Asianet News TeluguAsianet News Telugu

ముందు వెనుకా యువతులను కూర్చోబెట్టుకుని బైక్ స్టంట్.. సోషల్ మీడియాలో వీడియో.. కేసు నమోదు

ముంబయిలో ఓ బైకర్ ప్రమాదకరమైన స్టంట్ వేశారు. ముందు ఒక యువతిని, వెనుకాల ఒక యువతిని కూర్చోబెట్టుకుని ఆ బైకర్ బైక్ ముందు చక్రాన్ని గాల్లోకి లేపాడు.
 

3 mumbai youths dangerous bike stunts video viral, police registers case kms
Author
First Published Apr 1, 2023, 1:13 PM IST

ముంబయి: ఓ యువకుడు తన బైక్ పై ముందొక యువతిని, వెనుకాల ఒక యువతిని కూర్చోబెట్టుకుని స్టంట్ చేశాడు. ఆ స్టంట్‌ను వీడియో కూడా తీశారు. బైక్ ముందటి వీల్‌ను గాల్లోకి పైకి లేపాడు. బైక్ వెనుక చక్రం మీదనే నడిపించాడు. ముందున్న యువతిని ఆ బైకర్‌ను హగ్ చేసుకుని ఉంది. వెనుకాలే ఉన్న యువతి కూడా అనివార్యంగా బైకర్‌ను గట్టిగా పట్టుకుని ఉన్నది. ఈ వీడియో సోషల్ మీడియాకు ఎక్కింది. ముంబయి పోలీసుల దృష్టికీ వెళ్లింది. దీంతో పోలీసులు కేసు నమోదు చేశారు. ఆ ముగ్గురిలో ఎవరికీ హెల్మెట్ లేదు. 

ఈ వీడియోను ముంబయి పోలీసులు ట్వీట్ చేస్తూ వార్నింగ్ ఇచ్చారు. ఈ ముగ్గురిపై బీకేసీ పోలీసు స్టేషన్‌లో కేసు ఫైల్ అయినట్టు వివరించారు. వారిని గుర్తించడానికి దర్యాప్తు మొదలు పెట్టామని తెలిపారు. ఈ వీడియోలో ఉన్న వారి గురించి ఎవరికి ఎలాంటి సమాచారం ఉన్నా తమకు తెలియజేయాలని, నేరుగా తమకు డీఎం చేయవచ్చని పేర్కొన్నారు.

ఈ వీడియోను ఫస్ట్ పాట్‌హోల్ వారియర్స్ ఫౌండేషన్ ట్వీట్ చేసింది. ఇద్దరు పిలియన్ రైడర్లతో డేంజరస్ స్టంట్ వేశాడని, హెల్మెట్ కూడా ధరించలేదని పేర్కొంది. ఆ ట్వీట్‌లో వారు బైక్ రిజిస్ట్రేషన్ నెంబర్ కూడా తెలిపింది.

Also Read: కోయంబత్తూర్ లో మొదటి మహిళా బస్ డ్రైవర్ గా షర్మిల.. (వీడియో)

వీరికి జరిమానా విధిస్తామని, కేవలం జరిమానానే కాదు కేసు కూడా ఫైల్ చేస్తామని ముంబయి పోలీసులు మరో ట్వీట్‌లో తెలిపారు. ఈ వీడియోలో కనిపిస్తున్నవారిపై కేసు నమోదు చేశామని, వారు న్యాయపరమైన చర్యలూ ఎదుర్కోవాల్సి ఉంటుందని వివరించారు. ఆ ఇద్దరు మహిళలపైనా కేసు నమోదైంది. అదే ఎఫ్ఐఆర్‌లో ఆ ఇద్దరు యువతులపై ఐపీసీలోని 114 సెక్షన్ కింద అభియోగాలు నమోదయ్యాయి.

Follow Us:
Download App:
  • android
  • ios