jharkhand bus Accident: జార్ఖండ్‌లోని పాకూర్‌లో బుధవారం ఉదయం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో మృతుల సంఖ్య 17 కి చేరింది. సాహిబ్‌గంజ్‌లోని బర్హర్వా నుంచి దుమ్కాకు వెళ్తున్న బస్సు లిట్టిపాడు-అమ్దపర రహదారిపై పాడేర్‌కోలా సమీపంలో  ట్రక్కును ఢీకొట్టింది. ఈ ఘటనలో దాదాపు 31 మంది గాయపడ్డారు.  పాకూర్ ఎస్పీ హెచ్‌పీ జనార్దన్ తెలిపారు.   

Jharkhand bus Accident: జార్ఖండ్‌లోని పాకూర్‌ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. పాకూర్ జిల్లాలోని అమ్దపరా పోలీస్ స్టేషన్ పరిధిలోని సాహిబ్‌గంజ్‌లోని బర్హర్వా నుంచి దుమ్కాకు వెళ్తున్న బస్సు లిట్టిపాడు-అమ్దపర రహదారిపై పాడేర్‌కోలా సమీపంలో బుధవారం ఉదయం గ్యాస్ సిలిండర్లతో కూడిన ట్రక్కును ఢీకొట్టింది. ఈ భీక‌ర ప్రమాదంలో ఇప్పటివరకు 17 మంది మృతి చెందినట్లు నిర్ధారించారు. అదే సమయంలో దాదాపు 30 మందికి పైగా గాయపడిన‌ట్టు తెలిపారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని పాకూర్ ఎస్పీ హెచ్‌పీ జనార్దన్ తెలిపారు. ఇప్ప‌టి వ‌ర‌కూ 16 మృతదేహాలను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. మ‌ర‌ణించిన వారిలో 16 మందిని గుర్తించిన‌ట్టు అధికారులు తెలిపారు. బస్సు, ట్రక్కు ఢీకొనడం వల్ల బస్సులోనే చిక్కుకుపోయారు. దీని కోసం, చిక్కుకున్న వ్యక్తులు మరియు మృతదేహాలను బయటకు తీయడానికి పోలీసు యంత్రాంగం గ్యాస్ కట్టర్లను ఏర్పాటు చేసింది. దట్టమైన పొగమంచు ప్రమాదానికి కారణమని భావిస్తున్నారు.

మృతులకు లక్ష రూపాయల సాయం..

ఈ ప్ర‌మాదంపై జార్ఖండ్ ప్ర‌భుత్వం విచారం వ్య‌క్తం చేసింది. ప్రమాదంలో మరణించిన వారి కుటుంబ స‌భ్యుల‌కు జార్ఖండ్ ప్రభుత్వం ఒక్కొక్కరికి రూ.లక్ష సాయం ప్రకటించింది. అదే సమయంలో ఈ ప్ర‌మాదంలో గాయ‌ప‌డిన వారికి ఒక్కొక్కరికి రూ.10,000 సహాయంతో పాటు పూర్తి చికిత్స ఖర్చును భరించాలని నిర్ణయించారు. ఈ మేర‌కు పాకూర్ డిప్యూటీ కమిషనర్ వరుణ్ రంజన్ ప్ర‌భుత్వ నిర్ణ‌యాన్నిప్ర‌క‌టించారు. 

Read Also: ప్రభుత్వ ఉద్యోగులకు వరుసగా నాలుగు రోజుల సెలవు.. ఆ రెండు రోజులు పెద్దల కోసం: రాష్ట్ర ప్రభుత్వం

ట్రక్కు- బస్సు ఢీకొన్న ప్రమాదంలో రెండు వాహ‌నాలు తీవ్రంగా ధ్వంస‌మ‌య్యాయి. చాలా మంది బ‌స్ లోపల చిక్కుకున్నారు. ప్రమాదం తర్వాత బస్సు బాడీని గ్యాస్ కట్టర్‌తో కోసి ప్రయాణీకులను బయటకు తీశారు. దాదాపు 5 గంట‌ల పాటు తీవ్రంగా శ్ర‌మించి.. క్ష‌త‌గాత్రులను బ‌య‌ట‌కు తీసిన‌ట్టు సబ్-డివిజనల్ పోలీస్ ఆఫీసర్ (SDPO) అజిత్ కుమార్ విమల్ (Ajit Kumar Vimal) తెలిపారు. గాయపడిన వారిలో పలువురి పరిస్థితి విషమంగా ఉందని, మృతుల సంఖ్య ఆయన పేర్కొన్నారు. ట్రక్కుపై ఉన్న గ్యాస్ సిలిండర్ల పేలకపోవడంతో..పెను ప్రమాదం తప్పిందని వారు చెప్పారు. ఈ ప్ర‌మాదంలో గాయ‌ప‌డిన 24 మందిని ఆసుపత్రిలో చేర్చారు. మృతదేహాలను పోస్టుమార్టంకు తరలించారు. ప్రమాదం గురించి సమాచారం అందిన వెంటనే స్థానికులు ముందుగా సంఘటనా స్థలానికి చేరుకున్నారు. అధికారులు, పోలీసులు రాకముందే సహాయక, సహాయక చర్యల్లో నిమగ్నమయ్యారు. ప్రమాదం జరిగిన తర్వాత జిల్లా అధికార యంత్రాంగం, పోలీసు ఉన్నతాధికారుల బృందం కూడా సంఘటనా స్థలానికి చేరుకుంది.

Read Also: ప్రధాని మోడీ పర్యటన రద్దుపై పంజాబ్‌లోని కాంగ్రెస్ ప్రభుత్వం ఏమన్నదంటే..?

పొగమంచు కారణమా?
ఈ ఘోర రోడ్డు ప్ర‌మాదానికి ప్రధాన కార‌ణం.. భారీగా కురిసిన పొగమంచేన‌నీ, ఈ పోగ మంచు కార‌ణంగానే ప్రమాదం జరిగిందని పోలీసు అధికారులు అంచనా వేస్తున్నారు. పొగమంచు కారణంగానే ప్రమాదం జరిగింద‌ని ప్రాథ‌మిక నిర్థార‌ణ కు వ‌చ్చారు పోలీసులు. పోగ‌మంచు కారణంగానే ఎదురుగా వస్తున్న బస్సును లారీ డ్రైవర్ చూడలేక‌పోయాడ‌ని భావిస్తున్నారు.
పాకూర్ రోడ్డు ప్రమాదంపై జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్ స్పందించారు. మృతుల కుటుంబాలు త‌న సంతాపం వ్యక్తం చేశారు. ‘పాకూర్ లో జ‌రిగిన రోడ్డు ప్రమాదం హృదయాన్ని కదిలిచి వేసింది. ఆ వార్తతో నా మనస్సు చాలా బాధపడింది. భగవంతుడు మృతుల ఆత్మకు శాంతి చేకూర్చాలని, మృతుల కుటుంబాలకు సంతాపం వ్య‌క్తం చేశారు. క్షతగాత్రులకు సరైన చికిత్స అందించాలని జిల్లా యంత్రాంగానికి సీఎం ఆదేశాలు జారీ చేశారు. ప్రమాదంపై డీసీ వరుణ్‌రంజన్‌ విచారణకు ఆదేశించారు.