బీహార్ లో కల్తీ మద్యానికి 22 మంది బలి.. మృతుల కుటుంబాలకు రూ.4 లక్షల సాయం ప్రకటించిన సీఎం.. కానీ ఓ కండీషన్

బీహార్ లో కల్తీ మద్యం తాగి మరణించిన వారి సంఖ్య సోమవారం నాటికి 22కి చేరింది. ఈ ఘటనపై స్పందించిన సీఎం నితీష్ కుమార్ బాధిత కుటుంబాలకు రూ.4 లక్షల చొప్పున సాయం చేస్తానని ప్రకటించారు. కానీ ఓ షరతు విధించారు. 

22 victims of adulterated liquor in Bihar.. CM announced Rs. 4 lakh assistance to the families of the deceased.. but with a condition..ISR

బీహార్ లో కల్తీ మద్యం విషాదం నింపింది.  మోతీహరి (తూర్పు చంపారన్ జిల్లా)లో కల్తీ మద్యం సేవించిన ఘటనలో మృతుల సంఖ్య పెరుగింది. ఇప్పటి వరకు 22 మంది చనిపోయారని అధికారులు తెలిపారు. జిల్లాలోని తుర్కౌలియా, హర్సిద్ధి, సుగౌలి, పహర్పూర్ ప్రాంతాల్లో ఈ మరణాలు సంభవించినట్లు అధికారులు తెలిపారు. గత 36 గంటల్లో మొత్తం 76 మంది మద్యం స్మగ్లర్లను మోతీహరి పోలీసులు అరెస్టు చేశారు.

సామాజిక న్యాయం, సాధికారత కోసం కుల గణన చేపట్టండి - ప్రధాని మోడీకి కాంగ్రెస్ చీఫ్ ఖర్గే లేఖ

ఈ నెల 14వ తేదీన మోతీహరి జిల్లా పరిధిలోని హర్సిద్ధి, సుగౌలి, పహర్పూర్, తుర్కౌలియా, రఘునాథ్ పూర్ పోలీస్ స్టేషన్ల పరిధిలో కల్తీ మద్యం తాగి ఐదుగురు చనిపోయారు. మరెంతో మంది అస్వస్థకు గురై హాస్పిటల్ లో చేరారు. ఈ ఘటనలో ప్రతీ రోజు మృతుల సంఖ్య పెరుగుతోంది. ఇప్పటి వరకు 22 మంది చనిపోయారని అధికారులు నిర్ధారించారు. చంపారన్ ప్రాంతంలోని డిప్యూటీ ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్, జిల్లా మేజిస్ట్రేట్, పోలీసు సూపరింటెండెంట్ మోతిహరి అన్ని ఆసుపత్రులను సందర్శించి చికిత్స పొందుతున్న వ్యక్తుల పరిస్థితిని సమీక్షించారు. ఇప్పటి వరకు మొత్తం 22 మంది మృతి చెందగా, ఆరుగురికి పోస్టుమార్టం నిర్వహించారు.

మోతీహరి సదర్ ఆసుపత్రిలో మొత్తం 15 మంది చికిత్స పొందుతున్నారని, వారి పరిస్థితి సాధారణంగా ఉందని, 14 మంది ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారని, నలుగురి పరిస్థితి విషమంగా ఉందని పోలీసులు వెల్లడించారు. కాగా.. అక్రమ మద్యాన్ని స్వాధీనం చేసుకుని నేరస్థులను పట్టుకునేందుకు పోలీసులు దాడులు నిర్వహించారు. ఇందులో గడిచిన 36 గంటల్లో మొత్తం 76 మంది మద్యం స్మగ్లర్లను మోతీహరి పోలీసులు అరెస్టు చేశారు. వీరిలో 25 మంది మద్యం స్మగ్లర్లను ప్రభావిత ప్రాంతాల్లో అరెస్టు చేశారు. మొత్తం 736.5 లీటర్ల మద్యం, 66 లీటర్ల స్పిరిట్ స్వాధీనం చేసుకున్నారు. 

95 శాతం మంది భారతీయులకు జాతీయ జెండాపై అవగాహన లేదు - ఫ్లాగ్ ఫౌండేషన్ ఆఫ్ ఇండియా సీఈవో అషిమ్ కోహ్లీ..

స్పందించిన సీఎం నితీష్ కుమార్
కల్తీ మద్యం తాగడం వల్ల సంభవించిన మరణాలపై సీఎం నితీష్ కుమార్ స్పందించారు. ఈ ఘటనలో మరణించిన వారి కుటుంబాలకు రూ.4 లక్షల చొప్పున రాష్ట్ర ప్రభుత్వం నష్టపరిహారం అందిస్తుందని తెలిపారు. అయితే ఓ షరతును బాధిత కుటుంబాలు అంగీకరించాలని తెలిపారు. రాష్ట్రంలో మద్యపాన నిషేధానికి తామంతా అనుకూలమని లిఖితపూర్వకంగా రాసి ఇవ్వాలని చెప్పారు. ‘‘ఇది బాధాకరమైన సంఘటన. మృతుల కుటుంబాలకు సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి రూ.4 లక్షలు ఇస్తాం. అయితే రాష్ట్రంలో మద్యపాన నిషేధానికి తాము అనుకూలమని, మద్యపానానికి తాము వ్యతిరేకమని లిఖిత పూర్వకంగా తెలియజేయాలి’’ అని అన్నారు.

ఈ ఘటనపై శనివారం ఆయన మాట్లాడుతూ.. ‘‘మద్యం చెడ్డదని, తాగకూడదని నేను చెబుతూనే ఉన్నాను. మద్యనిషేధ చట్టాలను ఉల్లంఘించే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించాను.’’ అని తెలిపారు. ఇదిలా ఉండగా.. ఈ మరణాలకు నితీష్ కుమార్ నేతృత్వంలోని ప్రభుత్వమే కారణమని, ప్రధాని కావాలని కలలు కనడం మానేసి రాష్ట్రాన్ని జాగ్రత్తగా చూసుకోవాలని బీహార్ బీజేపీ అధ్యక్షుడు సామ్రాట్ చౌదరి అన్నారు. ఈ దుర్ఘటనకు రాష్ట్ర ప్రభుత్వమే బాధ్యత వహిస్తూ... ఈ ఘటనలో మరణించిన వారి కుటుంబ సభ్యులకు నష్టపరిహారం చెల్లించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. 

స్వలింగ వివాహం అనేది దేశ సామాజిక విలువలకు దూరంగా ఉన్న ‘అర్బన్ ఎలిటిస్ట్ కాన్సెప్ట్’- సుప్రీంకోర్టుతో కేంద్రం

బీహార్ లో 2016 ఏప్రిల్ లో నితీష్ కుమార్ ప్రభుత్వం మద్యం అమ్మకాలు, వినియోగాన్ని నిషేధించింది. అక్రమంగా మద్య తీసుకొస్తూ, అమ్ముతున్న వారిపై చర్యలు కొనసాగుతున్నప్పటికీ రాష్ట్రంలో మద్యం అక్రమ రవాణా ఘటనలు జరుగుతూనే ఉన్నాయి. 2022 డిసెంబర్ లో జరిగిన చివరి భారీ మద్యం దుర్ఘటనలో, సరన్ జిల్లాలో కల్తీ మద్యం సేవించి అనేక మంది మరణించారు.

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios