Asianet News TeluguAsianet News Telugu

అమానుషం.. రెండేళ్ల చిన్నారిని రేప్ చేసి, నీళ్ల ట్యాంకులో పడేసి.. ఓ కామాంధుడి అరాచకం...

ఆదివారం సాయంత్రం చిన్నారి తల్లిదండ్రులు బయటకు వెళ్లిన సమయంలో చందన్ ఓ బాలికపై rape చేసి అనంతరం నీళ్లు లేని ట్యాంకులో పడేసి వెళ్లిపోయాడు. 

two year old girl molestation in karnataka
Author
Hyderabad, First Published Nov 2, 2021, 10:15 AM IST

దొడ్డబళ్లాపురం (బెంగళూరు) : రెండేళ్ల చిన్నారిపై లైంగిక దాడి చేసి హత్యాయత్నం చేసిన కామాంధున్ని మంగళూరు పోలీసులు అరెస్ట్ చేశారు. బీహార్ కు చెందిన చందన్ (38) నిందితుడు. మంగళూరులోని హోయి బజార్ లో బీహార్ కు చెందిన సుమారు 30 కుటుంబాలు నివసిస్తున్నాయి. 

ఆదివారం సాయంత్రం చిన్నారి తల్లిదండ్రులు బయటకు వెళ్లిన సమయంలో చందన్ ఓ బాలికపై rape చేసి అనంతరం నీళ్లు లేని ట్యాంకులో పడేసి వెళ్లిపోయాడు. తిరిగి వచ్చిన తల్లిదండ్రులు కాలనీ అంతా వెదికి చివరగా రాత్రి 9 గంటల సమయంలో water tankలో చూడగా చిన్నారి స్పృహ తప్పి పడి ఉంది. 

తక్షణం ఆస్పత్రికి తరలించారు. పోలీసులు సోమవారం విచారణ జరపగా చిన్నారిని చందన్ తీసుకెళ్లాడని తెలిసింది. చందన్ ను అదుపులోకి తీసుకుని విచారణ జరపగా నిజం ఒప్పుకున్నాడు. 

రాజస్థాన్ లో డాక్టర్...
ఇదిలా ఉండగా... రాజస్థాన్ లో మృగవాంఛలు పెరిగి వావివరుసలు మరచిపోతే అతడు పశువుతో సమానం. అలాంటి తత్వంతో ప్రవర్తించాడు ఒక డాక్టర్. కూతురు లాంటి అమ్మాయిపై అత్యాచార యత్నానికి పాల్పడ్డాడు అంటూ ఓ మహిళా పోలీసులకు ఫిర్యాదు చేసింది. అయితే ఇందులో ఎంత వరకు వాస్తవం ఉంది అనేది ఇంకా బైటికి తెలియలేదు..

వివరాల్లోకి వెళితే... రాజస్థాన్ రాష్ట్రంలోని పాలీ నగరంలోని ట్రాన్స్పోర్ట్ నగర్ లో నివసించే డాక్టర్ ప్రకాష్ (55) (పేరు మార్చబడింది) మొదటి భార్యతో విడాకులు తీసుకున్న తరువాత 2010లో తన ఆసుపత్రిలోనే పని చేసే డాక్టర్ నళిని(పేరు మార్చబడింది)ని marriage చేసుకున్నాడు.

మహారాష్ట్ర మాజీ హోంమంత్రి అనిల్ దేశ్ ముఖ్ అరెస్ట్

ఆమెకు ఒక కూతురు సునిధి(పేరు మార్చబడింది) ఉంది. ప్రస్తుతం ఆ అమ్మాయికి 17 ఏళ్లు.  పెళ్లైన కొన్ని సంవత్సరాల తర్వాత నళిని, ప్రకాష్ ల మధ్య అభిప్రాయ భేదాలు తలెత్తాయి. దీంతో ఇద్దరూ గొడవ పడేవారు. ఇదిలా ఉండగా... ఇటీవల అక్టోబర్ 29న నలిని, తన కూతురు సునిధితో తన గదిలో నిద్ర పోతూ ఉండగా..  అర్ధరాత్రి డాక్టర్ నళినికి తన కూతురు అరుపులు వినిపించాయి.

దీంతో  ఆమె ఒక్కసారిగా  నిద్ర లేచి చూడగా పక్కన అమ్మాయి కనిపించలేదు. గది నుంచి బయటకు వచ్చి చూడగా ప్రకాష్ తన కూతురు చేయి పట్టుకుని ఉన్నాడు. నళిని అక్కడికి రావడంతో ప్రకాష్ చేయి విడిపించుకుని సునిధి తన తల్లి  నలినినీ  పట్టుకొని ఏడ్చేసింది.

ప్రకాష్ తనపై rape attempt చేయబోయాడు అని చెప్పింది. ఆ తర్వాత డాక్టర్ ప్రకాష్ అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. మరుసటి రోజు డాక్టర్ నలిని తన భర్త పై పోలీసులకు ఫిర్యాదు చేసింది. డాక్టర్ ప్రకాష్ దేశం వదిలి త్వరలో  పారిపోతున్నాడని, అతనిని త్వరగా పట్టుకోవాలని పోలీసులకు చెప్పింది.

అయితే, పోలీసులు ఇంకా డాక్టర్ ప్రకాష్ పై ఎటువంటి కేసు నమోదు చేయలేదు. డాక్టర్ నలిని చేసిన ఫిర్యాదు మేరకు విచారణ చేసిన తర్వాతే నిజం బయట పడుతుందని పోలీసులు అంటున్నారు. డాక్టర్ ప్రకాష్ ఎక్కడున్నాడో ఇంకా తెలియలేదు. 

Follow Us:
Download App:
  • android
  • ios