ఎఫైర్: తెలుస్తుందని ప్రియురాలి కొడుకును చంపిన ప్రియుడు

14-yr-old boy's throat slit by mother's lover over fears of affair being discovered
Highlights

అద్దెకు ఉంటున్న ఇంటి యజమాని భార్యతో వివాహేతర సంబంధం కల్గి ఉన్న ఓ వ్యక్తి ఆమె కొడుకును చంపేసిన ఘటన ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రంలోని ఘజియాబాద్ లో చోటు చేసుకొంది. సుభాష్ కుమార్ అనే వ్యక్తి తాను అద్దెకు ఉండే ఇంటి యజమాని భార్యతో వివాహేతర సంబంధం కల్గి ఉన్నాడు. జూన్ 26న తన తల్లి అద్దెకు ఉండే ఇంట్లో ఉండడాన్ని కొడుకు చూశాడు. అయితే ఈ విషయం బయటకు వస్తోందనే కారణంతో సుభాష్ కుమార్ 14 ఏళ్లబాలుడిని చంపేశాడు.


ఘజియాబాద్: తమ వివాహేతర సంబంధం బయటపడుతోందనే  భయంతో  14 ఏళ్ల బాలుడిని గొంతుకోసి చంపాడు ఓ వ్యక్తి. ఈ ఘటన ఉత్తర్‌ప్రదేశ్ రాష్ట్రంలో చోటు చేసుకొంది.  అయితే సీసీటీవి పుటేజీ ఆధారంగా ఈ దారుణానికి పాల్పడిన  సుభాష్ కుమార్ అనే వ్యక్తిని  పోలీసులు  అరెస్ట్ చేశారు.

ఉత్తర్‌ప్రదేశ్ రాష్ట్రంలోని ఘజియాబాద్‌లోని మోడీ నగర్‌లో   సుభాష్ కుమార్ నివాసం ఉంటున్నాడు. అతడికి భార్య, ముగ్గురు పిల్లలున్నారు. అయితే తాను నివాసం ఉంటున్న ఇంటి యజమాని  భార్యతో  సుభాష్ కుమార్ కు వివాహేతర సంబంధం నెలకొంది.

జూన్ 26వ తేదీన సుభాష్ కుమార్ రూమ్‌లో తన తల్లి ఉండడాన్ని 14 ఏళ్లబాలుడు చూశాడు. తమ మధ్య ఉన్న వివాహేతర సంబంధం బయటపడుతోందనే ఉద్దేశ్యంతో  ఆ బాలుడిని చంపేయాలని  సుభాష్ కుమార్ నిర్ణయం తీసుకొన్నారు.

మృతుడి తండ్రి ప్రతి రోజూ విధుల కోసం ఢిల్లీ వెళ్లేవాడు. ఎప్పటి మాదిరిగానే క్రికెట్ ఆడుకొనేందుకు వెళ్లిన కొడుకు నిర్ణీత సమయాని కంటే ముందుగానే ఇంటికి వచ్చాడు. అయితే ఆ సమయంలో తన తల్లి  సుభాష్ కుమార్ రూమ్ లో ఉంది. అయితే తమ రాసలీలలను ఆ బాలుడు చూశాడని   సుభాష్ కుమార్ తో పాటు తల్లి అనుమానించింది. ఈ విషయం ఆ బాలుడు బయట చెబుతారని భయపడ్డారు.

అయితే క్రికెట్‌లో గొడవ కారణంగా సీనియర్లు అతడిని హత్య చేశారని తొలుత భావించారు. కానీ అది నిజం కాదని పోలీసుల దర్యాప్తులో తేలింది. ఆ బాలుడి మృతదేహం దొరికిన ప్రాంతానికి వెళ్లే మార్గంలోని సీసీటీవి పుటేజీని పోలీసులు పరిశీలించారు.

అయితే సుభాష్ కుమార్ స్కూటీపై మృతుడు వెళ్లినట్టు గుర్తించారు.  గాలి పటం ఇప్పిస్తానని  చెప్పి సుభాష్ కుమార్ ఆ బాలుడిని  తీసుకెళ్లాడని పోలీసులు సీసీటీవి దృశ్యాల్లో గుర్తించారు. 

గంగ నది కాలువ ప్రాంతం వైపున ఉన్న చెరుకు తోటలోకి బాలుడిని తీసుకెళ్లి తన వెంట తెచ్చుకొన్న కత్తితో బాలుడి గొంతు కోసి హత్య చేసినట్టు సీసీటివి దృశ్యాల్లో గుర్తించారు.అయితే తన కొడుకును ఎవరు, ఎందుకు చంపారనే విషయమై తనకు తెలియదని మృతుడి తండ్రి చెబుతున్నారు.

loader