Asianet News TeluguAsianet News Telugu

దారుణం : తండ్రి అప్పుతీర్చలేదని.. ముగ్గురు అమ్మాయిల్ని ఇంట్లో పెట్టి తాళం వేసి...

తాళం వేసిన తలుపు వెనుక నిలబడి, ఒకమ్మాయి మాట్లాడుతూ "మా నాన్న అప్పు తీర్చలేదని.. కోపంతో మా అమ్మానాన్న ఇంట్లో లేనప్పుడు వచ్చి మమ్మల్ని బంధించారు." అని చెప్పుకొచ్చింది.

3 Girls Locked Up In Home Over Father's Loan, Rescued Hours Later in Tamil Nadu
Author
Hyderabad, First Published Aug 24, 2021, 2:00 PM IST

చెన్నై : తమిళనాడులో దారుణం జరిగింది. తండ్రి అప్పు చేసిన పాపానికి చిన్నారులు కొద్ది గంటలపాటు నరకం అనుభవించారు. తీవ్ర మానసిక వేదన పడ్డారు. చివరికి, స్థానికులు, పోలీసుల సాయంతో ఆ ప్రమాదం నుంచి బయటపడ్డారు. 

తీసుకున్న అప్పుకు ఎక్కువ వడ్డీ కట్టాలంటూ డిమాండ్ చేసిన ఓ వ్యక్తి... అప్పు తీసుకున్న వ్యక్తి కుటుంబాన్ని ఇంట్లో బంధించి.. ఇంటికి తాళం వేశాడు. అమ్మాయిలు అరుస్తున్నా కనీస మానవత్వం చూపించలేదు. ఈ విషయం తెలిసి వెళ్లిన రిపోర్టర్లకు ఓ అమ్మాయి తాళం వేసిన గేటు లోపలినుంచే తమ గోడు వెళ్లబోసుకుంది. 

వివరాల్లోకి వెడితే.. తమిళనాడులో ముగ్గురు అమ్మాయిలను ఓ వ్యక్తి ఇంట్లో పెట్టి తాళం వేశాడు. వారి తండ్రి తన దగ్గర తీసుకున్న అప్పు తిరిగి ఇవ్వడం లేదని ఈ ఘాతుకానికి తెగబడ్డాడు. ఈ ఘటన సోమవారం నాడు జరిగింది. 

తిరువణ్ణామలై జిల్లాలోని బాధితుల ఇంట్లోనే వారిని బంధించాడు. వారిని పోలీసులు రక్షించారు. అయితే ఈ ముగ్గురితో పాటు అమ్మాయిలను కలవడానికి వచ్చిన మరో అమ్మాయి కూడా ఇంట్లో బంధీ అయ్యిందని పోలీసులు తెలిపారు. రఘు (48) ఆర్నిలో రోజుకూలీగా పనిచేస్తున్నాడు. ఆయన స్థానిక ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రైవేట్ సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తున్న కాస్టిన్ రాజన్ దగ్గర అవసరం నిమిత్తం రూ. 3 లక్షలు అప్పు తీసుకున్నట్లు సమాచారం. 

రాజన్, రఘుకి బంధువు అవుతాడు. కాగా అప్పు మూడు లక్షలకు గాను రాజన్ వడ్డీతో సహా రూ.5 లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేశాడు. దీంతో రఘు, రాజన్ లకు కొంత ఘర్షణ జరుగుతుంది. ఇదే క్రమంలో రఘు, రఘు భార్య ఇంట్లో లేని సమయంలో రాజన్ వారి ఇంటికి వెళ్లి అమ్మాయిలను లోపలుంచి తలుపులకు తాళాలు వేశాడు.

మైనర్లతో లైంగికదాడికి గురైన 12ఏళ్ల బాలిక ప్రసవం

ఈ విషయం తెలిసిన స్థానికులు, మీడియాకు పోలీసులకు సమాచారం అందించారు. ఒక మీడియా రిపోర్టర్ లో తాళం వేసిన తలుపు వెనుక నిలబడి, ఒకమ్మాయి మాట్లాడుతూ "మా నాన్న అప్పు తీర్చలేదని.. కోపంతో మా అమ్మానాన్న ఇంట్లో లేనప్పుడు వచ్చి మమ్మల్ని బంధించారు." అని చెప్పుకొచ్చింది.

ఆ తరువాత అక్కడికి చేరుకున్న పోలీసులు అమ్మాయిల్ని విడుదల చేయించి.. ఈ ఘటనకు పాల్పడ్డ నిందితుడ్ని అదుపులోకి తీసుకున్నారు. అమ్మాయిల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు. 

ఈ ఘటన మీద ఒక పోలీస్ అధికారి మాట్లాడుతూ ‘నిందితుడి మీద నిర్భంధం కేసు కేసు నమోదు చేశాం. దర్యాప్తు కొనసాగుతోంది. అయితే ఈ కేసులో నిందితుడు, ఫిర్యాదుదారుడు ఇద్దరూ షెడ్యూల్డ్ కులానికి చెందినవారే’ అని అన్నారు. 

Follow Us:
Download App:
  • android
  • ios