Asianet News TeluguAsianet News Telugu

21 ఏళ్ల యువతిపై 15 ఏళ్ల బాలుడు అత్యాచారయత్నం.. పొలాల్లోకి లాక్కెళ్లి, రాళ్లతో కొట్టి...

సోమవారం మధ్యాహ్నం కంప్యూటర్ క్లాసులకు వెళ్లడం కోసం ఇంటి నుంచి కొట్టకుక్కర జంక్షణ్ వైపు కొండొట్టిలోని కంప్యూటర్ సెంటర్ కు వెళ్తున్న మహిళను accusedవెంబడించాడు. నిర్జన ప్రదేశానికి రాగానే ఈ ఘటన చోటుచేసుకుంది.

15-Year-Old Kerala Boy Dragged Woman, Tried To Choke, Rape Her: Police
Author
Hyderabad, First Published Oct 28, 2021, 11:45 AM IST

మలప్పురం : కేరళలోని మలప్పురం జిల్లాలో 21 ఏళ్ల యువతిపై 15 ఏళ్ల బాలుడు అత్యాచారానికి యత్నించాడు. ఒంటరిగా నడిచి వెడుతున్న యువతిని బలవంతంగా పొలాల్లోకి లాక్కెల్లి Sexual assaultకి పాల్పడబోయాడు.

దీనిమీద కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. సోమవారం మధ్యాహ్నం కంప్యూటర్ క్లాసులకు వెళ్లడం కోసం ఇంటి నుంచి కొట్టకుక్కర జంక్షణ్ వైపు కొండొట్టిలోని కంప్యూటర్ సెంటర్ కు వెళ్తున్న మహిళను accusedవెంబడించాడు. నిర్జన ప్రదేశానికి రాగానే ఈ ఘటన చోటుచేసుకుంది.

మార్షల్ ఆర్ట్ జూడో తెలిసిన నిందితులు ఆమెను రోడ్డు పక్కనే ఉన్న పొలాల్లోకి బలవంతంగా ఈడ్చుకు వెళ్లాడు. ఆ తరువాత ఆమె తల మీద stoneతో కొట్టి, ఆమె చేతుల్ని దుపట్టాతో కట్టేందుకు ప్రయత్నించాడు. ఆమె మీద rape attempt చేశాడు. అయితే ఆమె దీన్ని ప్రతిఘటించింది. తప్పింకుకునేందుకు ప్రయత్నించింది. ఆమె గింజుకుంటుండంతో గొంతు కోసేందుకు ప్రయత్నించాడని మలప్పురం జిల్లా పోలీసు చీఫ్ సుజిత్ దాస్ ఎస్ తెలిపారు.

"ఇక్కడ జనసంచారం చాలా తక్కువగా ఉంటుంది. ఘటన జరిగిన ఆ సమయంలో ఆ చుట్టుపక్కల ఎవరూ లేరు" అని పోలీసు అధికారి తెలిపారు.
అంతేకాదు ఏదో విధంగా అతని నుంచి తప్పించుకున్న మహిళ సమీపంలోని ఇంట్లోకి పారిపోయిందని అధికారి తెలిపారు.

ఆ తరువాత పోలీసులకు ఫిర్యాదు చేయడంతో మంగళవారం ఉదయం నిందితుడిపై కేసు నమోదు చేసిన పోలీసులు.. బుధవారం యువకుడిని జువైనల్ జస్టిస్ బోర్డు ముందు హాజరుపరిచారు. తదుపరి వైద్య ప్రక్రియల కోసం అతడిని జువైనల్ హోంకు తరలించినట్లు పోలీసులు తెలిపారు.

"బాలుడి దాడిలో ప్రాణాలతో బయటపడిన బాధితురాలితో వివరంగా మాట్లాడాం. survivor తనమీద దాడి చేసిన వ్యక్తిని బాగా వర్ణించింది. దీంతో మా నిఘా, నెట్‌వర్క్ ఇన్‌పుట్‌ల ఆధారంగా మేము అతనిని ప్రశ్నించాలని నిర్ణయించుకున్నాం" అని పోలీసులు తెలిపారు. అంతేకాదు ఈ దారుణానికి పాల్పడిన  accused అతని దాడిలో బయటపడిన వ్యక్తికి అంతకుముందు పరిచయం లేదని పోలీసులు తెలిపారు.

అయితే నిందితుడి నుంచి అతికష్టం మీద తప్పించుకున్న యువతి ఇంటికి వెళ్లి జరిగినదంతా కుటుంబ సభ్యులకు చెప్పడంతో వారు పోలీసులకు ఫిర్యాదు చేశారని.. యువతి తెలిపిన ఆధారాల ప్రకారం పోలీసులు బాలుడిని అదుపులోకి తీసుకున్నారని తెలిపారు. 

Aryan Khan Case : ప్రత్యక్ష సాక్షి కిరణ్ గోసావి అరెస్ట్...

వారి విచారణలో నిందితుడు పదవ తరగతి విద్యార్థి అని,  రాష్ట్ర స్థాయి Judo Champion‌గా పోటీ చేశాడని పోలీసుల విచారణలో తేలింది. అయితే మొదట్లో నిందితుడు తానీ నేరం చేయలేదని బుకాయించాడు. కానీ, పోలీసులు కాస్త గట్టిగా తమదైన స్టైల్లో అడగడంతో నిజాన్ని అంగీకరించాడు. దీంతో ఆ బాలుడిని Board of Juvenile Justice ముందు హాజరు పరచనున్నారు.

ఈ కేసులో తదుపరి విచారణ కొనసాగుతోంది అని పోలీసులు తెలిపారు. అంతేకాదు అనుకోకుండా జరిగిన ఈ ఘటనతో బాధితురాలు తీవ్ర షాక్ లో ఉందని.. ఆమె ఆ పరిస్థితి నుంచి కోలుకోవడానికి కాస్త సమయం పడుతుందని, ఆ తరువాతే కేసులో విచారణ పూర్తి చేయడం జరుగుతుందని పోలీసులు తెలిపారు.  

ఈ ఘటన కేరళలో ప్రకంపనలు సృష్టించింది. మైనర్ బాలుడు ఈ కేసులో నిందితుడు కావడంతో అంతా ఒక్కసారిగా ఉలిక్కి పడ్డారు. ఇటీవల మైనర్లు ఇలాంటి ఘటనలు పాల్పడుతుండడం ఎక్కువవుతుంది. 

దీనికి మీతిమీరిన సోషల్ మీడియానే కారణం అంటూ తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇలాంటి ఘటనలు ఇక ముందు జరగకుండా పోలీసులు, ప్రభుత్వాలు జాగ్రత్తలు తీసుకోవాలని డిమాండ్లు వస్తున్నాయి. 

Follow Us:
Download App:
  • android
  • ios