Asianet News TeluguAsianet News Telugu

బీహార్ లో 12వ తరగతి మ్యాథ్స్ పేపర్ లీక్.. వాట్సాప్‌లో ప్రశ్నాపత్రం హల్ చల్

బీహార్ లో ఇంటర్ పరీక్ష పేపర్ లీక్ అయ్యింది. సెకెండియర్ చదివే విద్యార్థుల కోసం బీఎస్ ఈబీ నిర్వహించిన మ్యాథ్స్ పేపర్ వాట్సప్ గ్రూపుల్లో హల్ చల్ చేసింది. దీనిని పలువురు విద్యార్థులు అధికారుల దృష్టికి తీసుకెళ్లారు.

12th Class Maths Paper Leaked in Bihar.. Question Paper on WhatsApp
Author
First Published Feb 1, 2023, 5:46 PM IST

బీహార్ స్కూల్ ఎగ్జామినేషన్ బోర్డ్ (బీఎస్ ఈబీ) 12వ తరగతి పరీక్షలు నేడు ప్రారంభమయ్యాయి. అయితే మొదటి రోజునే ఇంటర్ సెకెండియర్ మ్యాథ్స్ ప్రశ్నాపత్రం లీక్ అయ్యింది. అనేక వాట్సప్ గ్రూపుల్లో ఈ ప్రశ్నాపత్రం షేర్ అయ్యింది. దీంతో విద్యార్థులు ఒక్క సారిగా ఆందోళనకు గురయ్యారు. 

పలువురు విద్యార్థులు ఈ విషయాన్ని అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. ఆ లీక్ అయిన ప్రశ్నాపత్రాలను సోషల్ మీడియాలోకి పోస్టు చేస్తూ అధికారులను ట్యాగ్ చేశారు. బీఎస్ఈబీ మ్యాథ్స్ (ఐఎస్సీ), గణితం (ఐఏ) కోసం బీఎస్ఈబీ బోర్డు పరీక్ష ఈరోజు మొదటి షిఫ్ట్‌లో ఉదయం 9:30 నుండి మధ్యాహ్నం 12:45 గంటల వరకు నిర్వహించారు.

ప్రతి ఒక్కరికి మేలు చేసే బడ్జెట్: కేంద్ర బడ్జెట్ 2023పై కేంద్ర మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ 

అందుబాటులో ఉన్న నివేదికల ప్రకారం మోతిహారి, ముజఫర్‌పూర్‌లోని వాట్సాప్ గ్రూపులలో బీహార్ బోర్డు మ్యాథ్స్ పేపర్ వైరల్ అవుతోంది. విద్యార్థులు వాట్సాప్ ద్వారా పరీక్షా కేంద్రానికి చేరుకోకముందే పేపర్ లీక్ అయింది. ఈ నివేదికలపై ఇప్పటి వరకు అధికారులు స్పందించలేదు.

బీహార్ బోర్డు ఇంటర్మీడియట్ పరీక్షను రెండు సిట్టింగ్‌లలో నిర్వహిస్తోంది. మొదటి షిప్టు పరీక్ష ఉదయం 9:30 నుంచి మధ్యాహ్నం 12:45 గంటల మధ్య, రెండో షిప్టు పరీక్ష మధ్యాహ్నం 1:45 నుంచి సాయంత్రం 5 గంటల మధ్య నిర్వహించనున్నారు. ఈ పరీక్షలు ఫిబ్రవరి 11వ తేదీన ముగియనున్నాయి.

ఇదిలా ఉండగా.. గతేడాది డిసెంబర్ 24వ తేదీన రాజస్థాన్ లో కూడా పేపర్ లీక్ అయ్యింది.  పబ్లిక్ సర్వీస్ కమిషన్ (పీఆర్ పీసీ) నిర్వహించిన సీనియర్ టీచర్ (సెకండరీ ఎడ్యుకేషన్ డిపార్ట్‌మెంట్) పరీక్ష-2022 జీకే పేపర్ బయటకు విడుదలైంది. దీంతో ఆ రాష్ట్ర ప్రభుత్వం పరీక్షను రద్దు చేసింది. అయితే పరీక్ష రద్దు కావడంతో అభ్యర్థులు ఒక్క సారిగా నిరాశకు లోనయ్యారు. పలుచోట్ల అభ్యర్థులు ఆందోళన వ్యక్తం చేశారు.

బడ్జెట్ ప్రసంగం పై ఇంటర్నెట్‌లో ఫన్నీ మీమ్స్‌.. ‘ఎవరి బాధలు వారివి’

ఈ పరీక్షను 24వ తేదీ (శనివారం) ఉదయం 9 గంటల నుంచి 11 గంటల వరకు జీకే పేపర్ పరీక్ష చేపట్టాల్సి ఉంది. అయితే పరీక్ష ప్రారంభానికి ముందే ఉదయపూర్‌లోని బకేరియాలో చాలా మంది అభ్యర్థుల దగ్గర పేపర్ కనిపించింది. బస్సులో ప్రయాణిస్తున్న కొందరు యువకుల వద్ద ఈ పేపర్లు కనిపించడంతో అధికారులు స్వాధీనం చేసుకున్నారు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. ఇదే రాష్ట్రంలో నవంబర్ 12వ తేదీన నిర్వహించిన ఫారెస్ట్ గార్డ్ రిక్రూట్‌మెంట్ -2022 పరీక్ష పేపర్ లీక్ అయింది. దీంతో ఆ పరీక్షను కూడా ప్రభుత్వం రద్దు చేసింది. ఈ పరీక్షను ఈ ఏడాది డిసెంబర్ నెలలో లేదా 2023 జనవరి నెలలో నిర్వహిస్తామని అధికారులు ప్రకటించారు. అయితే ఈ పరీక్ష పేపర్ లీక్ లో ప్రమేయం ఉన్న ఇద్దరిని పోలీసులు అరెస్టు చేశారు. ఇందులో ఒక ప్రభుత్వ ఉద్యోగి కూడా ఉన్నారు.

Follow Us:
Download App:
  • android
  • ios