95 శాతం మంది భారతీయులకు జాతీయ జెండాపై అవగాహన లేదు - ఫ్లాగ్ ఫౌండేషన్ ఆఫ్ ఇండియా సీఈవో అషిమ్ కోహ్లీ..

మన దేశంలో 95 శాతం మందికి జాతీయ జెండా గురించి సరైన అవగాహన లేదని ఫ్లాగ్ ఫౌండేషన్ ఆఫ్ ఇండియా పేర్కొంది. త్రివర్ణ పతాకాన్ని ఏ సమయంలో ఎగురవేయచ్చు ? దేనితో తయారు చేయాలో కూడా చాలా మందికి తెలియదని తెలిపింది. 

95 percent of Indians do not know about the national flag - Flag Foundation of India CEO Ashim Kohli..ISR

నూటికి 95 శాతం మంది భారతీయులకు జాతీయ పతాకంపై సరైన అవగాహన లేదని ఫ్లాగ్ ఫౌండేషన్ ఆఫ్ ఇండియా సీఈవో అషిమ్ కోహ్లీ అన్నారు. రిటైర్డ్ మేజర్ జనరల్ అయిన ఆయన.. ఓ వార్తా పత్రికతో మాట్లాడారు. ‘‘భారత్ లో 95 శాతం మందికి త్రివర్ణ పతాకంపై సరైన అవగాహన లేదు. జాతీయ జెండాను రాత్రింబవళ్లు ఎగురవేయవచ్చా ? ఖాదీతో తయారు చేయాలా ? లేదా కాటన్ తో తయారు చేయాలా అనే విషయాలేవీ వారికి తెలియదు.’’ అని అన్నారని ‘ది న్యూ ఇండియన్ ఎక్స్ ప్రెస్’తో నివేదించింది.

స్వలింగ వివాహం అనేది దేశ సామాజిక విలువలకు దూరంగా ఉన్న ‘అర్బన్ ఎలిటిస్ట్ కాన్సెప్ట్’- సుప్రీంకోర్టుతో కేంద్రం

ఢిల్లీకి చెందిన ఈ ఎన్ జీవో తన 107వ స్మారక పతాకాన్ని శనివారం గౌహతిలోని ఆర్మీ నారేంగి మిలిటరీ స్టేషన్‌లో ఏర్పాటు చేసింది.  ఈ సందర్భంగా ఫ్లాగ్ ఫౌండేషన్ ఆఫ్ ఇండియా సీఈవో ఆయన మాట్లాడారు. కాటన్, ఖాదీ, సిల్క్, పాలిస్టర్ తో జెండాను తయారు చేయవచ్చని, ఇది 3:2 నిష్పత్తిలో ఉండాలని పేర్కొన్నారు.

ఆగస్టు 15న స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు ముగిసే సమయానికి కొందరు విద్యావంతులు, సీనియర్లు కూడా జాతీయ జెండాను దించారని, ఇది చాలా బాధాకరమని అన్నారు. ‘‘ప్రభుత్వ ఉత్తర్వులు చాలా స్పష్టంగా ఉన్నాయి. ఏడాదిలో 365 రోజులు ఎగురవేయడం మీ హక్కు’’ అని తెలిపారు. అమెరికాలో ఎక్కడ చూసి ఆ దేశ జాతీయ జెండా రెపరెపలాడడం చూస్తుంటే గొప్పగా ఉంటుందన్నారు. కానీ ఇండియాలో అలా ఎందుకు లేదు అని ఆయన ప్రశ్నించారు ? ఏ మాధ్యమం ద్వారా కూడా ప్రజలకు సరైన సమాచారం చేరకపోవడమే ఇందుకు కారణమని చెప్పారు. 

విషాదం.. పెన్ గంగాలో పడి యువకుడు మృతి.. కుమురం భీమ్ ఆసిఫాబాద్ జిల్లాలో ఘటన

గతంలో జాతీయ జెండా గౌరవానికి అవమానాల నిరోధక చట్టం-1971 ప్రకారం భారతీయుడు త్రివర్ణ పతాకాన్ని ధరించడానికి అనుమతి ఉండేది కాదని అన్నారు. ఈ చట్టానికి సవరణలు చేసిన తర్వాత, ఇప్పుడు జెండాను నడుము పైన ధరించవచ్చని, కానీ దానిని గౌరవంగా చూసుకోవాలని చెప్పారు. ప్రజలు తమ ఇంట్లో విగ్రహానికి ఇచ్చే గౌరవం, జాతీయ జెండాకు ఇవ్వాలని, అదే సాధారణ సూత్రం ఇక్కడ కూడా వర్తిస్తుందని అన్నారు. 

కార్పొరేట్ రంగానికి చెందిన కొన్ని సంస్థలు స్మారక పతాకాన్ని ఏర్పాటు చేయడం సంతోషంగా ఉందన్నారు. హర్ ఘర్ తిరంగా గురించి ఇప్పటి వరకు మాట్లాడుకున్నామని, ఇప్పుడు తమ దృష్టి హర్ దిన్ తిరంగాపై ఉందని చెప్పారు. ఇది సామాన్య ప్రజల జెండాగా ఉండాలన్నదే తమ లక్ష్యమని అన్నారు. ఏ సంస్థ అయినా ఏడాది పొడవునా స్మారక పతాకాలను సంరక్షించే బాధ్యత తీసుకుంటే వాటిని ఏర్పాటు చేసేందుకు వెసులుబాటు కల్పిస్తామని ఆయన చెప్పారు. అయితే ఆ సంస్థకు జెండా ఏర్పాటు చేసే చోట సొంత స్థలం ఉండాలని సూచించారు.

నేడు తిరుపతి వేంకటేశ్వర స్వామి వారిని దర్శించుకునే భక్తులకు శుభవార్త..

కాగా.. సొసైటీస్ రిజిస్ట్రేషన్ యాక్ట్ 1980 కింద రిజిస్టర్ అయిన ఫ్లాగ్ ఫౌండేషన్ ఆఫ్ ఇండియాను సీఎస్ఆర్ (కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ) నిధులతో నడుపుతున్నారు. దీని ప్రధాన కార్యాలయం ఢిల్లీలో ఉంది. 2009లో హరియాణాలో తొలి స్మారక పతాకాన్ని ఈ సంస్థ ఏర్పాటు చేసింది. ఆ తర్వాత ప్రభుత్వ, ప్రభుత్వేతర సంస్థల్లో త్రివర్ణ పతాకాన్ని ఏర్పాటు చేసింది. ఈ సంస్థ త్రివర్ణ పతాకంపై ప్రజలకు అవగాహన కల్పించి, దానిని ఎగురవేయడానికి ప్రోత్సహిస్తుంది.

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios