జమ్మూలో ఎన్‌కౌంటర్: నలుగురు ఉగ్రవాదుల హతం

2 Terrorists Killed In Encounter In Jammu And Kashmir's Anantnag
Highlights

జమ్మూ ఎన్‌కౌంటర్‌లో నలుగురు టెర్రరిస్టుల హతం

శ్రీనగర్:  జమ్మూ కాశ్మీర్‌లో  శుక్రవారం ఉదయం జరిగిన ఎన్‌కౌంటర్‌లో నలుగురు ఉగ్రవాదులు మరణించారు. వీరితో పాటు ఒక పౌరుడు, ఓ పోలీసు అధికారి మరణించారని భద్రతా దళాలు ప్రకటించాయి.

జమ్మూ కాశ్మీర్ రాష్ట్రంలోని అనంతనాగ్  జిల్లాలోని ఓ ఇంట్లో  ఉగ్రవాదులు తలదాచుకొన్నారనే సమాచారం మేరకు భద్రతా దళాలు ఆ ఇంటిని చుట్టుముట్టాయి. 

భద్రతా దళాలు, ఉగ్రవాదులకు మధ్య జరిగిన ఎదురు కాల్పుల్లో నలుగురు ఉగ్రవాదులు మరణించారు. ఈ ఘటనలో ఓ జవాన్ కూడ మృతి చెందారని అధికారులు  ప్రకటించారు. జవాన్ తో పాటు మరో సామాన్యుడు కూడ మరణించారని సమాచారం.

ఇంటలిజెన్స్ అధికారుల సమాచారం మేరకు భద్రతా దళాలు ఆ ఇంటిపై దాడికి దిగారు. మృతిచెందిన ఉగ్రవాదులతో పాటు మరో ఉగ్రవాది కూడ ఇంట్లో తలదాచుకొన్నారని అధికారులు అనుమానిస్తున్నారు.
 

loader