Maharashtra: మహారాష్ట్రలో దారుణ ఘటన చోటు చేసుకుంది. నాందేడ్ జిల్లాలోని ప్రభుత్వ వైద్య కళాశాల, ఆసుపత్రిలో గత 24 గంటల్లో 24 మంది దుర్మరణం చెందారు. మృతుల్లో 12 మంది నవజాత శిశువులు ఉండటం శోచనీయం.
Maharashtra: మహారాష్ట్రలో దారుణ ఘటన చోటు చేసుకుంది. నాందేడ్ జిల్లాలోని శంకర్‌రావ్ చవాన్ ప్రభుత్వ వైద్య కళాశాల మరియు ఆసుపత్రిలో గత 24 గంటల్లో 24 మంది దుర్మరణం చెందారు. మృతుల్లో 12 మంది నవజాత శిశువులు ఉన్నారు. వీరితో పాటు 70 మంది రోగుల పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. ఈ ఘటనతో ఆరోగ్యశాఖలో కలకలం రేగింది. రోగుల బంధువులు కూడా ఆస్పత్రిలో ఆందోళనకు దిగి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. మందులు, సిబ్బంది కొరతే ఇందుకు కారణమని చెబుతున్నారు.
మహారాష్ట్రలోని థానేలోని ఓ ఆసుపత్రిలో ఆగస్టులో కూడా ఒకే రోజు 18 మంది రోగులు మరణించారు. వివిధ కారణాల వల్ల ఆరుగురు మగ, ఆరుగురు ఆడ శిశువులు మరణించారని ఆసుపత్రి డీన్ ఎస్ వాకోడ్ మీడియాకు తెలిపారు. మరణించిన 12 12 మంది పాముకాటుతో పాటు వివిధ వ్యాధుల కారణంగా ప్రాణాలు కోల్పోయారని పేర్కొన్నారు. 70-80 కిలోమీటర్ల పరిధిలో ఉన్న ఏకైక ఆసుపత్రి ఇదొక్కటేనని, దూరప్రాంతాల నుంచి రోగులు ఇక్కడికి వస్తుంటారని వాకోడే తెలిపారు.
మరోవైపు ప్రభుత్వాసుపత్రుల్లో మందుల కొరత ఉందని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ ఆసుపత్రులకు హాఫ్‌కిన్ ఇన్‌స్టిట్యూట్ ద్వారా మందులను సరఫరా చేస్తున్నట్లు చెబుతున్నారు. నిధుల కొరతతో ఇన్‌స్టిట్యూట్‌లో కొంతకాలంగా మందుల కొనుగోలు నిలిచిపోయింది. దీంతో ప్రభుత్వాసుపత్రుల్లో మందులు ఇవ్వడం లేదు.
ఈ సంఘటన గురించి సమాచారం తెలుసుకున్న మాజీ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ సీనియర్ నాయకుడు అశోక్ చవాన్ మాట్లాడుతూ.. ప్రస్తుతం 500 మంది రోగుల సామర్థ్యం ఉన్న ఈ ఆసుపత్రిలో 1200 మందికి పైగా రోగులు చేరుతున్నారని చెప్పారు. ఆస్పత్రిలో వైద్యుల కొరత తీవ్రంగా ఉందనీ, ఖాళీగా ఉన్న స్థానాల్లో కొత్త వైద్యులను నియమించడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.
నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ నేషనల్ ప్రెసిడెంట్ సుప్రియా సూలే కూడా ఈ ఘటనపై తీవ్రంగా స్పందించారు. షిండే ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. ఇన్ని ఆకస్మిక మరణాలు కేవలం యాదృచ్చికం మాత్రమేనని ఆయన అన్నారు. ఈ మరణాలన్నింటినీ లోతుగా విచారించాలనీ, ముఖ్యమంత్రి వెంటనే దీనిపై దృష్టి సారించి విచారణకు ఆదేశించాలని డిమాండ్ చేశారు. అలాగే.. వైద్యారోగ్య శాఖ మంత్రి పదవికి రాజీనామా చేయాలని విమర్శించారు. రాష్ట్రంలోని ప్రభుత్వాసుపత్రులతో పాటు ఇతర ప్రభుత్వాసుపత్రుల్లో మందుల కొరత ఉందని సూలే తెలిపారు. మృతుల కుటుంబాలకు తగిన పరిహారం అందించాలని డిమాండ్ చేశారు.
మరోవైపు ఈ ఘటనపై మహారాష్ట్ర ముఖ్యమంత్రి విచారం వ్యక్తం చేస్తూ విచారణ జరిపి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. నాందేడ్‌లోని ఆసుపత్రిలో మృతి చెందడం దురదృష్టకరం. మొత్తం ఘటనపై విచారణ జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారని ఏక్‌నాథ్ షిండే తెలిపారు.
