Asianet News TeluguAsianet News Telugu

2018లో లాట్వియా మహిళ టూరిస్ట్‌పై అత్యాచారం, హత్య కేసులో.. ఇద్దరిని దోషులుగా నిర్ధారించిన కేరళ కోర్టు..

లాట్వియాకు చెందిన ఓ మహిళా టూరిస్ట్ హత్యాచారం కేసులో.. ఇద్దరు నిందితులను కేరళ హైకోర్టు దోషులుగా తేల్చింది. వీరికి డిసెంబర్ 5న శిక్షను ఖరారు చేయనుంది. 

2018 Latvian Woman Tourist Rape And Murder case, Kerala Court Convicts two
Author
First Published Dec 2, 2022, 2:09 PM IST

తిరువనంతపురం : తిరువనంతపురం సమీపంలోని కోవలం నుండి 2018లో అదృశ్యమైన లాట్వియా మహిళపై అత్యాచారం, హత్య కేసులో ఇద్దరు వ్యక్తులను కేరళలోని స్థానిక కోర్టు దోషులుగా నిర్ధారించింది. తిరువనంతపురం సెషన్స్ కోర్టు నిందితులు ఉమేష్, ఉదయన్‌లను భారతీయ శిక్షాస్మృతిలోని వివిధ సెక్షన్ల కింద దోషులుగా నిర్ధారించింది, 33 ఏళ్ల లాట్వియా టూరిస్ట్‌పై అత్యాచారం చేసి హత్య చేశారు. మృతురాలు మార్చి 14, 2018న కోవలం నుండి అనుమానాస్పద పరిస్థితులలో కనిపించకుండా పోయింది. 

ఘటన జరిగిన ప్రాంతాల్లో దొరికిన సాక్ష్యాధారాల ఆధారంగా నిందితులను దోషులుగా నిర్ధారించింది. డిసెంబర్ 5న నిందితులకు శిక్ష ఖరారుపై కోర్టు తీర్పు వెలువరించనుంది. కనిపించకుండా పోయిన లాట్వియా మహిళా టూరిస్టు మృతదేహం 38 రోజుల తర్వాత, కుళ్ళిన స్థితిలో దొరికింది. బాడీ పూర్తిగా కుళ్లిపోవడంతో సాక్ష్యాలు సేకరించడం చాలా కష్టం అయ్యింది. అయితే పోలీసులు ఆ సమయంలో అక్కడ జరిగిన ఘటనల ఆధారంగా కేసును చేధించారు. ప్రాసిక్యూషన్ దానిని కోర్టులో విజయవంతంగా నిరూపించగలిగింది" అని ప్రాసిక్యూటర్ మీడియాకు తెలిపారు.

75 ఏళ్ల వృద్ధురాలిపై యువకుడి అత్యాచారం, హత్య.. మరణశిక్ష విధించిన మహిళా కోర్టు

2018 ఏప్రిల్ 21న తిరువల్లం వద్ద ఉన్న మడ అడవుల్లో బాగా కుళ్లిపోయిన స్థితిలో.. తల లేని ఓ మహిళ మృతదేహాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఆ తరువాత నిందితులు ఉమేష్, ఉదయన్‌లను మే 3, 2018న అరెస్టు చేశారు. తిరువనంతపురంలోని కోర్టు కాంప్లెక్స్ వెలుపల మీడియాతో సమావేశమైన ఐజి పి ప్రకాష్ మాట్లాడుతూ.. ఎట్టకేలకు తమ శ్రమ ఫలించిందని.. వీరిని నిందితులుగా కోర్టు అంగీకరించినందుకు చాలా సంతోషంగా ఉందని అన్నారు. ఘటన జరిగినప్పుడు పి ప్రకాష్‌ నగర పోలీసు కమిషనర్‌గా ఉన్నారు.

"దోషులను న్యాయస్థానం ముందుకు తీసుకురాగలిగినందుకు సంతోషిస్తున్నాం. కేసులో చాలా సమస్యలు ఉన్నాయి. బాగా కుళ్ళిన స్థితిలో మృతదేహం కనుగొనబడింది. దీంతో ఈ కేసులో చాలా సవాళ్లు ఎదురయ్యాయి. కేసుకు స్థానికులు సహకరించలేదు. ఇది ఒక విదేశీ మహిళకు సంబంధించిన కేసు కావడంతో సమస్యలు వచ్చాయి. ఆమె కుటుంబానికి న్యాయం చేయగలిగాం" అని ప్రకాష్ అన్నారు. నిందితులపై ఐపిసి సెక్షన్లు 302 (హత్య), 376 (రేప్), నార్కోటిక్ డ్రగ్స్ అండ్ సైకోట్రోపిక్ సబ్‌స్టాన్సెస్ ఎన్‌డిపిఎస్ యాక్ట్ 20 (బి) కింద అభియోగాలు మోపారు.

మహిళ కనిపించకుండా పోయిన రోజు మార్చి 14వ తేదీన డ్రగ్స్ వ్యాపారులు అయిన ఇద్దరు నిందితులు ఆమెపై అత్యాచారం చేసి హత్య చేశారని పోలీసులు తెలిపారు. ఘటనాస్థలాన్ని చూడాల్సిన అద్భతమైన లొకేషన్ అని ఆమెకు చెప్పి.. అక్కడికి నిందితులు ఆమెను రప్పించారు. ఆమెతో గంజాయి తాగించి, లైంగికంగా వేధించి, గొంతుకోసి హత్య చేశారని వారు తెలిపారు.

Follow Us:
Download App:
  • android
  • ios