కేంద్ర మంత్రికి సెక్స్‌టార్షన్ కాల్.. ఇద్దరు అరెస్ట్.. పరారీలో సూత్రధారి..
కేంద్ర సహాయ మంత్రి ప్రహ్లాద్ సింగ్ పటేల్‌కు సెక్స్‌టార్షన్ కాల్ చేసిన ఇద్దరు వ్యక్తులను ఢిల్లీ పోలీసులు అరెస్టు చేశారు. ఢిల్లీ పోలీసు క్రైమ్ బ్రాంచ్ రాజస్థాన్‌లోని భరత్‌పూర్‌కు చెందిన మహ్మద్ వకీల్, మహ్మద్ సాహిబ్‌లను అరెస్టు చేసింది, ప్రధాన నిందితుడు సాబీర్ పరారీలో ఉన్నాడు.

కేంద్ర మంత్రి ప్రహ్లాద్ పటేల్‌ను హానీ ట్రాపింగ్ లో బాధితుడిని చేసే ప్రయత్నం జరిగింది. ప్రహ్లాద్ పటేల్‌కి ఈ వీడియో కాల్ చేసి బ్లాక్‌మెయిలింగ్ చేయాలని భావించిన ముఠా గుట్టు రట్టైంది. ఈ కేసులో రాజస్థాన్‌కు చెందిన ఇద్దరు వ్యక్తులను ఢిల్లీ క్రైం బ్రాంచ్ అరెస్టు చేసింది. సాక్షాత్తూ కేంద్ర మంత్రి ప్రహ్లాద్ పటేల్‌ను ఓ ఆర్గనైజ్డ్ సెక్స్‌టార్షన్ వీడియో కాల్ చేసి బ్లాక్‌మెయిల్ చేసేందుకు ప్రయత్నించారని, ఆ తర్వాత కేంద్ర మంత్రి వ్యక్తిగత కార్యదర్శి ఢిల్లీ పోలీస్ కమిషనర్‌కు ఫిర్యాదు చేశారు. ఢిల్లీ పోలీసులు ఈ కేసును క్రైమ్ బ్రాంచ్‌కు బదిలీ చేశారు. ఈ కేసును విచారించిన క్రైమ్ బ్రాంచ్ భరత్‌పూర్‌కు చెందిన మహ్మద్ వకీల్, మహ్మద్ సాహిబ్‌లను అరెస్టు చేసింది.
కేంద్ర మంత్రి ప్రహ్లాద్ పటేల్ మొబైల్ నంబర్‌కు వీడియో కాల్ వచ్చిందని పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. అతను కాల్ లిఫ్ట్ చేయగానే.. అవతలి వైపు నుండి అభ్యంతరకరమైన వీడియో ప్లే చేయడం ప్రారంభించింది. ఆ తర్వాత వెంటనే కాల్ డిస్‌కనెక్ట్ చేశాడు. మరోవైపు మంత్రి తరుపున పోలీసులకు ఫిర్యాదు చేయడంతో .. వారి గుట్టు రట్టయ్యింది. ఢిల్లీ పోలీసులు కేసును క్రైం బ్రాంచ్‌కు బదిలీ చేశారు. IPC సెక్షన్ 420 ,419 కింద ఎఫ్‌ఐఆర్ నమోదు చేయడం ద్వారా క్రైమ్ బ్రాంచ్ దర్యాప్తు ప్రారంభించింది, ఈ కేసులో ఇద్దరు నిందితులను అరెస్టు చేశారు.
క్రైమ్ బ్రాంచ్ విచారించగా.. ముఠా బండారం బయటపడింది. కేసు రాజస్థాన్‌తో అనుసంధానించబడి ఉన్నాయని దర్యాప్తులో వెల్లడైంది, ఆ తర్వాత ఇద్దరు నిందితులు మహ్మద్ వకీల్ ,మహ్మద్ సాహిబ్‌లను రాజస్థాన్‌లోని భరత్‌పూర్ నుండి అరెస్టు చేశారు, అయినప్పటికీ క్రైమ్ బ్రాంచ్ ఇప్పటికీ సూత్రధారి కోసం వెతుకుతోంది. ఈ సూత్రధారి సాబీర్‌గా గుర్తించారు. అరెస్టయిన నిందితులు సెక్స్‌టార్షన్ కాల్స్ చేస్తూ బ్లాక్ మెయిల్ కు పాల్పడుతారని గుర్తించారు.