Asianet News TeluguAsianet News Telugu

గ్యాంగ్ రేప్ కేసులో దోషిగా మాజీ మంత్రివర్యుడు.. జీవిత ఖైదు ఖరారు

గ్యాంగ్ రేప్ కేసులో ఓ మాజీ మంత్రి దోషిగా తేలాడు. ఆయనతోపాటు మరో ఇద్దరికి లక్నోలోని ప్రత్యేక న్యాయస్థానం యావజ్జీవ ఖారాగార శిక్ష విధించింది. చిత్రకూట్‌కు చెందిన మహిళపై పలుమార్లు వీరు లైంగికదాడి పాల్పడ్డారు. ఆమె మైనర్ కూతురిపైనా రేప్‌కు యత్నించినట్టు బాధితురాలు ఫిర్యాదు చేశారు.

UP former minister held guilty in gang rape case to serve life in jail
Author
Lucknow, First Published Nov 12, 2021, 9:03 PM IST

న్యూఢిల్లీ: ఆయన రాష్ట్ర మంత్రిగా వెలగబెట్టాడు. రాష్ట్ర ప్రజల సంక్షేమం కోసం ఆలోచించాల్సిన ఆ రాజకీయ నేత అఘాయిత్యానికి పాల్పడ్డాడు. మరో ఇద్దరితో కలిసి ఏకంగా గ్యాంగ్ రేప్‌కు పాల్పడ్డాడు. అంతటితో ఆగలేదు. ఆ మహిళ మైనర్ కూతురిపైనా కన్నేశాడు. ఈ తరుణంలో బాధితురాలు సుప్రీంకోర్టును ఆశ్రయించడంతో కేసు ఫైల్ అయింది. ఆ సామూహిక అత్యాచారం కేసులో రాష్ట్ర మంత్రి దోషిగా తేలాడు. తాజాగా, ఓ ప్రత్యేక న్యాయస్థానం ఆయనకు జీవిత ఖైదు శిక్షను విధించింది.

Uttar Pradeshలో అఖిలేష్ యాదవ్ సారథ్యంలోని సమాజ్‌వాదీ ప్రభుత్వం ఉన్నప్పుడు క్యాబినెట్ మంత్రిగా Gayatri Prasad Prajapati బాధ్యతలు నిర్వహించారు. కీలకమైన రవాణా, గనుల శాఖకు Ministerగా బాధ్యతలు వహించారు. చిత్రకూట్‌కు చెందిన ఓ మహిళ ఆయనపై గ్యాంగ్ రేప్ ఆరోపణలు చేసింది. కేసు పెట్టడానికి పోలీసులను ఆశ్రయించినా ఆమెకు సానుకూల వాతావరణం కనిపించలేదు. పోలీసులు నిర్లక్ష్యం వహించారు. తన ఆరోపణలను ఖాతరు చేయలేదు. దీంతో ఆమె సుప్రీంకోర్టును ఆశ్రయించక తప్పలేదు. తన ఫిర్యాదుపై పోలీసులు చర్యలు తీసుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ పిటిషన్‌పై విచారణ చేసిన సుప్రీంకోర్టు కేసు పెట్టాల్సిందిగా ఉత్తరప్రదేశ్ పోలీసులకు సూచనలు చేసింది.

Also Read: నాలుగేళ్ల చిన్నారిపై రేప్: నిందితుడికి నెల రోజుల్లోనే జీవిత ఖైదు

సుప్రీంకోర్టు మార్గదర్శకాల మేరకు గౌతంపల్లి పోలీసు స్టేషన్‌లో Gang Rape ఆరోపణలపై ఎఫ్ఐఆర్ నమోదైంది. 2017 ఫిబ్రవరి 18న కేసు ఫైల్ అయింది. దర్యాప్తులో భాగంగా 2017 మార్చిలో మాజీ మంత్రి గాయత్రి ప్రసాద్ ప్రజాపతిని పోలీసులు అరెస్టు చేశారు. ఈ కేసును లక్నోలోని ఓ ప్రత్యేక న్యాయస్థానం విచారిస్తున్నది.

సదరు మహిళపై గ్యాంగ్ రేప్, ఆమె మైనర్ కూతురిపైనా అత్యాచార యత్నం ఆరోపణల్లో మాజీ మంత్రి ప్రజాపతిని ప్రత్యేక న్యాయమూర్తి పీకే రాయ్ దోషిగా తేల్చారు. ప్రజాపతితో పాటు మరో ఇద్దరు నిందితులను దోషులుగా ప్రకటించారు. ఈ ముగ్గురిపై ఆరోపణలకు ఆధారాలున్నాయని, ఎలాంటి సంశయాలు లేకుండానే తీర్పు వెలువరిస్తున్నట్టు వివరించారు. 

Also Read: అత్యాచారం-హత్య కేసుల్లో మైనర్లకు మరణశిక్ష.. ! సుప్రీంకోర్టు సంచలన తీర్పు.. !!

ఈ కేసులో తీర్పు వెలువరిస్తూ మరో నలుగురు నిందితులను నిర్దోషులుగా కోర్టు వదిలిపెట్టింది. సరైన ఆధారలు లేనందున వికాస్ వర్మ, రూపేశ్వర్, అమరేంద్ర సింగ్ అలియాస్ పింటూ, చంద్రపాల్‌లను నిర్దోషులగా విడిచి పెట్టింది. ఈ కేసు విచారణలో న్యాయ స్థానం 17 మంది సాక్షులను విచారించింది. 

2014 అక్టోబర్ నుంచి మాజీ మంత్రి ప్రజాపతి, ఆయన అనుచరులు తనపై లైంగిక దాడికి పాల్పడుతూనే ఉన్నారని బాధితురాలు ఫిర్యాదులో పేర్కొన్నారు. 2016 జులైలో తన మైనర్ కూతురిపైనా లైంగిక దాడికి యత్నించారని తెలిపారు. అందుకే మాజీ మంత్రి, ఆయన అనుచరులపై కేసు పెట్టాలనే నిర్ణయానికి వచ్చారని వివరించారు. మాజీ మంత్రి ప్రజాపతితోపాటు అశిశ్ శుక్లా, అశోక్ తివారీలకు జీవిత ఖైదు శిక్ష పడింది.

Follow Us:
Download App:
  • android
  • ios