భారతదేశంలో కరోనా విలయ తాండవం చేస్తోంది. ఊహించని విధంగా కరోనా కేసులు రోజు రోజుకీ పెరిగిపోతున్నాయి. కాగా... గడిచిన 24 గంటల్లో కరోనా కారణంగా 40మంది ప్రాణాలు కోల్పోయినట్లు అధికారులు వెల్లడించారు.

Also Read కరోనాకి మందు అంటూ విక్రయం.. చివరకు......

 కరోనావైరస్ కారణంగా నిన్న ఒక్కరోజే 40 మంది మరణించినట్లు ప్రభుత్వం తెలిపింది. దేశంలో కరోనావైరస్ కారణంగా మరణించిన వారి సంఖ్య 239 గా ఉంది. మొత్తం మరణాలలో 86% రక్తపోటు మరియు మధుమేహం వంటి సహ-అనారోగ్యంతో బాధపడుతున్న వ్యక్తులని ప్రభుత్వం తెలిపింది. నిన్న ఒక్కరోజే అతిపెద్ద మరణాలు నమోదు చేసింది అని అధికారులు తెలిపారు.

కాగా.. మొత్తంగా కరోనా కేసులు 7,447కి చేరాయి. మహారాష్ట్రలో అత్యధికంగా 1,574మందికి కరోనా సోకడం గమనార్హం. కాగా.. ఈ వైరస్ తొలుత చైనాలోని వుహాన్ లో మొదలైంది. అక్కడి నుంచి ప్రపంచ దేశాలకు పాకింది.

ఇప్పుడు ఈ కేసులు చైనాలో తగ్గుముఖం పట్టగా... ఇతర దేశాలను మాత్రం పట్టి పీడిస్తోంది. అమెరికాలో అయితే.. ఈ వైరస్ బీభత్సం సృష్టిస్తోంది. కేవ‌లం 24 గంటల వ్య‌వ‌ధిలోనే ఏకంగా 2 వేల మంది మృతి చెందడంతో భ‌యాన‌క ప‌రిస్థితులు నెల‌కొంటున్నాయి. దీంతో ఇప్ప‌టివ‌ర‌కు అమెరికాలో మొత్తం 496,535 మందికి కరోనా వైరస్ సోకినట్లు నిర్థారించారు. కాగా..  ఇప్పటి వరకు 18,586 మంది ప్రాణాలు కోల్పోయారు.

ఇదిలా ఉండగా.. కేవలం 24గంటల్లో 35,098 కొత్త కేసులు నమోదు కావడం గమనార్హం. కాగా... వీటి సంఖ్య చూస్తుంటే.. అగ్ర రాజ్యం ఎంతటి భయానక పరిస్థితుల్లో ఉందో అర్థం చేసుకోవచ్చు. కాగా... ఈ చావుల్లో కూడా అమెరికా ఇప్పుడు రికార్డు సాధించడం గమనార్హం. మొన్నటి వరకు ఇటలీ, స్పెయిన్ వంటి దేశాల్లో మొదటి రెండు స్థానాల్లో ఉండగా.. ఇప్పుడు అమెరికా మొదటి స్థానానికి చేరుకుంది.

ఇటలీలో కన్నా ఎక్కువ మరణాలు ఇప్పుడు అమెరికాలో చోటుచేసుకున్నాయి. 

ఈ మరణాలతో కలిపి ప్రపంచ వ్యాప్తంగా లక్ష మరణాలు దాటడం గమనార్హం. కాగా.. ప్రపంచ వ్యాప్తంగా గురువారం ఒక్క రోజే 7,300 మంది ప్రాణాలు కోల్పోయారు.  

గడిచిన వారం రోజుల్లో మరణాల శాతం 6 నుంచి 10 శాతానికి పెరిగిందని నిపుణులు చెబుతున్నారు.

ఈ వైరస్ కారణంగా తొలి మరణం జనవరి 9వ తేదీన వుహాన్ లో చోటుచేసుకోగా.. కేవలం 83 రోజులు గడిచే సరికి 50వేల మంది ప్రాణాలు కోల్పోయారు. కాగా.. గడిచిన 8 రోజుల్లో ఈ మరణాల సంఖ్య లక్షకు చేరుకోవడం శోచనీయం.