Asianet News TeluguAsianet News Telugu

15యేళ్ల బాలిక కిడ్నాప్.. 35 యేళ్ల వ్యక్తికి అమ్మేస్తే.. అత్యాచారం, చిత్రహింసలు.. చివరికి రెండు నెలల తరువాత...

ఓ పదిహేనేళ్ల బాలికను కిడ్నాప్ చేసి.. హర్యానాకు చెందిన వ్యక్తికి అమ్మేశారు. అతను ఆమె మీద అత్యాచారానికి పాల్పడి, దారుణంగా చిత్రహింసలకు గురి చేశాడు. 

15years old girl kidnap, sale.. molestated in chattisgarh
Author
First Published Dec 23, 2022, 6:56 AM IST

చతిస్ గఢ్ : అమ్మాయిల అక్రమ రవాణా, వారిని ప్రాస్టిట్యూషన్ లోకి దింపడం.. కిడ్నాప్, అత్యాచారం, హత్య… ఇలాంటి నేరాలు  రోజూ ఏదో ఒకచోట ఏదో ఒక రూపంలో జరుగుతూనే ఉన్నాయి. అమ్మాయిలకు భద్రత లేకుండా పోతుంది. తల్లిదండ్రులతో,  కుటుంబంతో సరదాగా కలిసి ఉన్న ఓ అమ్మాయి విషయంలో ఇదే జరిగింది. చతిస్ గఢ్ కు చెందిన ఓ పదిహేనేళ్ల బాలిక  కిడ్నాప్ అయింది. ఆ తర్వాత ఆమెను  అమ్మేశారు. దాదాపు రెండు నెలల తర్వాత పోలీసులు ఆ బాలికను  కాపాడారు. ఈ ఘటనకు సంబంధించిన వివరాల్లోకి వెళితే.. 

కిడ్నాప్ చేసి, అమ్మేయబడిన ఆ బాలిక లైంగిక అత్యాచారానికి గురయ్యింది. చిత్రవధ  అనుభవించింది. ఈ దారుణమైన ఘటన హర్యానాలో చోటు చేసుకుంది. అక్టోబర్ 11న చతిస్ గఢ్ కు చెందిన ఓ పదిహేనేళ్ల బాలిక తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులతో కలిసి దసరా ఉత్సవాలను చూసేందుకు వెడుతోంది. ఆ సమయంలో కొందరు  గుర్తుతెలియని వ్యక్తులు ఆమెను ఎత్తుకెళ్లారు. అలా ఎత్తుకెళ్లిన ఆమెను  హర్యానాలోని సోనీపట్ కు చెందిన.ఓ 35యేళ్ల వ్యక్తికి అమ్మేశారు. డబ్బులు పోసి కొనుక్కున్న అతను ఆమెమీద పలుమార్లు అత్యంత దారుణంగా అత్యాచారానికి పాల్పడ్డాడు. ఆ చిన్నారి  ప్రతిఘటిస్తే చిత్రహింసలు పెట్టాడు.

మరోవైపు కుటుంబ సభ్యులు బాలిక  అపహరణ విషయాన్ని పోలీసులకు ఫిర్యాదు చేశారు.  దీంతో పట్నా స్టేషన్ పోలీసులు ఈ కిడ్నాప్ విషయాన్ని ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నారు. కేసు దర్యాప్తులో భాగంగా పలువురు అనుమానితులను గట్టిగా విచారించారు.  దీంతో అసలు నిందితులు దొరికారు. వారిని తమదైన శైలిలో విచారించగా మొత్తం సమాచారం తెలిపారు. దాని ప్రకారం హర్యానాలోని 35యేళ్ల వ్యక్తి అయిన బాలికను కొన్న వ్యక్తి ఇంటికి వెళ్లారు. అక్కడ బాలికను అతడి నుంచి రక్షించారు. ఈ కేసులో ఇద్దరు మహిళలు కూడా ఉండడం దారుణం. వారితో సహా ఏడుగురు నిందితులను మంగళవారం పోలీసులు అరెస్టు చేశారు. దీనికి సంబంధించిన వివరాలను పోలీసులు గురువారం వెల్లడించారు. 

108 రోజుల తరువాత డిశ్చార్జ్ అయిన డాక్టర్ అన్హిత పండోల్.. ఇంతకీ ఆమె ఎవరు?

ఇదిలా ఉండగా, ఏడేళ్ల బాలికకు చాక్లెట్ ఆశచూపి లైంగిక దాడికి పాల్పడిన కేసులో 69యేళ్ల వ్యక్తికి 20యేళ్ల కఠిన కారాగారశిక్ష పడింది. పోక్సో (లైంగిక నేరాల నుంచి బాలల రక్షణ చట్టం) కేసులో 69 ఏళ్ల వ్యక్తికి 20 ఏళ్ల కఠిన కారాగార శిక్ష విధిస్తూ ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్నంలోని ప్రత్యేక న్యాయమూర్తి డిసెంబర్ 19న తీర్పు చెప్పారు. నగర పోలీసులు 24 నెలల్లో నిందితులను దోషులుగా నిర్ధారించిన ఆధారాలను కోర్టు ముందుంచారు.

ఈ కేసుకు సంబంధించి.. నగర పోలీసు కమిషనర్ సిహెచ్ శ్రీకాంత్ తెలిపిన వివరాల ప్రకారం, ఎంవిపి పోలీస్ స్టేషన్ పరిధిలోని హెచ్‌బి కాలనీకి చెందిన రిటైర్డ్ ఆర్‌టిసి ఉద్యోగి సారిక వెంకట రమణ అలియాస్ విజయ్ రాజు అలియాస్ చాక్లెట్ అంకుల్ ఈ నేరానికి పాల్పడ్డాడు. ఈ సంఘటన డిసెంబర్ 15, 2020 న జరిగింది. నిందితుడు పిల్లలకు చాక్లెట్లు ఆశచూపి తన ఇంటికి తీసుకెళ్లేవాడు. అలాగే ఏడేళ్ల బాలిక 2020 డిసెంబర్ 15న మధ్యాహ్నం 2 గంటల సమయంలో తన ఇంటి బయట ఆడుకుంటుండగా చాక్లెట్ ఇస్తానని ఆమెకు ఆశపెట్టి పిలిచాడు. 

అలా ఆమెను తన ఇంటికి తీసుకెళ్లి బాలికపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. సాయంత్రం పని నుండి తిరిగి వచ్చిన బాధిత బాలిక తల్లి విషయం తెలుసుకుని పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో అతని మీద ఐపీసీ సెక్షన్లు 366,  376, సెక్షన్ 6 POCSO చట్టం 2012లోని 5 (ఎం)తో సెక్షన్ల కింద ఎంవీపీ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదయ్యింది.పోలీసులు అన్ని ఆధారాలను సేకరించి కోర్టులో చార్జిషీట్ దాఖలు చేశారు.

Follow Us:
Download App:
  • android
  • ios