రాజాజీ హాల్ వద్ద తొక్కిసలాట, ఇద్దరి మృతి, 40 మందికి గాయాలు

2 dead in stampede near Rajaji Hall where late Karunanidhi lies in state
Highlights

మాజీ ముఖ్యమంత్రి, డీఎంకే అధినేత కరుణానిధి మృతితో తమిళనాడు రాష్ట్రం మొత్తం శోకసంద్రంలో మునిగిపోయింది. ఇక డీఎంకే కార్యకర్తలు, కరుణానిధి అభిమానుల ఆక్రందనలతో తమిళ నాట విషాద ఛాయలు అలుమున్నాయి. నిన్న సాయంత్రం నుండి తమ అభిమాన నాయకుడి కడసారి చూపుకోసం ఎదురుచూస్తున్న వారంతా చెన్నై బాట పట్టారు. దీంతో కరుణానిధి పార్థివదేహాన్ని ఉంచిన రాజాజీ హాల్ జనసంద్రంగా మారింది.
 
తమ అభిమాన నాయకున్ని కడసారి చూసుకోవాలని భారీగా ప్రజలు రాజాజీ హాల్ కు తరలివచ్చారు. దీంతో వారిని అదుపు చేయడం పోలీసులకు కష్టంగా మారింది. అంతే కాకుండా కరుణానిధి చివరిసారిగా దర్శించుకునేందుకు పీఎంతో పాటు వివిధ రాష్ట్రాల సీఎంలు,తమిళ సినీ ప్రముఖులు, వివిధ పార్టీల రాజకీయ నాయకులు, వీఐపీలు, డీఎంకే పార్టీ నాయకులు కూడా భారీ సంఖ్యలో చేరుకోవడం పరిస్థితి మరింత దిగజారింది. దీంతో రాజాజీ హాల్ వద్ద తొక్కిసలాట జరిగింది.

ఈ తొక్కిసలాటలో ఇద్దరు వ్యక్తులు మృతిచెందారు. మరో 40 మంది తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన వారిని పోలీసులు స్థానిక ఆస్పత్రికి తరలించారు. ఇక సందర్శకులను అదుపుచేయడానికి పోలీసులు లాఠీ చార్జ్ చేయాల్సి వచ్చింది. 

రక్షణ కోసం ఏర్పాటు చేసిన బారీకేడ్లను ద్వంసం చేస్తూ ముందుకు వెళుతున్న వారిపై మాత్రమే లాఠీ చార్జ్ చేసినట్లు పోలీసులు తెలిపారు. వారిని అదుపు చేయడానికి తమకు వేరే మార్గం కనిపించకపోవడంతో ఇలా చేశామని పోలీసులు చెబుతున్నారు.

loader