Asianet News TeluguAsianet News Telugu

అతని పొట్టలో 1.2 కిలోల కాయిన్ల కుప్ప.. సర్జరీ చేసి 187 కాయిన్స్ తొలగించిన వైద్యులు

కర్ణాటకలోని ఓ హాస్పిటల్‌కు వచ్చిన వ్యక్తికి ఎండోస్కోపీ చేయగా.. పొట్టలో కాయిన్ల కుప్ప ఉన్నట్టు తెలియవచ్చింది. సుమారు 1.2 కిలోల కాయిన్లు ఉన్నాయి. వీటిని గ్యాస్ట్రోటమీ సర్జరీ చేసి వైద్యులు తొలగించారు. ఇందులో ఒక్కరూపాయి, రెండు రూపాయలు, ఐదు రూపాయల కాయిన్లు ఉన్నాయి.
 

187 currency coins karnataka mans stomach, doctors removes
Author
First Published Nov 29, 2022, 3:36 PM IST

బెంగళూరు: కర్ణాటకలో ఓ విచిత్రం వెలుగు చూసింది. ఓ వ్యక్తి పొట్టలో కాయిన్ల కుప్ప కనిపించింది. ముందుగా ఎక్స్‌రేలో ఈ విషయం కనిపించింది. కానీ, దాన్ని మళ్లీ ధ్రువీకరించుకోవడానికి వైద్యులు ఎండోస్కోపీ చేశారు. పొట్టలో ఎక్కడబడితే అక్కడ కాయిన్లే దర్శనం ఇచ్చాయని వైద్యులు తెలిపారు. వాటిని గ్యాస్ట్రోటమీ సర్జరీ చేసి తొలగించామని వైద్యులు తెలిపారు. ఆ కాయిన్ల బరువు సుమారు 1.2 కిలోలు ఉన్నదని తెలిసింది. మొత్తం 187 కాయిన్స్‌ వైద్యులు తొలగించారు. ఇందులో ఒక్క రూపాయి కాయిన్స్, రెండు రూపాయల కాయిన్స్, ఐదు రూపాయల కాయిన్స్ ఉన్నట్టు వైద్యులు తెలిపారు.

కర్ణాటకలోని బగల్‌కోట్‌లో హెచ్ఎస్‌కే హాస్పిటల్‌లో వైద్యులు ఈ సర్జరీ చేశారు. పేషెంట్‌ను 58 ఏళ్ల ద్యామప్ప హరిజన్‌గా గుర్తించారు.

ద్యామప్ప హరిజన్ సిజోఫ్రేనియా అనే మానసిక వ్యాధితో బాధపడుతున్నారు. ఆయన కొన్నాళ్లుగా తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. కొన్నాళ్లు పొట్ట బాగా ఉబ్బింది. నిద్రలోనూ ఆయన గాయంతో మూలుగుతూనే ఉండేవాడు. అతడిని హెచ్ఎస్‌కే హాస్పిటల్ తీసుకు వచ్చారు.

Also Read: కడుపులో ఐదేళ్ల నుంచి కత్తెర.. డెలివరీ చేసిన వైద్యుల నిర్లక్ష్యం.. మళ్లీ అదే హాస్పిటల్‌కు బాధితురాలు

వైద్యులు అతడికి ఎక్స్‌రే తీశారు. పొట్టలో ఇనుప వస్తువులు ఉన్నట్టు గుర్తించారు. రీకన్ఫామ్ చేసుకోవడానికి వైద్యులు ఎండోస్కోపీ చేశారు. ఆ తర్వాత గ్యాస్ట్రోటమీ సర్జరీ చేసి కాయిన్స్ తొలగించారు. ఆ కాయిన్స్ సుమారు 1.2 కిలోలు తూగినట్టు తెలిసింది. సర్జరీ చేసిన డాక్టర్లలో ఒకరు ఈశ్వర్ కాలబుర్గి మీడియాతో మాట్లాడారు.

ఇది సవాలుతో కూడిన కేసు అని ఆయన తెలిపారు. ఆయన పొట్ట గాలి బుడుగా మారిపోయిందని అన్నారు. కడుపులో ఎటు చూసినా చిందరవందరగా కాయిన్స్ కనిపించాయని వివరించారు. అందులో ఒక్క రూపాయి కాయిన్లు, రెండు రూపాయల కాయిన్లు, ఐదు రూపాయల కాయిన్లు ఉన్నాయని పేర్కొన్నారు.

ద్యామప్ప హరిజన్ 56 ఐదు రూపాయల కాయిన్లు, 51 రెండు రూపాయల కాయిన్లు, 80 ఒక్క రూపాయి కాయిన్లను మింగేశాడు. ద్యామప్ప హరిజన్ కాయిన్లు మింగేస్తున్నాడనే విషయం వారి కుటుంబ సభ్యులకు తెలియదు. అయితే, కొన్నాళ్లుగా కడుపు నొప్పి, వాంతులు చేసుకుంటున్నట్టు కుటుంబ సభ్యులకు ఫిర్యాదు చేశాడు. అతడిని హాస్పిటల్ తీసుకెళ్లిన తర్వాత పొట్టలో పెద్ద సంఖ్యలో కాయిన్లు ఉన్నట్టు తేలింది.

Also Read: వామ్మో.. 63 చెంచాలు తిన్న యువకుడు.. ఆపరేష‌న్ చేసి బ‌య‌ట‌కు తీసిన డాక్ట‌ర్లు.. ఎక్క‌డంటే ?

ద్యామప్ప హరిజన్ కొడుకు రవికుమార్ మాట్లాడుతూ, ‘ఆయన కాయిన్లు మింగుతున్నట్టు మాకు తెలియదు. ఆయన మానసిక అనారోగ్యంతో ఉన్నాడు. కానీ, ప్రతి రోజూ చేసుకునే డైలీ రోటీన్లు‌ ఆయనే స్వయంగా చేసుకుంటూ ఉంటాడు. ఆయన కాయిన్లు మింగినట్టు ఎవరికీ చెప్పలేదు. కొన్ని రోజుల క్రితమే ఆయన పొట్ట బాగా ఉబ్బింది. ఆయన పడుకున్నప్పుడు మరీ విపరీతంగా బాధపడేవాడు. కానీ, కాయిన్లు మింగినట్టు బహుశా ఆయన కూడా ఆలోచించలేదు. ఆయనకు తట్టలేదు. స్కాన్ చేసిన తర్వాత మాకు ఈ విషయం తెలియవచ్చింది’ అని అన్నారు.

Follow Us:
Download App:
  • android
  • ios