Asianet News TeluguAsianet News Telugu

12,638 వజ్రాలతో ఉంగరం.. వరల్డ్ రికార్డుల్లోకి ఎక్కిన బంతిపువ్వు...

ఢిల్లీకి చెందిన ఓ యువకుడు ఏకంగా 12, 638 వజ్రాలతో ఉంగరం తయారుచేసి వరల్డ్ రికార్డ్ సాధించాడు. దీనికి బంతిపువ్వు అని పేరు పెట్టాడు. అత్యంత ఆకర్షణీయమైన పుష్పం ఆకృతిలో కనిపిస్తున్నఈ డైమండ్ రింగ్ గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులో చోటు సంపాదించుకుంది. 

25-year-old Indian jeweller's 12,638-diamond ring sets world record - bsb
Author
Hyderabad, First Published Dec 5, 2020, 10:47 AM IST

ఢిల్లీకి చెందిన ఓ యువకుడు ఏకంగా 12, 638 వజ్రాలతో ఉంగరం తయారుచేసి వరల్డ్ రికార్డ్ సాధించాడు. దీనికి బంతిపువ్వు అని పేరు పెట్టాడు. అత్యంత ఆకర్షణీయమైన పుష్పం ఆకృతిలో కనిపిస్తున్నఈ డైమండ్ రింగ్ గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులో చోటు సంపాదించుకుంది. 

దీనిని తయారుచేసిన స్వర్ణకారుడు హర్షిత్ బన్సాల్ ఈ డైమండ్ రింగ్‌కు ‘మేరీ గోల్డ్ - ద రింగ్ ఆఫ్ ప్రాస్పారిటీ అని పేరు పెట్టారు. దీని బరువు 165 గ్రాములు. అయితే ఇది అమ్మకానికి కాదని ఆయన అంటున్నాడు. ఈ డైమండ్ రింగ్‌ను ఒక భారతీయుడు రూపొందించాడు. 25 ఏళ్ల హర్షిత్ బన్సల్ ఈ ఉంగరాన్ని తయారు చేశాడు. 

ఈ సందర్భంగా హర్షిత్ మాట్లాడుతూ ఇది తన డ్రీమ్ ప్రాజెక్ట్ అని, ఈ ఉంగరాన్ని అత్యంత సులభంగా ధరించవచ్చని, తాను రెండేళ్ల క్రితం గుజరాత్‌లోని సూరత్‌లో జ్యూయలరీ డిజైనింగ్ కోర్సు చేస్తున్నప్పుడు తనకు ఇటువంటి ఐడియా వచ్చిందని తెలిపారు. 

10 వేలకు మించిన వజ్రాలతో రింగ్ రూపొందించాలన్న తనకల నెరవేరిందన్నారు. ఈ అద్భుతమైన ఉంగరాన్నితన వద్దనే ఉంచుకుంటానని, దీనిని ఎవరికీ అమ్మబోనని తెలిపారు. 

Follow Us:
Download App:
  • android
  • ios