విషాదం.. కైవల్యా నదిలో మునిగి ఇద్దరు మృతి.. తిరుపతి జిల్లాలో ఘటన

కైవల్యా నదిలో మునిగి ఇద్దరు స్నేహితులు చనిపోయారు. వీరు మరో నలుగురు స్నేహితులతో కలిసి ఈతకొట్టేందుకు ఆ నదికి వెళ్లారు. అయితే నీటి లోతుపై అంచనా లేకపోడంతో వారు మునిగిపోయారు. ఈ ఘటన తిరుపతి జిల్లాలోని గూడురులో విషాదాన్ని నిపింది. 

Tragedy.. Two drowned in Kaivalya river.. Incident in Tirupati district..ISR

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తిరుపతి జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. ఈతకొట్టేందుకు అని నదికి వెళ్లి ఇద్దరు మరణించారు. ఈ ఘటన స్థానికంగా విషాదాన్ని నింపింది. వివరాలు ఇలా ఉన్నాయి. గూడూరు మండలం విందూరు గ్రామంలో శ్రీనివాసులు పముజుల, వెంకటేశ్వర్లు కొండా, మోహన్ పముజులు స్నేహితులు. ఆదివారం సెలవుదినం కావడంతో వీరంతా సరదాగా ఈతకొట్టేందుకు కైవల్యా నదికి వెళ్లాలని భావించారు.

అతిక్ అహ్మద్ ఆఫీసు ఎదుట హారన్ కొట్టినా.. బంధించి టార్చర్ పెట్టేవాడు - డాన్ హింసలు గుర్తు చేసుకున్న మహిళా రైతు

వీరు ముగ్గురు స్నేహితులు మరో నలుగురు స్నేహితులను తీసుకొని ఆ నదికి వెళ్లారు. ముందుగా నదిలో ఈత కొట్టేందుకు 45 ఏళ్ల శ్రీనివాసులు పముజుల, అలాగే 35 ఏళ్ల వెంకటేశ్వర్లు కొండా, మోహన్ పముజుల నీటిలోకి వెళ్లారు. కానీ వారికి ఆ నదిలో నీటి లోతుపై అంచనా లేదు. కొంత సమయం ఈత కొట్టిన తరువాత వారు ఎక్కువ లోతున్న ప్రదేశానికి చేరుకొన్నారు. అక్కడ వారికి లోతు ఎక్కువగా ఉందన్న విషయం తెలియదు. 

ఇలా ఈత కొడుతున్న క్రమంలో నీరు ఎక్కువగా ఉన్న చోటు వారు ముగ్గురు మునిగిపోయారు. ఇందులో శ్రీనివాస్, వెంకటేశ్వర్లు నీటిలో మునిగిపోయారు. అయితే మోహన్ చాలా కష్టం మీద ఎలాగోలా నీటి ఒడ్డుకు చేరుకున్నారు. అయితే నీట మునిగిన స్నేహితులను కాపాడేందుకు మిగితా మిత్రులు ఎంతో ప్రయత్నం చేశారు. కానీ వారిని కాపాడలేకపోయారు. 

మరో 15-20 రోజుల్లో మహారాష్ట్ర షిండే ప్రభుత్వం కూలిపోతుంది - ఎంపీ సంజయ్ రౌత్ సంచలన వ్యాఖ్యలు

తెలంగాణలోని నారాయణపేట జిల్లాలో కూడా ఈ నెల 18వ తేదీన ఇలాంటి ఘటనే జరిగింది. చెరువులో మునిగి  ముగ్గురు పిల్లలు, ఓ మహిళ చనిపోయారు. నారాయణపేట మండలం బోయిన్‌పల్లి అనే గ్రామంలో సురేఖ (28) మేకలు మేపుతూ జీవనం సాగించేవారు. ఎప్పటిలాగే ఆ  మంగళవారం కూడా ఆమె మేకలు మేపేందుకు వెళ్లారు. అయితే ఆమె వెంట 8 ఏళ్ల కుమారుడు విజయ్, 11 ఏళ్ల అక్క కూతురు లిఖిత, పక్కింట్లో నివసించే నర్సప్ప 8 ఏళ్ల కొడుకు వెంకటేష్ కూడా వెళ్లారు. 

మధ్యప్రదేశ్ లోని బాలాఘాట్ లో ఇద్దరు మహిళా మావోయిస్టులు హతం.. ఒక్కొక్కరిపై రూ.14 లక్షల రివార్డు

గ్రామానికి దగ్గర్లలో ఉన్న పచ్చిక బయళ్లలో సురేఖ మేకలు కాస్తుండగా.. పిల్లలు ముగ్గురు కూడా పక్కనే ఉన్న చెరువులో దిగి సరదాగా ఈత కొట్టడం ప్రారంభించారు. అయితే లోతు ఎక్కువగా ఉండటంతో వారంతా మునిగిపోయారు. వీరిని గమనించి సురేఖ వెంటనే పరిగెత్తుకుంటూ వచ్చి చెరువులోకి వెళ్లారు. పిల్లలను కాపాడేందుకు ప్రయత్నించారు. ముగ్గురు పిల్లలు ఆమెను పట్టుకోవడంతో సురేఖ కూడా నీటిలో మునిగిపోయారు. దీంతో నలుగురు కూడా నీట మునిగారు. ఈ ఘటనను గమనించిన  ఓ బాలిక ఊర్లోకి పరిగెత్తుకుంటూ వెళ్లింది. గ్రామస్తులకు జరిగింది చెప్పింది. దీంతో స్థానికులు అంతా చెరువు దగ్గరకు పరిగెత్తుకుంటూ వచ్చారు. కొందరు చెరువులోకి దూకి నలుగురుని వెలికి తీశారు. కానీ అప్పటికే వారంతా మరణించారు. 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios