ముంబైలో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. శాంతాక్రూజ్‌లోని గెలాక్సీ హోటల్‌లో అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో ముగ్గురు వ్యక్తులు మరణించారు.
ముంబైలో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. శాంతాక్రూజ్‌లోని గెలాక్సీ హోటల్‌లో అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో ముగ్గురు వ్యక్తులు మరణించారు. మరో ఇద్దరు గాయపడ్డారు. ఈ ఘటన ఆదివారం మధ్యాహ్నం 1 గంటకు జరిగినట్లు సమాచారం. ఈ ప్రమాదంపై సమాచారం అందుకున్న వెంటనే అగ్నిమాపక సిబ్బంది అక్కడికి చేరుకున్నారు. నాలుగు అగ్నిమాపక యంత్రాల ద్వారా ఘటన స్థలంలో మంటలను అదుపు చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. ప్రస్తుతం ఘటన స్థలంలో మంటలను ఆర్పేందుకు, భవనంలో చిక్కుకున్న వారిని రక్షించేందుకు ప్రయత్నాలు కొనసాగుతున్నాయి.
ఈ ప్రమాదం నేపథ్యంలో ఎనిమిది మందిని అక్కడి నుంచి రక్షించి ఆసుపత్రికి తరలించినట్లు అగ్నిమాపక అధికారి ఒకరు తెలిపారు. అగ్నిమాపక చర్యలు కొనసాగుతున్నాయని అధికారులు తెలిపారు. అయితే ఈ అగ్ని ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది.
