపూర్ గ్రామంలోని కోచింగ్ సెంటర్ హాస్టల్‌లో విద్యార్థులు నేలపై నిద్రిస్తున్న సమయంలో నలుగురు విద్యార్థులను విషపూరిత పాము కాటు వేసింది. దీంతో నలుగురు విద్యార్థులను కియోంజర్‌లోని జిల్లా ప్రధాన ఆసుపత్రి (డిహెచ్‌హెచ్)కి తరలించారు. అక్కడ ముగ్గురు విద్యార్థులు మరణించినట్లు ప్రకటించారు.
మరో విద్యార్థి పరిస్థితి విషమంగా ఉన్న ఉండటంతో మెరుగైన చికిత్స కోసం కటక్‌లోని ఎస్‌సీబీ మెడికల్ కాలేజీ అండ్ ఆసుపత్రికి తరలించినట్లు పోలీసులు తెలిపారు. మృతిచెందిన విద్యార్థులను రాజా నాయక్ (12), షెహశ్రీ నాయక్ (11), ఎలీనా నాయక్ (12)గా గుర్తించారు. ఆకాష్ నాయక్ (12) అనే వ్యక్తి కటక్‌లో చికిత్స పొందుతున్నట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటన బాధిత కుటుంబాల్లో తీవ్ర విషాదం నింపింది. ఈ ఘటనతో మిగిలిన విద్యార్థులతో పాటు ఆ ప్రాంతంలోని వారు తీవ్ర ఆందోళన చెందుతున్నారు.