Asianet News TeluguAsianet News Telugu

స్నేహితుడి ఇంటికి వచ్చి, అతని రెండేళ్ల కూతురిపై కన్నేసి.. అపహరించి, అత్యాచారం..

స్నేహితుడి ఇంటికి చుట్టపుచూపుగా వచ్చి అతని రెండేళ్ల కూతురి మీద కన్నేశాడో దుర్మార్గుడు. అర్థరాత్రి నిద్రలో ఆ చిన్నారిని ఎత్తుకెళ్లి అత్యాచారం చేశాడు. 

2-year-old kidnapped in sleep by father's friend, raped in Indore
Author
First Published Oct 14, 2022, 11:36 AM IST

ఇండోర్ : ఇండోర్‌లో దారుణమైన ఘటన చోటు చేసుకుంది. తల్లిదండ్రులతో కలిసి గుడిసెలో పడుకున్న రెండేళ్ల చిన్నారిని కిడ్నాప్ చేసి.. ఆపై చిన్నారిపై అత్యాచారం చేశాడు. కాగా, నిందితుడు తండ్రి స్నేహితుడే కావడం గమనార్హం.. వివరాల్లోకి వెడితే.. 

తల్లిదండ్రులతో నిద్రిస్తున్న రెండేళ్ల వయసు చిన్నారిని తండ్రి స్నేహితుడు.. బుధవారం అర్థరాత్రి దాటాక కిడ్నాప్ చేశాడు.  ఆ తరువాత ఆ చిన్నారిని ట్రక్కులో 3 కిలోమీటర్ల దూరం తీసుకెళ్లి, అత్యాచారం చేశాడు. ఆ చిన్నారిని అక్కడే రోడ్డు మీద వదిలేసి పారిపోయాడు. రోడ్డు మీద చిన్నారి రక్తం ఓడుతూ, ఏడుస్తూ కనిపించేసరికి స్థానికులు కాపాడి.. పోలీసులు సమాచారం అందించి, చిన్నారిని ఆస్పత్రికి తరలించారు. 

చిన్నారి తీవ్రంగా గాయపడిందని.. రక్తం బాగా పోయిందని ఆపరేషన్ చేయాల్సి వస్తుందని వైద్యులు తెలిపారు. నిందితుడు ట్రక్కులో పితాంపూర్ వైపు పారిపోయేందుకు ప్రయత్నిస్తుండగా తెల్లవారుజామున అరెస్టు చేశామని అదనపు డీసీపీ ప్రశాంత్ చౌబే గురువారం తెలిపారు. నిందితుడికి పెళ్లై, ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. అందులో పదేళ్ల కూతురు కూడా ఉంది. 

అమానుషం.. రెండేళ్ల చిన్నారిని రేప్ చేసి, నీళ్ల ట్యాంకులో పడేసి.. ఓ కామాంధుడి అరాచకం...

ఘటన జరిగిన ఐదు గంటల తర్వాత చిన్నారిని క్యాట్ రోడ్డులో బెడ్‌షీట్‌పై కూర్చోబెట్టి ఉండగా స్తానికులు గుర్తించారు. అప్పటికే చిన్నారి మిస్సింగ్ అని తల్లిదండ్రులు ఇచ్చిన ఫిర్యాదుతో పోలీసులు ముమ్మర గాలింపు చేపట్టారు. అలా చిన్నారి వారికి దొరికింది. సమాచారం అందగానే చందన్ నగర్, ద్వారకాపురి నుండి సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకున్నారు. చిన్నారి తల్లిదండ్రులకు సమాచారం అందించారు. వారు ఆమె తమ కూతురే అన గుర్తించడంతో వెంటనే ఆసుపత్రిలో చేర్చారు, అక్కడ ఆమెకు శస్త్రచికిత్స జరిగింది. గురువారం సాయంత్రానికి ఆమె పరిస్థితి నిలకడగా ఉన్నట్లు తెలిపారు.

చిన్నారి మీద ఇంత దారుణానికి పాల్పడిన నిందితుడి గురించి సమాచారం ఇస్తే రూ. 30,000 నగదు బహుమతిని ఇండోర్ పోలీస్ లు ప్రకటించారు. కమిషనర్ హరినారాయణచారి మిశ్రా మాట్లాడుతూ "ఇంతటి హేయమైన నేరానికి పాల్పడిన నిందితుడిని అరెస్టు చేశాం, అలాంటి వ్యక్తులను సహించేది లేదు,  కేసును వీలైనంగా వేగంగా విచారణ చేయడానికి సిఫార్స్ చేస్తాం" అన్నారు. 

బాధితురాలి తండ్రి భవన నిర్మాణ స్థలంలో వాచ్‌మెన్‌గా పనిచేస్తున్నాడు. బుధవారం రాత్రి భార్యాభర్తలు తమ మధ్య బిడ్డను పెట్టుకుని నిద్రపోయారు. తెల్లవారుజామున 2:30 గంటల ప్రాంతంలో ఆమె తల్లి నిద్ర లేచి చూడగా ఆమె కనిపించకపోవడంతో షాక్‌కు గురయ్యారు. స్థానికంగా ఆమె కోసం వెతికిన తర్వాత, వారు చందన్ నగర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. తెల్లవారుజామున 3:30 గంటలకు అపహరణ కేసు నమోదు చేశారు. సీనియర్ పోలీసు అధికారులు సంఘటనా స్థలానికి వెళ్లి పరిశీలించారు. ఆ ప్రాంతంలోని సీసీటీవీ ఫుటేజీని పరిశీలించగా.. ఓ ట్రక్కు అనుమానాస్పదంగా కనిపించింది. 

మైనర్ తండ్రి అది తన స్నేహితుడి ట్రక్కుగా గుర్తించారు. 36 ఏళ్ల ఆ ట్రక్కు నడిపే వ్యక్తి ధార్ జిల్లాలోని తాండాలో నివసిస్తున్నాడని, బుధవారం సాయంత్రం తన దగ్గరికి వచ్చాడని అతను పోలీసులకు చెప్పాడు. అతడి ఫోన్ నెం. ను బాధితురాలి తండ్రి దగ్గర తీసుకుని  ట్రాక్ చేయడం మొదలుపెట్టారు పోలీసులు. అలా నిందితుడిని పితాంపూర్‌కు వెళ్తుండగా అరెస్టు చేశారు. విచారణలో నిందితుడు నేరం చేసినట్లు అంగీకరించాడు అని తెలిపారు.

ట్రక్కును సీజ్ చేశారు. బుధవారం సాయంత్రం అతను తన స్నేహితుడి కుటుంబాన్ని కలిసినప్పుడే మైనర్‌ను అపహరించాలని నిర్ణయించుకున్నట్లు నిందితుడు పోలీసులకు చెప్పాడు. ఆ తరువాత  రాత్రిపూట మెల్లిగా ఇంట్లోకి చొరబడి.. గేట్లు తెరిచి, లోపలికి వెళ్లి ఆమె తల్లిదండ్రుల మధ్య పడుకున్న చిన్నారిని ఎత్తుకున్నాడు. అంతకుముందు అతడిని చూసింది కాబట్టి చిన్నారి కూడా మౌనంగా అతనితో వెళ్లింది అని పోలీసులు తెలిపారు. నిందితుడికి పదేళ్ల కూతురు, ఐదేళ్ల కుమారుడు ఉన్నారు. అతని భార్య కొన్నాళ్ల క్రితం అనారోగ్యంతో మృతి చెందింది.

Follow Us:
Download App:
  • android
  • ios