Coronavirus: క‌రోనా దెబ్బ‌.. టూరిజంలో ఊడిన 21.5 మిలియ‌న్ ఉద్యోగాలు..

Coronavirus: క‌రోనా మ‌హ‌మ్మారి అన్ని రంగాలను తీవ్రంగా దెబ్బ‌తీసింది. ప‌ర్యాట‌క‌రంగంపై క‌రోనా దెబ్బ మాములుగా ప‌డలేదు. ఏకంగా 21.5 మిలియ‌న్ల మంది టూరిజం సెక్టార్ లో ఉద్యోగాల‌ను కోల్పోయారు. 
 

21.5 million people in tourism sector lost their jobs since COVID-19 outbreak : Government

Coronavirus: 2020 ప్రారంభంలో దేశాన్ని క‌రోనా మ‌హ‌మ్మారి మొదటి వేవ్ తాకింది. అప్ప‌టి నుంచి ఇప్ప‌టివ‌ర‌కు మొత్తం మూడు కోవిడ్ వేవ్ లు దేశంలో తీవ్ర సంక్షోభానికి కార‌ణం అయ్యాయి. ల‌క్ష‌లాది మంది ప్రాణాలు తీయ‌డంతో పాటు కోట్లాది మందిని అనారోగ్యానికి గురిచేసింది కరోనా. దాదాపు అన్ని రంగాల‌ను కోలుకోని దెబ్బ‌కొట్టింది. భార‌త్ లో కోట్లాది మంది ఉపాధిని కోల్పోయారు. ప‌ర్యాట‌క రంగంపై పైనా పెను ప్ర‌భావం చూపింది క‌రోనా మ‌హ‌మ్మారి. క‌రోనా వైర‌స్ విజృంభ‌ణ కార‌ణంగా దేశంలోని ప‌ర్యాట‌క రంగంలో కొన‌సాగుతున్న దాదాపు 21.5 మిలియన్ల మంది త‌మ ఉద్యోగాలు కోల్పోయారని కేంద్ర పర్యాటక శాఖ మంత్రి జి కిషన్ రెడ్డి సోమవారం నాడు వెల్ల‌డించారు. 

COVID-19 వ్యాప్తి ప్రారంభ‌మై.. మొదటి వేవ్ సమయంలో దేశంలో పర్యాటకుల రాక 93 శాతం తగ్గిందని కేంద్ర మంత్రి కిష‌న్ రెడ్డి తెలిపారు. క‌రోనా సెకండ్ వేవ్ స‌మ‌యంలో ప‌ర్యాట‌కుల రాక 79 శాతం త‌గ్గిపోగా, థ‌ర్డ్ వేవ్ స‌మ‌యంలో 64 శాతం తగ్గిందని మంత్రి చెప్పారు. "పర్యాటకంపై క‌రోనా మహమ్మారి ప్రభావంపై మేము ఒక అధ్యయనం చేసాము. అధ్యయనం ప్రకారం, మొదటి వేవ్‌లో 14.5 మిలియన్ల ఉద్యోగాలు కోల్పోయారు. ఇక క‌రోనా సెకండ్ వేవ్ స‌మయంలో 5.2 మిలియన్ల ఉద్యోగాలు పోయాయి. అలాగే, క‌రోనా వైరస్ థ‌ర్డ్ వేవ్ స‌మ‌యంలో  1.8 మిలియన్ల ఉద్యోగ నష్టాలు ఉన్నాయి"  అని లోక్‌సభలో ప్రశ్నోత్తరాల సమయంలో కేంద్ర మంత్రి కిష‌న్ రెడ్డి వెల్ల‌డించారు. దేశంలోకి క‌రోనా మ‌హ‌మ్మారి ప్ర‌వేశించ‌క‌ముందు భార‌త్ లో 38 మిలియన్ల మంది పర్యాటక పరిశ్రమతో సంబంధం కలిగి ఉన్నారని కిష‌న్ రెడ్డి చెప్పారు.

కరోనావైరస్ మూడు వేవ్ ల సమయంలో పర్యాటక రంగ ఆర్థిక వ్యవస్థ గణనీయంగా పడిపోయిందని, ఇది భారతదేశంలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఈ రంగాన్ని తీవ్రంగా దెబ్బతీసిందని మంత్రి  కిష‌న్ రెడ్డి వెల్ల‌డించారు. క‌రోనా విజృంభ‌ణ సమ‌యంలో కేంద్ర ప్ర‌భుత్వం వైర‌స్ క‌ట్ట‌డి కోసం మెరుగైన చ‌ర్య‌లు తీసుకుంద‌ని తెలిపిన కిష‌న్ రెడ్డి.. 180 కోట్ల డోస్‌ల కోవిడ్‌-19 వ్యాక్సిన్‌లను అందించడం ద్వారా పర్యాటక రంగంలో మెరుగుదలలు ఉంటాయని ప్రభుత్వం ఆశాభావం వ్యక్తం చేశారు. క‌రోనా మ‌హ‌మ్మారి కార‌ణంగా తీవ్రంగా కుదేలైన టూరిజం సెక్టార్ కు సహాయం చేయడానికి, ట్రావెల్ మరియు టూరిజం వాటాదారులకు రూ. 10 లక్షల వడ్డీ రహిత రుణం మరియు టూరిస్ట్ గైడ్‌లకు రూ. 1 లక్ష వరకు వడ్డీ రహిత రుణం ఇవ్వబడుతుందని మంత్రి కిష‌న్ రెడ్డి చెప్పారు.

"పర్యాటక రంగానికి తమకు చేతనైనంతలో సహాయం చేయాలని అన్ని రాష్ట్ర ప్రభుత్వాలకు నేను విజ్ఞప్తి చేస్తున్నాను" అని మంత్రి అన్నారు. ప్ర‌ధాని నరేంద్ర మోడీ ప్రభుత్వం చేపట్టిన పర్యాటక అనుకూల కార్యక్రమాల కారణంగా ప్రపంచ పర్యాటక ప్రాంతాలలో భారతదేశం ర్యాంక్ దాదాపు 20 స్థానాలు ఎగబాకిందనీ, 2013లో 52 నుంచి 2019 నాటికి 32కి చేరుకుందని కిష‌న్ రెడ్డి చెప్పారు. ఎక్కువ మంది అంతర్జాతీయ పర్యాటకులను ప్రోత్సహించేందుకు, ముందుగా వచ్చే ఐదు లక్షల మంది వీసా రుసుమును రద్దు చేయాలని ప్రభుత్వం ఇప్పటికే నిర్ణయించిందని ఆయన చెప్పారు.COVID-19 మహమ్మారి వ్యాప్తి చెందిన తర్వాత, మార్చి 7, 2022 వరకు, భారతదేశం 51,960 సాధారణ వీసాలు మరియు 1.57 ఈ-వీసాలు ఇచ్చిందని ఆయన చెప్పారు.

ప్రయాణం ఖర్చుతో కూడుకున్నది, పర్యాటక రంగంపై ప్రభావం చూపుతున్నందున విమాన ఛార్జీలపై నియంత్రణ ఉండాలని నేషనల్ కాన్ఫరెన్స్ నాయకుడు ఫరూక్ అబ్దుల్లా అడిగిన ప్రశ్నకు రెడ్డి సమాధానమిస్తూ, ఈ అంశంపై ప్రభుత్వం చర్చించి విమాన ఛార్జీలకు సబ్సిడీ ఇస్తోందని అన్నారు. పర్యాటక ప్రాంతాలకు వెళ్లే విమానయాన సంస్థలకు 'ఉడాన్' పథకం అమ‌లు చేస్తున్న‌ట్టు తెలిపారు. 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios