ఆరు దశాబ్ధాల పాటు తమిళ రాజకీయాలను శాసించిన కురువృద్ధుడు, మాజీ ముఖ్యమంత్రి, డీఎంకే అధినేత కరుణానిధి మరణంతో తమిళనాడు విషాదంలో మునిగిపోయింది. తమ అభిమాన నేత ఇక లేరనే వార్తలు తట్టుకోలేక పలువురు కరుణ అభిమానుల గుండె ఆగింది. ఇప్పటి వరకు అందిన సమాచారం ప్రకారం మొత్తం 17 మంది గుండెపోటుతో మరణించారు.

వీరిలో కృష్ణగిరి జిల్లా హోసూరుకు చెందిన తీర్థగిరి చెట్టియార్, తిరువణ్ణామలైకి చెందిన నరసింహా, ఆదమంగలం పుదూరుకు చెందిన వెంకటేశ్, ఆరణి అంబేడ్కర్ నగర్‌కు చెందిన నర్కీస్, పుళిరంబాక్కంకి చెందిన సుశీల, తాయిల్‌పట్టి కలైజ్ఞర్ కాలనీకి చెందిన సుబ్బయ్య, మధురైకి చెందిన అళగురాజ, తిరునెల్వేలికి చెందిన గురుస్వామి, మరుక్కాలంకుళంకు చెందిన షణ్ముగం, వేలుస్వామి

పట్టివీరట్టికి చెందిన జయరాజ్, తామరైకుళానికి చెందిన షాజహాన్, ఆండిపట్టికి చెందిన ధర్మకోటి, నెయ్‌కుప్పైకి చెందిన సుబ్రమణ్యన్, పెరంబూరుకు చెందిన రాజేంద్రన్, మైలాడుదురైకి చెందిన నాగరాజ్ గుండెపోటుతో మరణించగా.. రాసికాపురానికి చెందిన టై మురుగన్ ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. ఈ మరణాలపై కేసులు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.