యూపీలోని ఝాన్సీలో కీచకపర్వం ! 16 ఏళ్ళ అమ్మాయిని కొందరు దుండగులు పొలాల నుంచి అడవుల్లోకి లాక్కుపోయి.. అసభ్యకరంగా ప్రవర్తించారు.. పొలంలో పనిచేస్తున్న తన తల్లికి ఆహారం తీసుకువెళ్తున్న ఈ బాలికను ఆమెకు తెలిసిన యువకుడే లిఫ్ట్ ఇస్తానంటూ.. వెంట బెట్టుకుపోగా.. దారిలో కొందరు ఆకతాయిలు అడ్డగించారు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred

బలవంతంగా ఆమెను లాక్కుపోయి..లైంగికంగా వేధించారు. తనను వదిలేయమని ఆమె ప్రాధేయపడినా ..ఆ దుర్మార్గులు వదలకపోగా..ఒకడు తన మొబైల్‌లో ఈ కీచకపర్వాన్ని చిత్రీకరించాడు. ఈ నెల 12 న జరిగిన ఈ ఘటన తాలూకు 6 నిముషాల నిడివి గల వీడియో బయటపడడంతో.. పోలీసులు స్పందించారు. దర్యాప్తు చేసి ప్రధాన నిందితుడితోపాటు ముగ్గురిని అరెస్టు చేశారు. పరారీలో ఉన్న మరి కొందరిని కూడా త్వరలో పట్టుకుంటామని వారంటున్నారు.