డివైడర్ ను ఢీకొట్టి బోల్తాపడిన బస్సు: 17 మంది మృతి

First Published 13, Jun 2018, 8:24 AM IST
17 dead after bus hits divider, overturns in UP's Mainpuri
Highlights

ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. 

లక్నో: ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. అతి వేగంగా వెళ్తున్న బస్సు డివైడర్ ను ఢీకొట్టి బోల్తా పడింది. ఐ ప్రమాదంలో 17 మంది మరణించారు. కాగా, 35 మంది గాయపడ్డారు.

గాయపడినవారిని ఆస్పత్రికి తరలించారు. బస్సు అతి వేగమే ప్రమాదానికి కారణంగా తెలుస్తోంది. వివరాలు అందాల్సి ఉంది. బస్సు డ్రైవర్ కూడా గాయపడ్డాడు. అతను ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. అతని వాంగ్మూలాన్ని రికార్డు చేయడానికి పోలీసులు ప్రయత్నిస్తున్నారు. గాయపడినవారిలో ముగ్గురి పరిస్థితి ఆందోళనకరంగా ఉంది.

మృతులకు ముఖ్యమంత్రి యోగి అదిత్యనాథ్ సంతాపం ప్రకటించారు. మృతుల కుటుంబాలకు తన సానుభూతిని తెలియజేశారు. క్షతగాత్రులకు ఉత్తమ చికిత్స అందేలా చూడాలని ఆయన అధికారులను ఆదేశించారు. 

loader