Asianet News TeluguAsianet News Telugu

ఢిల్లీ లిక్కర్ స్కాం: మూడోసారి ఈడీ విచారణకు అరవింద్ కేజ్రీవాల్ దూరం

ఢిల్లీ లిక్కర్ స్కాంలో  ఈడీ విచారణకు ఇవాళ కూడ  ఢిల్లీ ముఖ్యమంత్రి  అరవింద్ కేజ్రీవాల్ దూరంగా ఉండననున్నారు.  ఇవాళ విచారణకు రావాలని  ఈడీ అధికారులు  కేజ్రీవాల్ కు నోటీస్ పంపిన విషయం తెలిసిందే.

 Delhi Chief Minister Arvind Kejriwal to skip ED summons in Delhi excise policy case today lns
Author
First Published Jan 3, 2024, 9:27 AM IST

న్యూఢిల్లీ: ఢిల్లీ లిక్కర్ స్కాంలో  ఢిల్లీ ముఖ్యమంత్రి  అరవింద్ కేజ్రీవాల్  బుధవారం నాడు కూడ  ఎన్‌ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ)విచారణకు దూరంగా ఉండనున్నారు.  ఇవాళ విచారణకు రావాలని  ఎన్‌ఫోర్స్ మెంట్  డైరెక్టరేట్  అధికారులు అరవింద్ కేజ్రీవాల్ కు  నోటీసులు పంపారు. అయితే  ఇవాళ కూడ విచారణకు  దూరంగా ఉండాలని నిర్ణయం తీసుకున్నారు.ఈ మేరకు ఈడీ అధికారులు  ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్  ఇవాళ ఓ లేఖ రాశారు.

ఈడీ దర్యాప్తునకు సహకరించేందుకు  సిద్దంగా ఉన్నట్టుగా ఆ లేఖో పేర్కొన్నారు. కానీ,  ఈడీ ఇచ్చిన నోటీస్ చట్ట విరుద్దమని ఆయన పేర్కోన్నారు.ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ను  అరెస్ట్ చేసేందుకు  ప్రయత్నాలు చేస్తున్నారని ఆప్  ఆరోపణలు చేస్తుంది.  ఢిల్లీ లిక్కర్ స్కాంలో  విచారణకు రావాలని  ఇప్పటికే  మూడ దఫాలు  ఈడీ అధికారులు అరవింద్ కేజ్రీవాల్ కు నోటీసులు పంపారు.

ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కు ఇప్పటికే  మూడు దఫాలు  ఈడీ అధికారులు నోటీసులు పంపారు.  గత ఏడాది డిసెంబర్  18న రెండో దఫా  ఈడీ అధికారులు  అరవింద్ కేజ్రీవాల్ కు సమన్లు పంపారు. అయితే  ఈడీ విచారణకు  ఆయన దూరంగా ఉన్నారు. ముందుగా నిర్ణయించుకున్న  విపాసన ధ్యాన శిబిరానికి కేజ్రీవాల్ వెళ్లారు.

2023 అక్టోబర్ మాసంలో  ఈడీ అధికారులు  కేజ్రీవాల్ కు తొలిసారిగా  నోటీసులు పంపారు.  అయితే  ఆ సమయంలో  ముందుగా నిర్ణయించుకున్న కార్యక్రమాల నేపథ్యంలో విచారణకు రాలేనని  కేజ్రీవాల్ ఈడీ అధికారులకు లేఖ రాశారు. 

ఈడీ అధికారులు తనకు  సమన్లు పంపడం అక్రమమని  కేజ్రీవాల్ పేర్కొన్నారు.రాజకీయ ప్రేరేపితం కారణంగానే  ఈడీ అధికారులు తనకు  నోటీసులు పంపారని ఆయన ఆరోపించారు.

మనీ లాండరింగ్  ఆరోపణల నేపథ్యంలో  ఢిల్లీ లిక్కర్ స్కాంలో  కేజ్రీవాల్ ను విచారించాలని  ఈడీ అధికారులు నిర్ణయం తీసుకున్నారు.  ఢిల్లీ లిక్కర్ స్కాంలో  2023 ఏప్రిల్ మాసంలో  సీబీఐ అధికారులు  కేజ్రీవాల్ ను విచారించారు. ఆమ్ ఆద్మీ పార్టీకి చెందిన సీనియర్ నేతలు  సంజయ్ సింగ్,  మనీష్ సిసోడియాను  దర్యాప్తు అధికారులు ఇప్పటికే అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే.


 

Follow Us:
Download App:
  • android
  • ios