Asianet News TeluguAsianet News Telugu

ఫుడ్ పాయిజనింగ్: 130 మంది విద్యార్థులకు అస్వస్థత.. ఆస్ప‌త్రిలో చికిత్స

Bengaluru: ఫుడ్ పాయిజనింగ్ తో 130 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. ఈ ఘ‌ట‌న మంగళూరులోని శక్తినగర్ లో చోటుచేసుకుంది.  ఫుడ్ పాయిజనింగ్ కారణంగా అక్క‌డి నర్సింగ్, పారామెడికల్ కళాశాలలో 130 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు.
 

130 students fell ill due to food poisoning in Shaktinagar, Mangalore.
Author
First Published Feb 7, 2023, 11:11 AM IST

Mangaluru food poisoning: ఫుడ్ పాయిజనింగ్ తో 130 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. ఈ ఘ‌ట‌న మంగళూరులోని శక్తినగర్ లో చోటుచేసుకుంది.  ఫుడ్ పాయిజనింగ్ కారణంగా అక్క‌డి నర్సింగ్, పారామెడికల్ కళాశాలలో 130 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. వారిని ఆస్ప‌త్రికి త‌ర‌లించి చికిత్స అందించారు. ప్ర‌స్తుతం వారి ఆరోగ్యం నిల‌క‌డ‌గా ఉంద‌ని వైద్యులు తెలిపారు. 

వివ‌రాల్లోకెళ్తే.. క‌ర్నాట‌క‌లోని మంగళూరులోని శక్తినగర్‌లో సోమవారం నర్సింగ్-పారామెడికల్ కళాశాలలో 130 మంది విద్యార్థులు అనుమానాస్పద ఫుడ్ పాయిజన్ కారణంగా ఆసుపత్రి పాలయ్యారు. కొంతమంది విద్యార్థులు తమ హాస్టల్‌లోని మెస్‌లో ఆహారం తీసుకున్నారనీ, ఆ తర్వాత వారు కడుపునొప్పి, విరేచ‌నాలు, వాంతులు చేసుకోవ‌డంతో ఇబ్బందులు ప‌డ్డారు. ఆయా ప‌రిస్థితులు మ‌రింత ఎక్కువ కావ‌డంతో ఫిర్యాదు చేయడం ప్రారంభించారు.

 

ఫుడ్‌ పాయిజనింగ్‌ కారణంగా 130 మంది విద్యార్థులు నగరంలోని వివిధ ఆసుపత్రుల్లో చేరారు. ఏజే ఆస్పత్రిలో 52 మంది, కేఎంసీ జ్యోతిలో 18 మంది, యూనిటీ ఆస్పత్రిలో 14 మంది, సిటీ ఆస్పత్రిలో 8 మంది, మంగళ ఆస్పత్రిలో 3 మంది, ఎఫ్ఆర్ ముల్లర్స్ ఆస్పత్రిలో ఇద్దరు విద్యార్థులు చేరారు. నగరంలోని కనీసం ఐదు ఆసుపత్రుల్లో విద్యార్థులు చేరినట్లు మంగళూరు నగర పోలీసు కమిషనర్ ఎన్ శశికుమార్ తెలిపారు. సోమవారం తెల్లవారుజామున 2 గంటల నుంచి విద్యార్థులకు కడుపునొప్పి, వాంతులు, విరేచ‌నాలు కావ‌డం మొద‌లైంద‌ని తెలిపారు. కళాశాల అధికారులు విద్యార్థుల కుటుంబ సభ్యులతో ఎలాంటి వివరాలు చెప్పకపోవడంతో తల్లిదండ్రుల్లో భయాందోళన నెలకొంది.

''ఫుడ్ పాయిజనింగ్ కారణంగా వారిని ఆస్ప‌త్రిలో అడ్మిట్ చేశారు. భయాందోళన చెందాల్సిన అవసరం లేదు. హాస్టల్ ను సందర్శించి వార్డెన్ తో మాట్లాడి అన్ని విషయాలు తెలుసుకుంటాం. విద్యార్థులంతా ప్రాణాపాయం నుంచి బయటపడ్డారు. ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు'' అని జిల్లా హెల్త్ ఇన్స్పెక్టర్ డాక్టర్ అశోక్ తెలిపారు.


 

Follow Us:
Download App:
  • android
  • ios