Asianet News TeluguAsianet News Telugu

నీట్ ఎగ్జామ్ కోసం విద్యార్థినుల బ్రాలు తొలగించిన సిబ్బంది.. లేదంటే అనుమతించబోమని వార్నింగ్

కేరళలో నీట్ అభ్యర్థులకు చేదు అనుభవం ఎదురైంది. కొల్లాం జిల్లాలోని ఓ నీట్ ఎగ్జామ్ సెంటర్‌కు వెళ్లిన విద్యార్థినులను బ్రాలు తొలగించాలని సెక్యూరిటీ సిబ్బంది ఆదేశించారు. బ్రాలకు ఉన్న మెటల్ హుక్‌లు మటెల్ డిటెక్టర్‌లు గుర్తించాయని, వాటిని తొలగించకుంటే పరీక్ష రాయడానికి అనుమతించబోమని చెప్పారు. దీంతో విద్యార్థులు బ్రాలు తొలగించుకోవాల్సి వచ్చింది.
 

NEET aspirants allegedly forced to remove bra in kerala
Author
Thiruvananthapuram, First Published Jul 19, 2022, 12:09 AM IST

తిరువనంతపురం: సోమవారం నీట్ ఎగ్జామ్ నిర్వహించిన సంగతి తెలిసిందే. కేరళలో ఈ ఎగ్జామ్‌కు సంబంధించి ఓ వివాదం వెలుగులోకి వచ్చింది. నీట్ పరీక్ష కోసం సెక్యూరిటీ చెక్ హద్దులు దాటినట్టుగా అర్థం అవుతుంది. మెటల్ డిటెక్టర్ బీప్ సౌండ్ చేయడంతో విద్యార్థినులను పక్కకు నిలిపారు. వారి బ్రాలకు మెటల్ పిన్ ఉండటం మూలంగా ఈ సౌండ్ వస్తున్నదని, వాటిని తొలగించాలని సెక్యూరిటీ సిబ్బంది విద్యార్థినులపై ఒత్తిడి చేశారు. బ్రా తొలగించుకునేలా బలవంతం చేసి.. పరీక్ష రాయడానికి అనుమతి ఇచ్చారు. ఈ విషయమై ఓ విద్యార్థిని తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో విషయం వెలుగులోకి వచ్చింది. ఈ ఘటన కేరళలోని కొల్లాంలో చోటుచేసుకుంది.

కొల్లాం జిల్లాలో నీట్ సెంటర్‌కు వెళ్లిన విద్యార్థినులకు ఈ చేదు అనుభవం ఎదురైంది. వారు ధరించిన బ్రాకు మెటల్ హుక్ ఉండటం మూలంగా.. ఆ లోదుస్తులను తొలగించాలని సెక్యూరిటీ సిబ్బంది విద్యార్థినులను ఆదేశించారు. విద్యార్థినులు తిరస్కరిస్తే.. పరీక్షకు అనుమతించబోమని స్పష్టం చేశారు. ‘ఇప్పుడు మీరు ధరించిన లోదుస్తులు ముఖ్యమా? మీ భవిష్యత్తు ముఖ్యమా.. వాటిని తొలగించండి. మా సమయం వృథా చేయొద్దు’ అని విద్యార్థినులతో సెక్యూరిటీ సిబ్బంది మాట్లాడినట్టు ఓ విద్యార్థిని తండ్రి పోలీసులకు చేసిన ఫిర్యాదులో పేర్కొన్నారు.

కొల్లాం జిల్లాలోని మార్తోమా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో చోటుచేసుకుంది. ఈ ఘటనకు తమకు సంబంధం లేదని విద్యా సంస్థ పేర్కొంది. 

ఈ ఘటనపై ఫిర్యాదు అందిందని కొల్లాం పోలీసు చీఫ్ కేబీ రవి ధ్రువీకరించారు. ఆ ఫిర్యాదు ప్రకారం, కొన్ని అభ్యంతరకర విషయాలు తెలియవచ్చాయి.

‘సెక్యూరిటీ చెక్ తర్వాత నా కూతురు ధరించిన ఇన్నర్ వేర్‌కు ఉన్న హుక్‌ను మెటల్ డిటెక్టర్ గుర్తించిందని చెప్పారు. కాబట్టి, ఆ లోదుస్తును తొలగించాలని నా కూతురిని ఆదేశించారు. కేవలం నా కూతురే కాదు.. 90 శాతం మంది విద్యార్థినులు ఈ ఆదేశాల కారణంగా లోదుస్తులు తొలగించుకోవాల్సి వచ్చింది. వాటన్నింటిని స్టోర్ రూమ్‌లో పెట్టారు. ఈ పరిణామాలతో వారంతా మాసికంగా ఆందోళనలకు గురయ్యారు. ఓ రూమ్‌లో మొత్తం ఇన్నర్ వేర్‌లను నా కూతురు చూసింది. ఈ మెంటల్ టార్చర్ కారణంగా చాలా మంది పిల్లలు ఏడుస్తూ కనిపించారు. చాలా మంది విద్యార్థినులు బ్రాలకు ఉన్న హుక్స్ తొలగించి కట్టేసుకున్నారు. ఈ పిల్లల మానసిక స్థితి కలతకు గురైందని, పరీక్ష కూడా వారు కలవరంతోనే రాశారు’ అని ఆయన తన ఫిర్యాదులో పేర్కొన్నారు.

నీట్ పరీక్ష రాసే మెడికల్ యాస్పిరెంట్స్‌కు సెక్యూరిటీ చెక్ పెద్ద సవాలుగా మారింది. అభ్యర్థులు ఏ వస్తువులూ తమ వెంట తెచ్చుకోవద్దని ఆదేశాలు ఉన్నాయి. వాలెట్లు, హ్యాండ్ బ్యాగులు, బెల్ట్‌లు, క్యాప్‌లు, జువెల్లరీ, షూలు, హీల్స్ వంటివన్నీ నిషేధాలే. ఈ నిషేధాజ్ఞలు అమలు చేయడంలో ఈ కొల్లాం ఘటన పరాకష్టకు తీసుకెళ్లినట్టు తెలుస్తున్నది.

Follow Us:
Download App:
  • android
  • ios