15ఏళ్ల బాలుడిని ఈ 29 ఏళ్ల టీచర్ ఏం చేసిందంటే....

29 years old teacher plan to marry  15 years old boy
Highlights

పిల్లలకు విద్యాబుద్దులు నేర్పాల్సిన ఆ టీచరే దారితప్పింది. తాను పనిచేసే పాఠశాలలో చదివే ఓ విద్యార్థితో ప్రేమాయణం సాగించింది. ఈ ప్రేమ కాస్తా ముదిరి ఏకంగా ఆ మైనర్ బాలున్ని పెళ్లిచేసుకోవాలని భావించింది.  బాలుడిని తీసుకుని ఎవరికి తెలియకుండా లేచిపోయింది.   ఈ ఘటన చండీఘడ్ సమీపంలోని పతేబాద్ లో చోటుచేసుకుంది.

ఫతేబాద్ ప్రాంతంలోని ఓ పాఠశాలలో ఓ 15 ఏళ్ల విద్యార్థి పదో తరగతి చదువుతున్నాడు. అయితే అతడిపై అదే స్కూల్లో పనిచేసే ఓ టీచర్ మనసు పారేసుకుంది. బాలుడికి మాయమాటలు చెప్పి తన వల్లో వేసుకుంది. అతడికి ఓ సెల్ ఫోన్ కానుకగా ఇచ్చి రోజూ ఫోన్ చేయడం, చాట్ చేయడం చేసేది. ఇలా విద్యార్థితో రహస్య ప్రేమను సాగిస్తున్న సదరు టీచర్ పదో తరగతి పరీక్షలు ముగిస్తే బాలుడు పాఠశాలను వదిలి బైటికి వెళ్లిపోతాడని గుర్తించింది. దీంతో ఆలోపు అతడిని పెళ్లి చేసుకోవాలని భావించింది.

దీంతో ఈ నెల 20న బాలుడిని స్కూల్ నుండి నేరుగా తన ఇంటికి తీసుకెళ్లింది. అక్కడినుండి బాలుడిని డిల్లీకి,  ఆ తర్వాత జమ్మూ కాశ్మీర్ కి తీసుకెళ్లింది. అయితే కొడుకు కనిపించకపోయే సరికి  బాలుడి తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు స్కూల్ కి వెళ్లి విచారించగా టీచర్ వెంట వెళ్లినట్లు తెలిసింది. దీంతో సదరు టీచర్ సెల్ ఫోన్ సిగ్నల్ ఆధారంగా పోలీసులు వీరిద్దరూ జమ్మూ కాశ్మీర్ లోని కత్రాలో ఉన్నట్లు గుర్తించారు. మైనర్ బాలుడిని తల్లదండ్రులకు తెలియకుండా తీసుకెళ్లినందుకు కిడ్నాప్ కేసు కింద టీచర్ ను అరెస్ట్ చేశారు. బాలుడికి కౌన్సెలింగ్ ఇచ్చి తల్లిదండ్రులకు అప్పగించారు. 

loader