న్యూఢిల్లీ: 2018-19 ఆర్ధిక సంవత్సరం ఐటీ రిటర్న్స్  దాఖలు చేసేందుకు ఈ ఏడాది జూన్ 30వ తేదీ వరకు గడువును పొడిగించినట్టుగా కేంద్ర ఆర్ధిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు.

మంగళవారం నాడు ఆమె న్యూఢిల్లీలో ఆమె మీడియాాతో మాట్లాడారు.పన్నుల చెల్లింపులపై అనేక వెసులుబాట్లు కల్పించినట్టుగా చెప్పారు.  పాన్, ఆధార్ లింక్  గడవును కూడ ఈ ఏడాది జూన్ వరకు పొడిగించినట్టుగా మంత్రి చెప్పారు.

పన్ను చెల్లింపు ఆలస్యమైతే 9 శాతం చార్జీ వసూలు చేస్తామని కేంద్రం స్పష్టం చేసింది. గతంలో వడ్డీని 12 శాతం నుండి 9 శాతానికి తగ్గించామన్నారు.వివాద్ సే విశ్వాస్ స్కీమ్ ను కూడ జూన్ నెలాఖరు వరకు పొడిగించామన్నారు మంత్రి.అయితే ఈ పధకానికి 10 శాతం అదనంగా పన్నును జూన్ 30వ తేదీ వరకు వసూలు చేయబోమని మంత్రి స్పష్టం చేశారు.

ఐదు కోట్ల కంటే తక్కువ టర్నోవర్ ఉన్న సంస్థలకు లేట్ ఫీజు, జరిమానాలు, వడ్డీని విధించబోమని నిర్మలా సీతారామన్ ప్రకటించారు.ఇక పెద్ద కంపెనీలకు ఆలస్యంగా పన్నులు చెల్లిస్తే వడ్డీని మాత్రమే వసూలు చేయనున్నారు. కానీ ఆలస్యంగా చెల్లిస్తే లేట్ ఫీజు, జరిమానాను విధించబోమని మంత్రి  చెప్పారు.

కస్టమ్స్ క్లియరెన్స్ జూన్ 30వ తేదీ వరకు 24 గంటల పాటు పనిచేస్తాయన్నారు. బోర్డు సమావేశాల నిర్వహణను వచ్చే రెండు క్వార్టర్స్ కు 60 రోజులకు కుదించామని మంత్రి తెలిపారు.