17 ఏళ్ల నీట్ అభ్యర్థిని ఆత్మహత్య.. తల్లిదండ్రులకు ‘గుడ్ బై’ అని రాసి పదో అంతస్తు పై నుంచి దూకి..
17 ఏళ్ల నీట్ అభ్యర్థిని రాజస్తాన్‌లోని కోటాలో పదో అంతస్తు మీది నుంచి దూకి ఆత్మహత్య చేసుకుంది. తన తల్లిదండ్రులకు గుడ్ బై అని తన డైరీలో పేర్కొంది.

కోటా: రాజస్తాన్‌లో 17 ఏళ్ల నీట్ అభ్యర్థిని ఆత్మహత్య చేసుకుంది. కోటాలోని కున్హరి ఏరియాలో పది అంతస్తుల పై నుంచి దూకేసింది. తన డైరీలో తల్లిదండ్రులకు గుడ్ బై అని రాసి ప్రాణాలు తీసుకుంది. ఈ మేరకు పోలీసులు గురువారం వెల్లడించారు. బుధవారం రాత్రి 7 గంటల సమయంలో ఆ బాలిక ఆత్మహత్య చేసుకుంది.
పోలీసులు విషయం తెలుసుకుని స్పాట్‌కు చేరుకున్నారు. ప్రాథమిక దర్యాప్తు చేశారు. ఈ దర్యాప్తులో బాలికది ఆత్మహత్యే అని తేలిందని వివరించారు. ఆమె ఏక వాక్యం రాసి మరణించింది. తన తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులకు గుడ్ బై మెస్సేజీ రాసి పది అంతస్తుల పై నుంచి దూకి ఆత్మహత్య చేసుకుంది. ఈ సింగిల్ లైన్‌ను తన డైరీలో రాసుకుంది.
Also Read: నీట్ ఎగ్జామ్ కోసం విద్యార్థినుల బ్రాలు తొలగించిన సిబ్బంది.. లేదంటే అనుమతించబోమని వార్నింగ్
ఆ బాలిక రాజస్తాన్‌లోని బర్మార్ జిల్లా చౌతాన్ గ్రామానికి చెందిన నివాసి. ఆమె తన ఇద్దరు సోదరులు, ఒక సోదరితో కలిసి కోటాలో ఓ మల్టిపుల్ స్టోరీ బిల్డింగ్‌లో సెకండ్ ఫ్లోర్‌లో ఉంటున్నారు. ఆ రూమ్‌లో ఉంటూ ఆమె నేషనల్ ఎంట్రెన్స్ కమ్ ఎలిజిబిలిటీ టెస్టుకు ఆన్‌లైన్‌లో కోచింగ్ తీసుకుంటున్నట్టు సర్కిల్ ఆఫీసర్ శంకర్ లాల్ వెల్లడించారు. గురువారం ఆమె బాడీకి పోస్టుమార్టం నిర్వహించిన తర్వాత మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అందజేసినట్టు వివరించారు. బాలిక తండ్రి బెంగళూరులో వర్క్ చేస్తున్నాడు. కాగా, ఆమె తల్లి వారి నేటివ్ ప్లేస్‌లోనే హౌజ్ వైఫ్‌గా ఉంటున్నారు.