Asianet News TeluguAsianet News Telugu

మైనర్ సోదరుడితో గర్భం దాల్చిన 12 ఏళ్ల చిన్నారి.. అబార్షన్ కు కేరళ హైకోర్టు అనుమతి నిరాకరణ...

పిండం ఇప్పటికే 34 వారాల వయసుకు చేరుకోవడంతో గర్భవిచ్చిత్తి సాధ్యం కాదనే కారణంతో అబార్ట్ చేయడానికి కోర్టు అనుమతి నిరాకరించింది.

12-year-old girl who got pregnant in Incestuous Relationship with minor brother, High court denies abortion request - bsb
Author
First Published Jan 3, 2024, 10:20 AM IST

కేరళ :  మైనర్ సోదరుడితో వివాహేతర సంబంధం పెట్టుకుని గర్భం దాల్చిన 12 ఏళ్ల బాలిక విషయంలో కేరళ హైకోర్టు ఇచ్చిన తీర్పు చర్చనీయాంశంగా మారింది. ఈ గర్భాన్ని వైద్యపరంగా తొలగించడానికి అనుమతినివ్వాలని పెట్టుకున్న పిటిషన్ కు కేరళ హైకోర్టు అనుమతి నిరాకరించింది.

బాలిక కడుపులో పిండం ఇప్పటికే 34 వారాలకు చేరుకుంది. పిండం పూర్తిగా అభివృద్ధి చెందిందని.. ఈ సమయంలో గర్భవిచ్ఛిత్తి చేయాలనడం సరికాదనే కారణంతో అబార్ట్ చేయడానికి కోర్టు అనుమతి నిరాకరించింది.

"పిండం ఇప్పటికే 34 వారాల గర్భధారణకు చేరుకుంది. ఇప్పుడు పూర్తిగా అభివృద్ధి చెందింది, గర్భంలో ఊపిరిపోసుకుంటోంది. ఈ సమయంలో గర్భం రద్దు చేయడం అసాధ్యం కాకపోయినా, రద్దు స్పష్టంగా సాధ్యం కాదు. అందువల్ల, బిడ్డ పుట్టడానికి అనుమతించవలసి ఉంటుంది”అని లైవ్ లా ప్రకారం హైకోర్టు పేర్కొంది.

ఢిల్లీ లిక్కర్ స్కాం: మూడోసారి ఈడీ విచారణకు అరవింద్ కేజ్రీవాల్ దూరం

మైనర్ బాలికను పిటిషనర్లు/తల్లిదండ్రుల కస్టడీలో, వారి సంరక్షణలో ఉంచాలని జస్టిస్ దేవన్ రామచంద్రన్ ఆదేశించారు. బాలికపై ఆరోపణలు చేసిన ఆమె మైనర్ సోదరుడిని అమ్మాయి దగ్గరికి రాకుండా, ఆమెతో కలవడానికి అనుమతించకుండా చూసుకోవాలని అధికారులు, తల్లిదండ్రులను కోర్టు ఆదేశించింది.

“చట్టంలోని వర్తించే నిబంధనలు ఉల్లంఘించబడకుండా చూసుకోవడానికి ఇది తోడ్పడుతుంది అని కోర్టు పేర్కొంది. 12 ఏళ్ల బాలిక తల్లిదండ్రులు ఆమె 34 వారాల గర్భాన్ని వైద్యపరంగా రద్దు చేయాలని కోరుతూ కోర్టును ఆశ్రయించారు. గర్భం దాల్చడం వల్ల మైనర్ బాలికకు శారీరక, మానసిక సమస్యలు తలెత్తే అవకాశం ఉందని పిటిషనర్లు వాదిస్తూ, గర్భం దాల్చినట్లు ఇటీవలి వరకు తమకు తెలియదని కోర్టుకు తెలిపారు.

గత ఏడాది ఏప్రిల్‌లో, కలకత్తా హైకోర్టు అత్యాచారం, లైంగిక వేధింపులకు గురైన 12 ఏళ్ల మైనర్ బాలికకు గర్భం దాల్చేందుకు వైద్యపరమైన అనుమతిని నిరాకరించింది. గర్భం రద్దు చేయడం వల్ల ప్రసూతి మరణం సంభవించే ప్రమాదం ఉందని కోర్టు పేర్కొంది.

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios