లక్నో:  ఉత్తర్‌ప్రదేశ్ రాష్ట్రంలో  మరో దారుణం వెలుగు చూసింది. 16 ఏళ్ల మైనర్ బాలికపై  ఐదుగురు యువకులు లైంగిక దాడికి పాల్పడ్డారు. అంతేకాదు ఈ వీడియోను  సోషల్ మీడియాలో పెట్టారు.

ఉత్తర్‌ప్రదేశ్ రాష్ట్రంలోని  ఝాన్సీ ప్రాంతంలో 16 ఏళ్ల మైనర్ బాలికను ఇంటి వద్ద దింపుతామని తన బైక్‌పై ఓ యువకుడు తీసుకెళ్లాడు. జనసంచారం లేని నిర్మానుష్యప్రాంతానికి తీసుకెళ్లాడు.

అంతేకాదు  తన మరో ముగ్గురు స్నేహితులను కూడ పిలిపించాడు నిందితుడు. నలుగురు ఆమెపై లైంగిక వేధింపులకు పాల్పడ్డారు. అంతేకాదు ఈ తతంగాన్ని ఓ యువకుడు వీడియో తీశారు. అంతేకాదు ఈ వీడియోను సోషల్ మీడియాలో పోస్టు చేశారు. దీంతో బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

ఈ ఘటన ఈ నెల 12వ తేదీన చోటు చేసుకొందని పోలీసులు తెలిపారు.పొలంలో పనిచేస్తున్న తన తల్లికి భోజనం ఇచ్చేందుకు వెళ్లి వస్తున్న బాధితురాలిపై ఈ నలుగురు యువకులు లైంగిక వేధింపులకు పాల్పడ్డారని పోలీసులు తెలిపారు.

తనకు తెలిసిన ఓ యువకుడు బాధితురాలికి బైక్‌పై లిఫ్ట్ ఇచ్చాడు. మిగిలిన నలుగురు యువకులు తనకు తెలియదని బాధితురాలు  పోలీసులకు ఫిర్యాదు చేసింది. అసలు ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు.  పోలీసులు ఈ ఘటనపై  కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.