12ఏళ్ల బాలికపై పాఠశాలలు ఇద్దరు మైనర్లు లైంగికదాడికి పాల్పడ్డారు. కడుపు నొప్పి లేవడంతో హాస్పిటల్ తీసుకెళ్లాక విషయం తల్లిదండ్రులకు తెలిసింది. అబార్షన్‌కు వైద్యులు అంగీకరించలేదు. పోలీసులు నిందిత బాలురను దర్యాప్తు చేశారు. తాజాగా, ఆదివారం రాత్రి ఆ బాలిక ప్రసవించింది.

జైపూర్: రాజస్తాన్‌లో షాకింగ్ విషయం వెలుగులోకి వచ్చింది. పాఠశాలలో 12ఏళ్ల బాలికపై ఇద్దరు మైనర్లు లైంగికదాడికి పాల్పడ్డారు. అనంతరం ఆమె గర్భవతి అయింది. ఈ విషయం పోలీసులకు తెలిసినా బహిర్గతపరచలేదు. రహస్యంగా నిందిత బాలురను విచారించినట్టు తెలిసింది. తాజాగా, ఆ బాలిక జోద్‌పూర్ హాస్పిటల్‌లో ఆదివారం ప్రసవించింది. ఇప్పుడు శిశువు, బాధిత బాలిక క్షేమంగానే ఉన్నారు.

లైంగికదాడి గురించి బాలిక ఇంట్లో తల్లిదండ్రులకు చెప్పలేదు. కొన్నాళ్ల తర్వాత ఆమె పొట్టలో నొప్పి రావడంతో తల్లిదండ్రులు హాస్పిటల్‌కు తీసుకెళ్లారు. అక్కడే బాలిక గర్భవతి అని తెలిసింది. పిండాన్ని తొలగించాలని వైద్యులను తల్లిదండ్రులు కోరారు. కానీ, సున్నితమైన కేసుగా భావించిన వైద్యులు అందుకు తిరస్కరించారు. కేసును జోద్‌పూర్ హాస్పిటల్‌కు రిఫర్ చేసి పోలీసులకు విషయం చేరవేశారు. జోద్‌పూర్ హాస్పిటల్‌లో పోలీసులు, వైద్యులకు బాలిక అసలు విషయం చెప్పారు. తనపై ఇద్దరు బాలురు లైంగికదాడికి పాల్పడినట్టు తెలిపినట్టు చైల్డ్ వెల్ఫేర్ కమిటీ చీఫ్ ధన్‌పాట్ గుర్జార్ వివరించారు.

కానీ, ఈ విషయంపై పోలీసులు నోటమాట బయటపెట్టలేదు. ఆ బాలిక చెప్పిన ఇద్దరు బాలురను పోలీసులు దర్యాప్తు చేశారు. ఈ ఘటనపై చైల్డ్ వెల్ఫేర్ కమిటీకి తెలియగానే కుటుంబాన్ని చేరి భరో్సానిస్తున్నట్టు సమాచారం.