మహారాష్ట్రలో శుక్రవారం నాడు ఘోర  రోడ్డు ప్రమాదం జరిగింది.ఈ ప్రమాదంలో 13 మంది మృతి చెందారు. టిప్పర్ బోల్తా పడిన ఘటనలో కూలీలు మరణించారు. బుల్తానాలోని ఎక్స్‌ప్రెస్ హైవేపై  టిప్పర్ అదుపుతప్పి బోల్తా పడింది.

ముంబై:మహారాష్ట్రలో శుక్రవారం నాడు జరిగిన రోడ్డు ప్రమాదంలో 13 మంది మరణించారు. బుల్ధానా జిల్లాలో టిప్పర్ బోల్తా పడినఘటనలో 13 మంది కూలీలు మరణించారు. టిప్పర్ పైన కూలీలు కూర్చొన్నారు. టిప్పర్ అదుపుతప్పి బోల్తా పడడంతో టిప్పర్‌పైన కూర్చొన్న కూలీలు అక్కడికక్కడే మరణించారు.

&

Scroll to load tweet…

nbsp;

సింధఖేదరాజా తాలుకాలోని తాడేగావ్ దుసర్‌బిడ్ వద్ద ఇనుప చువ్వలు తీసుకెళ్తున్న టిప్పర్ బోల్తాపడింది.ఈ టిప్పర్‌లో 18 మంది కార్మికులున్నారు. ఈ ప్రమాదంలో13 మంది మరణించారని అధికారులు ధృవీకరించారు..మరో ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు. గాయపడినవారిని సమీపంలోని ఆసుపత్రికి తరలించారు.

భారీ వర్షం కారణంగా టిప్పర్ రోడ్డుపై అదుపుతప్పి బోల్తాపడిందని పోలీసులు చెప్పారు. ఈ ప్రమాదంలో 8 మంది కూలీలు అక్కడికక్కడే మరణించారు. మరో 5 మంది ఆసుపత్రికి తరలిస్తుండగా మరణించారు.బుల్తాన్ జిల్లాలో సమృద్ది హైవే పనులు జరుగుతున్నాయి. ఈ పని కోసం కూలీలు టిప్పర్ పై వెళ్తున్న సమయంలో ఈ ప్రమాదం జరిగింది .