కోల్‌కత్తా: ఆంఫన్ తుఫాన్ పశ్చిమ బెంగాల్ రాష్ట్రంపై తీవ్ర ప్రభావాన్ని చూపింది. ఈ తుఫాన్ ప్రభావంతో రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 15 మంది మృతి చెందారు.  కోల్‌కత్తా ఎయిర్ పోర్టులోకి భారీగా వర్షం నీరు చేరుకొంది.

ఆంఫన్ తుఫాన్ బుధవారం నాడు సాయంత్రం తీరం దాటింది. దీంతో బెంగాల్ రాష్ట్రంలో భారీ వర్షపాతం నమోదైంది. భారీ వృక్షాలు కూడ నేలకూలాయి. తుఫాన్ ప్రభావం ఇంకా పొంచి ఉందని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరించారు. దీంతో బెంగాల్ రాష్ట్ర ప్రజలు చిగురుటాకులా వణికిపోతున్నారు.

బుధవారం నాడు ఉదయం నుండి బెంగాల్, ఒడిశా రాష్ట్రాల్లో వర్షం నమోదైంది. తుఫాన్ తీరం దాటిన తర్వాత బెంగాల్ రాష్ట్రంలో భారీ ఈదురుగాలులతో వర్షం పడింది.

ఈ తుఫాన్ తో కోల్‌కత్తాలో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. రాష్ట్రంలో వందలాది ఇల్లు దెబ్బతిన్నాయి. బెంగాల్, ఒడిశా రాష్ట్రాల నుండి సుమారు 7 లక్షల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. 

also read:నేడు, రేపు ఆంపన్ తుఫాన్ ప్రభావం: వణుకుతున్న ఒడిశా, బెంగాల్ తీర ప్రాంతాలు

కోల్ కత్తా ఎయిర్ పోర్టులో భారీగా వర్షం నీరు చేరింది.ఈ నీటిని బయటకు తోడిపోస్తున్నారు అధికారులు. రన్ వే పూర్తిగా నీటిలో తడిచిపోవడంతో ఈ ఎయిర్ పోర్టులో కార్యకలాపాలను రద్దు చేశారు.