తమిళనాడులో జర్నలిస్టులపై కరోనా దెబ్బ: న్యూస్ ఛానల్‌‌లో పనిచేస్తున్న 27 మందికి కోవిడ్

తమిళనాడు రాష్ట్రంలోని ఓ ప్రముఖ న్యూస్ ఛానల్‌లో విధులు నిర్వహిస్తున్న 27 మంది జర్నలిస్టులకు కరోనా సోకింది. న్యూస్ ఛానల్ లో పనిచేస్తున్న జర్నలిస్టులు, సబ్ ఎడిటర్లకు కూడ కరోనా సోకింది.

27 staff members of a Tamil news channel test positive for coronavirus

చెన్నై:తమిళనాడు రాష్ట్రంలోని ఓ ప్రముఖ న్యూస్ ఛానల్‌లో విధులు నిర్వహిస్తున్న 27 మంది జర్నలిస్టులకు కరోనా సోకింది. న్యూస్ ఛానల్ లో పనిచేస్తున్న జర్నలిస్టులు, సబ్ ఎడిటర్లకు కూడ కరోనా సోకింది.

ఈ చానల్ లో పనిచేస్తున్న 24 ఏళ్ల జర్నలిస్టుకు కరోనా సోకింది. దీంతో ఈ చానల్ పనిచేస్తున్న 94 మంది పరీక్షలు నిర్వహించారు. వీరిలో 27 మందికి కరోనా సోకినట్టుగా తేలింది. ఈ ఛానల్ లో పనిచేస్తున్న జర్నలిస్టు తండ్రి ఎస్ఐ.  

లాక్ డౌన్ విధుల్లో జర్నలిస్టులు, పోలీసులు తమ విధులను నిర్వహిస్తున్నారు. ఈ తరుణంలో తండ్రి సూచన మేరకు  ఎస్ఐ కుటుంబం పరీక్షలు చేయించుకొంది.దీంతో జర్నలిస్టుకు కరోనా సోకినట్టుగా తేలింది.  దీంతో ఎస్ఐ కుటుంబాన్ని క్వారంటైన్ కు తరలించారు.

జర్నలిస్టుకు కరోనా సోకిన విషయం తెలిసిన వెంటనే ఈ ఛానల్ లో పనిచేస్తున్న 94 మందికి పరీక్షలు నిర్వహించారు. ఇదిలా ఉంటే ముంబైలో పనిచేస్తున్న 53 మంది జర్నలిస్టులకు కూడ కరోనా సోకింది. ఈ సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉందని స్థానిక మీడియా సోమవారం ప్రకటించిన విషయం తెలిసిందే.

also read:లాక్‌డౌన్: 21 రోజుల్లో 25 అడుగుల బావిని తవ్విన దంపతులు

ఢిల్లీలో పనిచేస్తున్న జర్నలిస్టులు కూడ తమకు పరీక్షలు నిర్వహించాలని ప్రభుత్వాన్ని కోరారు. ఎలాంటి  లక్షణాలు లేకున్నా పలువురు జర్నలిస్టులకు కరోనా సోకిందని బాధితులు తెలిపారు.
 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios