చైనా దేశంలోని బొగ్గుగునిలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో దాదాపు 18మంది చిన్నారులు మృతి చెందారు. చైనా నైరుతి ప్రాంతంలోని చాంగ్ కింగ్ లోని గనిలో జరిగిన ఘోర ప్రమాదంలో 18 మంది పిల్లలు మరణించారని చైనా అధికారిక వార్తాసంస్థ శనివారం తెలిపింది. 

డయాషుయిడాంగ్ బొగ్గు గనిలో అధిక స్థాయిలో కార్బన్ మోనాక్సైడ్ వాయువు వెలువడటంతో పిల్లలు మరణించారు. రెండు నెలల్లో బొగ్గుగనిలో రెండో ప్రమాదం జరిగింది. ప్రపంచంలోనే అత్యంత ఘోరమైన బొగ్గుగనులున్న చైనాలోని చాంగ్కింగ్ సాంగ్జావో బొగ్గుగనిలో సెప్టెంబరులో జరిగిన ప్రమాదంలో 16 మంది మరణించారు. కాగా.. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.