ఇంట్లో నక్కిన ఆరుగురు ఉగ్రవాదులు, ఇద్దరి ఎన్కౌంటర్....

First Published 10, Jul 2018, 12:40 PM IST
2 terrorists killed in encounter in jammu and kashmir
Highlights

జమ్మూకాశ్మీర్ లో ఉగ్రవాదుల ఏరివేతను భద్రతాదళాలు ముమ్మరం చేశారు. రంజాన్ పండగ తర్వాత కాల్పుల విరమణకు స్వస్తి పలికిన కేంద్రం ఉగ్రవాదులపై ఉక్కుపాదం మోపుతోంది. తాజాగా ఓ ఇంట్లో తలదాచుకుంటున్న ఉగ్రవాదులను గుర్తించిన భద్రతాదళాలు, వారిపై దాడిచేసి ఇద్దరు ఉగ్రవాదులను హతమార్చారు.
 
ఉగ్రవాదుల కదలికలపై నిఘా ఉంచిన భద్రతాదళాలు షోపియాన్ జిల్లాలోని ఓ ఇంట్లో ఆరుగురు ఉగ్రవాదులను భద్రతాదళాలు గుర్తించాయి. ఇవాళ ఉదయం కుందలన్ ప్రాంతంలోని ఆ ఇంటిని సైన్యం చుట్టుముట్టింది. ఆ ఇంటి సమీపంలోని కుటుంబాలను సురక్షిత ప్రాంతాలకు తరలించి ఉగ్రవాదులపై ఎన్కౌంటర్ ప్రారంభించింది.

దీంతో ఉగ్రవాదులు కూడా భద్రతాదళాలపై ఎదురు కాల్పులు మొదలుపెట్టారు. ఈ ఎన్కౌంటర్ లో ఇప్పటికే ఇద్దరు ఉగ్రవాదులు హతమయ్యారు. మిగతా వారిని కూడా మట్టుపెట్టడానికి సైన్యం ముమ్మర ప్రయత్నాలు చేస్తోంది. వారిపై విరామం లేకుండా బుుల్లెట్ల వర్షం కురిపిస్తోంది.

ఉగ్రవాదుల దాడిలో ఇద్దరి జవాన్లతో పాటు నలుగురు సామాన్య పౌరులు గాయపడ్డారు. దీంతో వారిని సమీపంలోని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.  భారీ హింసకు ప్లాన్ చేసే ఈ ఉగ్రవాదులు భారత్ లోకి చొరబడిఉంటారని రక్షణ శాఖ అదికారులు బావిస్తున్నారు.
 
loader