Pakistan Released 20 Fisherman: అత్తారి వాఘా సరిహద్దు నుంచి 20 మంది భారతీయ మత్స్యకారులను పాకిస్థాన్ విడుదల చేసింది. పాక్‌ను విడిచిపెట్టిన మత్స్యకారులు భారత్‌కు తిరిగి వచ్చారు
Pakistan Released 20 Fisherman: ఇరవై మంది భారత మత్స్యకారులను పాకిస్థాన్ విడుదల చేసింది. దీంతో వారు సోమవారం పంజాబ్‌లోని అట్టారీ-వాఘా సరిహద్దు మీదుగా భారత్‌లోకి ప్రవేశించారు. వారికి భారత సైన్యం స్వాగతం పలికింది. పాకిస్థాన్ జలాల్లో అక్రమంగా చేపల వేట సాగిస్తున్నారనే ఆరోపణలపై గత ఐదేళ్లుగా కరాచీలోని లాంధీ ప్రాంతంలోని మాలిర్ జిల్లా జైలు శిక్ష అనుభవించారు.
సింధ్ ప్రావిన్స్‌లోని మాలిర్‌లోని జిల్లా జైలు, కరెక్షనల్ ఫెసిలిటీ నుండి విడుదలైన 20 మంది భారతీయ మత్స్యకారులను ప్రత్యేక బస్సులో లాహోర్‌కు తీసుకువచ్చారు. సోమవారం వాఘా సరిహద్దు వద్దకు వచ్చినప్పుడు.. వారికి ఆహారం, కొత్త బట్టలు, PKR 5,000 అందిచారు.
ఇమ్మిగ్రేషన్ తర్వాత.. వారిని సరిహద్దు భద్రతా దళం (BSF)కి అప్పగించారు. వీరందరూ గుజరాత్‌కు చెందిన వారే. పాక్ నేవీ సిబ్బంది తమను సముద్రంలో పట్టుకుని జైల్లో ఉంచారని భారత జాలర్లు ఆరోపించారు. తాము ఐదేళ్లు జైలులో మగ్గినట్లు చెప్పారు. తమ విడుదలకు కృషి చేసిన కేంద్ర ప్రభుత్వానికి మత్స్యకారులు కృతజ్ఞతలు చెప్పారు. ఇది.. మానవ స్వభావంతో కూడుకున్న సమస్య అని, భారత్ కూడా అదే స్ఫూర్తిని ప్రదర్శిస్తుందని పాకిస్థాన్ భావిస్తోందని హైకమిషన్ పేర్కొంది. పాకిస్తాన్‌లో ఈ మత్స్యకారులపై న్యాయ విచారణ నిర్వహించబడింది. వారిలో కొందరూ 4 నుంచి 5 సంవత్సరాల శిక్ష అనుభవించారు.
శిక్షాకాలం ముగిసిన తర్వాతే భారత్ లోకి
ఈ మత్స్యకారుల శిక్ష ముగిసిన తర్వాత పాకిస్తాన్ వారిని వెనక్కి పంపిందని, వారు అట్టారీ సరిహద్దు నుండి భారత్ కు వచ్చారని, వారి పూర్తిగా చెకప్ పూర్తయిన తర్వాత, గుజరాత్ పోలీసులు వారిని తీసుకువెళతారని ప్రోటోకాల్ ఆఫీసర్ అరుణ్ పాల్ చెప్పారు. పాకిస్థాన్ జాలర్ల విడుదలపై మానవత్వం ప్రదర్శిస్తూ ఆదివారం 20 మంది భారతీయ జాలర్లను శిక్షాకాలం పూర్తి చేసుకుని భారత్‌కు పంపారు. ఈ మత్స్యకారులు గత 4 సంవత్సరాలుగా కరాచీలోని జైలులో ఉన్నారు.
ఓ మత్స్యకారుడితో మీడియా మాట్లాడూతూ.. ‘‘4 ఏళ్ల తర్వాత మళ్లీ వస్తున్నాం. పాకిస్థాన్‌లో చిక్కుకున్న మిగిత భారతీయులను కూడా విడుదల చేయాలి. ఆహారంలో సమస్య ఉంది. అతను సకాలంలో భారత ప్రభుత్వం స్పందించ పోతే.. అతని మృతదేహం భారతదేశానికి వచ్చేదని అన్నారు.
రవేంద్ర గోవింద్ అనే మత్స్యకారుడు విలేకరులతో మాట్లాడుతూ.. తాను భారత్‌కు తిరిగి వెళ్లడం సంతోషంగా ఉందని, అదే సమయంలో తనలాగే తెలియకుండా పాకిస్థాన్‌కు వెళ్లిన పలువురు భారతీయ మత్స్యకారులను జైల్లో వదిలిపెట్టడం బాధాకరమన్నారు. దయచేసి ఇతర భారతీయ మత్స్యకారులను కూడా విడుదల చేయండనీ, వారికి కూడా కుటుంబాలున్నాయని పాకిస్థాన్ ప్రభుత్వాన్ని అభ్యర్థించాడు. ఇదే నేరానికి పాల్పడి ఏళ్ల తరబడి భారత జైళ్లలో మగ్గుతున్న పాక్ మత్స్యకారులను కూడా విడుదల చేయాలని భారత ప్రభుత్వాన్ని కోరనున్నట్లు తెలిపారు.
గత జనవరి నెలలో కూడా పాకిస్తాన్ 20 మంది భారతీయ మత్స్యకారులను భారతదేశానికి అప్పగించిన విషయం తెలిసిందే. ఈ మత్స్యకారుల్లో కొందరిని పాకిస్థాన్‌లోని కరాచీలోని లాంధీ జైలులో ఉంచారు. అన్ని చట్టపరమైన లాంఛనాలను పూర్తి చేసిన తర్వాత BSF కు అప్పగించారు. అనుమతి లేకుండా అక్రమంగా పాకిస్థాన్ జలాల్లోకి ప్రవేశించి చేపల వేటకు పాల్పడినందుకు ఈ మత్స్యకారులను కూడా అరెస్టు చేశారు.
