తనకు వధువు వెతికి పెట్టండి అంటూ ఓ యువకుడు పోలీసులను ఆశ్రయించాడు. ఈ వింత రిక్వెస్ట్ విని పోలీసులు కూడా అవాక్కయ్యారు. ఈ సంఘటన ఉత్తరప్రదేశ్ రాష్ట్రం ముజఫర్ నగర్ లో చోటుచేసుకోగా... ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

ముజఫర్ నగర్ ప్రాంతానికి చెందిన  అజిమ్(26) కి ఎవరూ పెళ్లి చేసుకోవడానికి పిల్లని ఇవ్వడం లేదట. వాళ్ల ఇంట్లోని కుటుంబసభ్యులు సైతం తనకు పెళ్లి చేయాలని అనుకోవడం లేదట. అందుకే.. తనకు పెళ్లి చేసుకోవడానికి ఓ పిల్లను చూపి పెట్టాలంటూ పోలీసులను కోరాడు.

అయితే.. అతని వయసు 26ఏళ్లు అయినా.. ఎత్తు మాత్రం రెండు అంగుళాలే. అందుకే అతనిని పెళ్లి చేసుకోవడానికి ఎవరూ ముందుకు రావడం లేదని తెలుస్తోంది.

కాగా.. అతని రిక్వెస్ట్ కి పోలీసులు కూడా స్పందించారు. దంపతుల మధ్య ఏవైనా విభేదాలు వస్తే.. వాటిని తాము పరిష్కరిస్తాము కానీ.. పెళ్లి సంబంధాలు చూడటం మాత్రం తమ బాధ్యత కాదని ఆ పోలీసులు తేల్చి చెప్పేశారు. దీంతో.. అతను నిరాశగా వెనుదిరిగాడు.

కాగా... అతని పెళ్లి కోరిక పై అజిమ్ కుటుంబసభ్యులు స్పందించారు. అజిమ్ కి పెళ్లి చేసుకోవాలని ఉందని కానీ.. అతనిని పెళ్లి చేసుకోవడానికి ఎవరైనా ముందుకు రావాలి కదా అని ప్రశ్నించారు.

అజిమ్ ఎత్తు తక్కువ మాత్రమే కాదని.. అనేక ఆరోగ్య సమస్యలు ఉన్నాయని చెప్పారు. చేతులకు కూడా సమస్య ఉందని పేర్కొన్నారు.  శారీరకంగా చాలా వీక్ గా ఉంటాడని చెప్పారు. అతనిని జాగ్రత్తగా చూసుకునే వ్యక్తి ఎవరైనా దొరికితే పెళ్లి చేయాలని తాము అనుకుంటున్నామని వారు చెప్పారు.