Asianet News TeluguAsianet News Telugu

Norovirus : కేరళలో కలవరం సృష్టిస్తున్న మరో కొత్త వైరస్.. 13 మందికి ‘నోరో’ !

 చాలా సులువుగా ఒకరి నుంచి మరొకరికి వ్యాపించే ఈ వైరస్ పట్ల అప్రమత్తంగా Government of Kerala ప్రజలకు సూచించింది. పరిస్థితి అదుపులోనే ఉందని, ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని తెలిపింది.

13 students of veterinary college in Keralas Wayanad test positive for Norovirus
Author
Hyderabad, First Published Nov 13, 2021, 7:40 AM IST

తిరువనంతపురం :  పులి మీద పుట్రలా కేరళలో మరో వైరస్ కలకలం రేపింది. ఇప్పటికే కరోనా మహమ్మారి ఉధృతి  కొనసాగుతుండగా... ఇటీవల నిపా వైరస్  కూడా ఆందోళన రేకెత్తించిన సంగతి తెలిసిందే. తాజాగా రాష్ట్రంలో అరుదైన norovirus కేసులు బయటపడ్డాయి.  వయనాడ్ జిల్లా పోకోడ్ లోని  పశు వైద్య కళాశాలలకు చెందిన 13 మంది విద్యార్థులు  దీని బారిన పడ్డారు.  veterinary collegeకు చెందిన  ప్రాంగణం  హాస్టల్లో ఉంటున్న  విద్యార్థుల్లో  మొదట ఈ వైరస్ బయట పడినట్లు అధికారులు తెలిపారు. 

అనంతరం శాంపిళ్లను అలప్పుజా లోని జాతీయ వైరాలజీ సంస్థ (ఎన్ఐవి) కి పంపించగా పలువురిలో norovirus బయటపడినట్లు చెప్పారు. చాలా సులువుగా ఒకరి నుంచి మరొకరికి వ్యాపించే ఈ వైరస్ పట్ల అప్రమత్తంగా Government of Kerala ప్రజలకు సూచించింది. పరిస్థితి అదుపులోనే ఉందని, ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని తెలిపింది. మరోవైపు norovirus నియంత్రణ చర్యల్లో భాగంగా వైద్య, ఆరోగ్యశాఖ అధికారులు సంబంధిత పశు వైద్య కళాశాల students ఆరోగ్య సమాచారాన్ని సేకరిస్తున్నారు.

గ్యాంగ్ రేప్ కేసులో దోషిగా మాజీ మంత్రివర్యుడు.. జీవిత ఖైదు ఖరారు

వారికి ప్రత్యేక అవగాహన కూడా నిర్వహించనున్నట్లు చెప్పారు. రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి వీణా జార్జి శుక్రవారం అధికారులతో సమావేశమై వయనాడ్ లో పరిస్థితిని సమీక్షించారు. drinking water వనరులను పరిశుభ్రంగా ఉంచడంతో పాటు, బాధితులకు తగిన చికిత్స అందించడం వంటి చర్యల ద్వారా వ్యాధి త్వరలోనే అదుపులోకి వస్తుందని అధికారులు తెలిపారు.

లక్షణాలు :  అమెరికాలోని సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ (CDC) సమాచారం ప్రకారం norovirus బారిన పడిన వారికి వాంతులు కావడం, వికారం, కడుపు నొప్పి వంటి లక్షణాలు ఉంటాయి. జ్వరం, తలనొప్పి, ఒళ్లు నొప్పులు కూడా ఉండొచ్చు.

 వ్యాప్తి :  వైరస్ బారిన పడిన వారితో సన్నిహితంగా మెలగడం. కలుషిత నీరు, ఆహారం తీసుకోవడం. చేతులను శుభ్రం చేసుకోకుండా నోట్లో పెట్టుకోవడం వంటి వాటి ద్వారా  నోరో వ్యాప్తి చెందుతుంది.

ఇదిలా ఉండగా, గత రెండు రోజుల క్రితం దేశంలో కరోనా పాజిటివిటీ రేటు 0.90 శాతంగా రికార్డైంది. 37 రోజులుగా 2 శాతం కంటే రోజువారీ కరోనా పాజిటివిటీ రేటు నమోదైందని గణాంకాలు చెబుతున్నాయి. దేశంలో కరోనాతో మరణించిన వారి సంఖ్య 4.61 లక్షలకు చేరుకొంది. గత 24 గంటల్లో కరోనాతో దేశంలో 460 మంది మరణించారు.

అయితే కేరళ రాష్ట్రంలోనే 384 మంది చనిపోయారని ఆ రాష్ట్రం ప్రకటించింది. కరోనా మృతులకు సంబంధించి కేరళ రాష్ట్రం లెక్కలను సవరిస్తుంది. దీంతో కరోనా మృతుల సంఖ్య కేరళ రాష్ట్రంలో ఎక్కువగా నమోదౌతుంది.

ఇండియాలో 2020 ఆగష్టు 7న 20 లక్షలు, ఆగష్టు 23న 30 లక్షలు, సెప్టెంబర్ 5న 40 లక్షలు,సెప్టెంబర్ 16న 50 లక్షలకు కరోనా కేసులు చేరాయి. సెప్టెంబర్ 28న 60 లక్షలు, అక్టోబర్ 11న 70 లక్షలు, అక్టోబర్ 29న 80 లక్షలు, నవంబర్ 20న 90 లక్షల కేసులు దాటాయి.డిసెంబర్ 19న కోటి కేసులను దాటాయి.ఈ ఏడాది మే 4న  రెండు కోట్ల కేసులను దాటాయి.ఈ ఏడాది జూన్ 23న కరోనా కేసులు మూడు కోట్లను దాటాయి.నిన్న దేశంలోని 52,69,137 మంది వ్యాక్సిన్ తీసుకొన్నారు. ఇప్పటివరకు 109 కోట్ల మంది కరోనా వ్యాక్సిన్ వేసుకొన్నారని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది.

Follow Us:
Download App:
  • android
  • ios