బాబ్లీ గేట్లు ఎత్తిన మహారాష్ట్ర.. గోదావరిలో జలకళ

2 gates of Babli project lifted by maharashtra government
Highlights

బాబ్లీ గేట్లు ఎత్తిన మహారాష్ట్ర.. గోదావరిలో జలకళ

మహారాష్ట్ర ప్రభుత్వం బాబ్లీ ప్రాజెక్ట్ గేట్లు ఎత్తింది. గత కొద్దిరోజులుగా ఆ రాష్ట్రంలో భారీ వర్షాలు కురుస్తుండటంతో.. వాగులు, వంకలు పోటెత్తున్నాయి.. దీంతో బాబ్లీ ప్రాజెక్ట్‌కు భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. ఈ నేపథ్యంలో బాబ్లీ గేట్లు ఎత్తి నీటిని విడుదల చేయాలని అధికారులు నిర్ణయించారు..  ఈ మధ్యాహ్నాం ప్రాజెక్ట్‌లోని రెండు గేట్ల ద్వారా 20 వేల క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు.. బాబ్లీ ప్రాజెక్ట్ దిగువ ప్రాంతాల వారు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు.. ఈ వరద నీరు రేపు శ్రీరాంసాగర్‌కు చేరుకుంటుందని అధికారులు తెలిపారు..

loader